For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ అక్కడ పెద్ద దేవుడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు, మొక్కితే యాక్సిడెంట్స్ కావు

ఈ బుల్లెట్ ను దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇదంతా ఎక్కడా అనే కదా మీ సందేహం... రాజస్థాన్ లో. జోధ్‌ పూర్‌ కు యాభై కిలోమీటర్ల దూరంలోని పాలి అనే ప్రాంతంలో బైక్ పూజలుఅందుకుంటుంది

|

సాధారణంగా భక్తులందరూ కూడా తమ ఇష్టదేవతలను, దేవుళ్లను పూజిస్తుంటారు. ఒక్కో దేవుడికి ఒక్కో చరిత్ర ఉంటుంది. కొందరు దేవుళ్లు వెలిసిన కారణంగా వారికి ఆలయాలు నిర్మించి పూజలు చేస్తారు. కొందరు దేవుళ్లు అక్కడ పుట్టారని భావించి గుడులు కడతారు. కానీ అక్కడ వెరైటీగా బైక్ ను పూజిస్తారు. బుల్లెట్ కు పూజలు చేస్తారు.

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అక్కడ దేవుడు

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అక్కడ దేవుడు

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ అందరికీ ఇష్టమే. దాన్ని నడిపితే ఆ రాజసమే వేరు అన్నట్లుగా ఫీలు అవుతారు చాలా మంది. కానీ అదే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అక్కడ దేవుడిలా పూజిస్తారు. తమ కోరికలు తీర్చే కొంగుబంగారంగా భావిస్తారు. ఆ బుల్లెట్ బండికి రోజూ పూజలు చేస్తారు. పూలమాలలతో అలంకరించి, బొట్లు పెట్టి అభిషేకాలు చేస్తారు.

వేలాది మంది భక్తులు తరలివస్తారు

వేలాది మంది భక్తులు తరలివస్తారు

ఈ బుల్లెట్ ను దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇదంతా ఎక్కడా అనే కదా మీ సందేహం... రాజస్థాన్ లో. జోధ్‌ పూర్‌ కు యాభై కిలోమీటర్ల దూరంలోని పాలి అనే ప్రాంతంలో బైక్ ఇలా పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం పేరు ఓం బన్నా. బుల్లెట్ ను ఇప్పుడు బుల్లెట్ బాబాగా ఇక్కడ పూజిస్తున్నారు. అయితే ఈ బుల్లెట్ భగవానుడి వెనుకు ఒక కథ ఉంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ పై ఊరికి బయల్దేరాడు

రాయల్ ఎన్ ఫీల్డ్ పై ఊరికి బయల్దేరాడు

డిసెంబర్ 2, 1988 వ సంవత్సరం ఓం సింగ్ రాథోడ్ (ఓం బన్నా) తన రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైక్ పై చోటిలా అనే ఊరికి బయల్దేరాడు. గ్రామానికి కొంత సమీపంలోనే బైక్ ఒక చెట్టుకు ఢీ కొనింది. దీంతో ఓం బన్నా పక్కనే ఉన్న ఒక గుంతలో పడిపోయాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.

బుల్లెట్ చెట్టుకు ఢీకొనడంతో..

బుల్లెట్ చెట్టుకు ఢీకొనడంతో..

తర్వాత సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారు. బుల్లెట్ చెట్టుకు ఢీకొనడంతోనే ఓం సింగ్ రాథోడ్ మరణించాడని ధ్రువీకరించుకుని, బుల్లెట్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే రాత్రికిరాత్రి బుల్లెట్ మళ్లీ ప్రమాద స్థలానికి చేరుకుంది. దీంతో ఎవరో కావాలని ఇలా చేశారని అనుకున్నారు పోలీసులు. తర్వా త స్టేషన్ కు తీసుకెళ్లారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు

పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు

తర్వాత బుల్లెట్ లో పెట్రోల్ మొత్తం తీసేసి, దాన్ని గొలుసులతో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. అయితే మళ్లీ తెల్లారేసరికి ఆ బైక్ ప్రమాద స్థలంలో ప్రత్యక్షమైంది. దీంతో అందరికీ ఆశ్చర్యవేసింది. పోలీసులు ఎన్నిసార్లు తీసుకెళ్లినా కూడా అలా మళ్లీ మళ్లీ జరగడంతో పోలీసులు కూడా షాక్ తిన్నారు.

బుల్లెట్ ను ఓం బన్నా పేరుతో పిలుచుకుంటూ

బుల్లెట్ ను ఓం బన్నా పేరుతో పిలుచుకుంటూ

ఇక స్థానికులు తమ ఓంసింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ లో ఉందని అందుకే అలా జరుగుతుందని భావించారు. బుల్లెట్ ను అక్కడే పెట్టమని పోలీసులను కోరారు. తర్వాత బుల్లెట్ ను ఓం బన్నా పేరుతో పిలుచుకుంటూ పూజలు చేయడం మొదలుపెట్టారు. ఓంసింగ్ రాథోడ్ పడి చనిపోయిన గుంత ప్రదేశంలోనే గుడి కట్టి పూజలు చేస్తున్నారు.

ఆత్మగా మారి బుల్లెట్ పై తిరుగుతున్నాడని

ఆత్మగా మారి బుల్లెట్ పై తిరుగుతున్నాడని

అయితే మొదట ఈ గుడికి స్థానికులు తప్ప ఎవరూ వచ్చేవారు కాదు. కానీ ఓంసింగ్ రాథోడ్ ఆత్మగా మారి బుల్లెట్ పై తిరుగుతున్నాడని, భక్తులు కోరిన కోరికలను ఓం బన్నా తీర్చుతున్నాడని ప్రచారం మొదలవ్వడంతో అందరూ బుల్లెట్ దేవుణ్ని పూజించడం మొదలుపెట్టారు.

ప్రమాదాలు జరగకుండా కాపాడుతాడని

ప్రమాదాలు జరగకుండా కాపాడుతాడని

ఓంబన్నాను పూజిస్తే తమకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతాడని జనాలకు నమ్మకం ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రతి ప్రయాణికుడు ఓం బన్నాను దర్శించుకుని, పూజలు చేపట్టి వెళ్తారు. ఒకవేళ ఆ రూట్ లో వెళ్లే వారు ఓం బన్నాను దర్శించుకోకుంటే ఇబ్బందులకు గురవుతారని స్థానికుల నమ్మకం.

మద్యాన్నినైవేద్యంగా పెడతారు

మద్యాన్నినైవేద్యంగా పెడతారు

ఇక ఈ బుల్లెట్ బాబాకు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. బుల్లెట్ బాబాకు మద్యాన్నినైవేద్యంగా పెడతారు. ఓం బాబాను నమ్మితే ఎలాంటి ప్రమాదాలు జరగదని భక్తుల విశ్వాసం. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఒక పుణ్యక్షేత్రం మాదిరిగా మారింది. గుడిలో ప్రత్యేకంగా అర్చకుళ్లు కూడా ఉన్నారు.

Image credit

English summary

rajasthan villagers worship royal enfield bike story about om banna bullet baba temple

rajasthan villagers worship royal enfield bike story about om banna bullet baba temple
Desktop Bottom Promotion