For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం మానేసి చాయ్ అమ్ముకున్నా చాలు.. నెలకు లక్షల్లో సంపాదించొచ్చు

చాయ్ తాగేవాళ్లు అంతమంది ఉన్నారు కాబట్టి ఆ వ్యాపారం చేసేవాళ్లకు కూడా బాగా గిట్టుబాటు అవుతోంది. గిట్టుబాటు అంటే ఏదో ఖర్చులు పోను పదో పాతికో మిగులుతుందనుకుంటే పొరపాటే. లక్షల్లో ఆదాయం ఉంది.

|

ఒక పూట అన్నం తినకుండానైనా ఉంటారేమోగానీ చాయ్ తాగకుండా మాత్రం ఎవరూ ఉండరు. మనదేశం మొత్తం మీద జనాలు ఇప్పుడు ఛాయ్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. ఎప్పుడు చూసిన టీ స్టాల్స్ మొత్తం కిటికిటలాడుతుంటాయి. చాయ్ తాగేవాళ్లు అంతమంది ఉన్నారు కాబట్టి ఆ వ్యాపారం చేసేవాళ్లకు కూడా బాగా గిట్టుబాటు అవుతోంది.

లక్షల్లో ఆదాయం

లక్షల్లో ఆదాయం

గిట్టుబాటు అంటే ఏదో ఖర్చులు పోను పదో పాతికో మిగులుతుందనుకుంటే పొరపాటే. చాయ్ అమ్ముతూ లక్షల్లో ఆదాయం సంపాదించేవాళ్లు చాలామందే ఉన్నారు.

బాగా ఫేమస్

బాగా ఫేమస్

అయితే ఈ మధ్య ఒకాయన కేవలం చాయ్ బిజినెస్ మీద నెలకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాని చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు.

యెవ్లె టీ హౌస్

యెవ్లె టీ హౌస్

అసలు ఆయన కథ ఏంటో ఒకసారి చూద్దామా. మహారాష్ట్రలోని పూణెలో యెవలె టీ హౌస్‌ను ఏర్పాటు చేశాడు ఆయన. ఆయన పేరు నవ్‌నాథ్‌ యేవలే.

పుణెలో మంచి డిమాండ్

పుణెలో మంచి డిమాండ్

దేశం మొత్తం మీద టీకి మంచి డిమాండ్ ఉన్నా పుణెలో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని గుర్తించాడు నవ్‌నాథ్‌ యేవలె. అయితే చాయ్ కి మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ ప్రఖ్యాత టీ బ్రాండ్లు, ఔట్‌లెట్‌లు ఏవీ పుణెలో ఉండేవి కావు.

టీ వ్యాపారం చేయలనుకున్నాడు

టీ వ్యాపారం చేయలనుకున్నాడు

దీంతో 2011లో యేవలే తాను టీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అలాంటి ఇలాంటి టీ కాదు.. తాగితే జనాలు మైమరిచిపోవాలి. ప్రతి రోజూ తన టీనే తలుచుకోవాలి అని నవ్‌నాథ్‌ యేవలె అనుకున్నాడు.

నాలుగేళ్లు పరిశోధనలు

నాలుగేళ్లు పరిశోధనలు

నవ్‌నాథ్‌ యేవలె తన టీ రుచి ఎలా ఉండాలనే దానిపై ఏకంగా నాలుగేళ్లు పరిశోధనలు చేశారు. అనంతరం మరికొందరిని భాగస్వాములుగా చేర్చుకుని తన పేరుమీదనే చాయ్‌ దుకాణం తెరిచారు.

భారీ డిమాండ్

భారీ డిమాండ్

కొద్దిరోజుల్లోనే ఆయన టీకి భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో పుణెలోనే మరో రెండు చోట్ల యేవలే ఔట్‌లెట్‌లను తెరిచారు. ఇప్పుడు ఒక్కో ఔట్‌లెట్‌లో 12 మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు.

నాలుగు వేల కప్పుల చాయ్

నాలుగు వేల కప్పుల చాయ్

రోజుకు దాదాపు 4 వేల కప్పుల చాయ్‌ అమ్ముడుపోతోంది. దీనికితోడు ఆయన తన టీ హౌస్‌ను ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే యేవలే టీ స్టాల్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తానంటున్నాడు.

ఆనందంగా ఉంది

ఆనందంగా ఉంది

ఈ సందర్భంగా యెవల్ మాట్లాడుతూ ‘మేము టీ దుకాణం ద్వారా చేస్తున్నవ్యాపారం వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకు ఎంతో ఆనందంగా ఉన్నాం. మాకు పూణెలో మూడు బ్రాంచీలున్నాయి. ప్రతీ బ్రాంచీలో 12 మంది సిబ్బంది ఉన్నారు' అని తెలిపాడు.

మరింత మంది ఉపాధి

మరింత మంది ఉపాధి

దేశవ్యాప్తంగా మరో వంద టీ స్టాల్స్‌ ఏర్పాటు చేసి వేల మందికి ఉద్యోగాలిస్తానని యెవ్లె చెబుతున్నారు.

12 లక్షల ఆదాయం

12 లక్షల ఆదాయం

త‌న‌కు చాయ్ అమ్మ‌డం ద్వారా నెల‌కు రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంద‌ని అన్నాడు యెవ్లె. అంద‌రూ పెట్టిన‌ట్టుగానే తాను కూడా ఒక టీ స్టాల్ పెట్టి అంద‌రూ అమ్మినట్టు సాధార‌ణ టీ అమ్మితే త‌న‌కు ఏం లాభం వచ్చేది కాదన్నాడు.

చాలా గ్రౌండ్ వర్క్

చాలా గ్రౌండ్ వర్క్

ఎక్క‌డైనా స్పెష‌ల్ చాయ్ దొరికితేనే క‌దా జనాలు వచ్చేది.. తాగేది. క‌నుక‌నే నేను చాయ్ స్టాల్‌ను ఓపెన్ చేయ‌డానికి ముందు నేను నాలుగేళ్లు బాగా గ్రౌండ్ వ‌ర్క్ చేశాను. పూణె మొత్తం తిరిగాను. దాదాపు అన్ని ర‌కాల చాయ్‌ల‌ను టేస్ట్ చేశాను. చివ‌ర‌కు త‌న‌దైన బ్రాండ్ క్రియేట్ చేసేలా తాను ఒక స్పెష‌ల్ చాయ్‌ను త‌యారు చేసి అమ్మ‌డం మొద‌లు పెట్టాను అంటున్నాడు యెవ్లె.

English summary

pune tea seller makes rs 12 lakh per month

pune tea seller makes rs 12 lakh per month..Navnath Yewle, co-founder of Yewle Tea house, says he is going to make it an international brand very soon. "Unlike 'pakora' business, this tea selling business is also creating employment for Indians.
Desktop Bottom Promotion