For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజీవ్ గాంధీని ఎలా చంపారు? రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు సోనియా ఏడుపుతో 10 జన్‌పథ్ గోడలు దద్దరిల్లాయి

ఆ రోజు 10 గంటల 25 నిమిషాలకు.... డిల్లీలో రాజీవ్ నివాసం 10, జన్‌పథ్ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. అప్పటికే సోనియా, ప్రియాంక కూడా నిద్రకు ఉపక్రమించారు.

|

40 ఏళ్ళ వ‌య‌సులో భార‌త యువ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్‌గాంధీ బ‌హుశా అప్పట్లో ప్ర‌పంచంలోనే అతి పిన్న‌వ‌య‌స్కులైన ప్ర‌భుత్వాధినేత‌ల్లో ఒక‌రు. ఆయ‌న త‌ల్లి ఇందిరాగాంధీ 1966లో మొద‌టిసారి ప్ర‌ధాన‌మంత్రి అయిన‌ప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8 ఏళ్ళు (48) పెద్ద‌. ప్ర‌ఖ్యాతివ‌హించిన‌ ఆయ‌న తాత పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛా భార‌తానికి తొలి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేనాటికి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు.

త‌ల్లి అంత్య‌క్రియ‌లు పూర్తికాగానే

త‌ల్లి అంత్య‌క్రియ‌లు పూర్తికాగానే

దేశంలో త‌రం మార్పుకు సంకేతంగా రాజీవ్‌గాంధీ దేశ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద మెజార్టీ సాధించారు. హ‌త్య‌కు గురైన త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌లు పూర్తికాగానే ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఆదేశించారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అంత‌కుముందు 7 సార్లు జ‌రిగిన ఎన్నిక‌లలో కంటే అత్య‌ధిక ఓట్ల‌ను సాధించింది. 508 లోక్‌స‌భ సీట్ల‌లో రికార్డుస్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది.

ఆల‌స్యంగా, అయిష్టంగా రాజ‌కీయాల్లో

ఆల‌స్యంగా, అయిష్టంగా రాజ‌కీయాల్లో

7 కోట్ల మంది భార‌తీయుల‌కు నాయ‌కునిగా అటువంటి శుభారంభం చేయ‌డం అది ఎటువంటి ప‌రిస్థితి అయినా చెప్పుకోద‌గిందే. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే రాజీవ్‌గాంధీ పూర్తిగా రాజ‌కీయ కుటుంబానికి చెందినవారు అయిన‌ప్ప‌టికీ ఆల‌స్యంగా, అయిష్టంగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించ‌డం, స్వాతంత్ర ఉద్య‌మంలోను, ఆ త‌రువాత 4 త‌రాలపాటు భార‌త‌దేశానికి సేవ‌లు అందించిన రాజ‌కీయ కుటుంబానికి చెందిన రాజీవ్‌గాంధీ అనివార్య ప‌రిస్థితుల్లోనే రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు.

రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు

రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు

రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20 ముంబైలో జ‌న్మించారు. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత ప్ర‌ధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ల‌క్నో నుంచి ఢిల్లీకి మ‌కాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడు అయ్యారు. నిర్భ‌యంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే పార్ల‌మెంటేరియ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు.

తీన్‌మూర్తి హౌస్‌లో

తీన్‌మూర్తి హౌస్‌లో

రాజీవ్‌గాంధీ త‌న బాల్యాన్ని తాత‌గారితో క‌ల‌సి తీన్‌మూర్తి హౌస్‌లో గ‌డిపారు. అక్క‌డ ఇంధిరాగాంధీ ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌కురాలిగా ప‌నిచేశారు. డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు. అక్క‌డ ఆయ‌న అనేక మందితో ప్ర‌గాఢ మైత్రిని పెంపొందించుకున్నారు. చిన్న‌త‌మ్ముడు సంజ‌య్‌గాంధీ కూడా ఆయ‌న‌తో క‌లిశారు.

మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు

మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు

స్కూల్ చ‌దువు పూర్త‌యిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. తర్వాత వెంటనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. రాజీవ్ గాంధీ సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారు. వెస్ట్ర‌న్‌, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్ట‌ప‌డేవారు.

పైలెట్ జీవితం ప్రారంభించారు

పైలెట్ జీవితం ప్రారంభించారు

రాజీవ్‌కు అత్యంత ఇష్ట‌మైన‌వి గాల్లో ప్ర‌యాణించ‌డం. ఇంగ్లండ్ నుంచి తిరిగివ‌చ్చిన వెంట‌నే ఢిల్లీ ఫ్లైయింగ్ క్ల‌బ్ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష పాసై క‌మ‌ర్షియ‌ల్ పైలెట్ లైసెన్సు తీసుకోవ‌డానికి వెళ్ళారు. అన‌తికాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్‌ లో పైలెట్ జీవితం ప్రారంభించారు.

సోనియా మైనోతో ఆయ‌న‌కు ప‌రిచ‌య‌ం

సోనియా మైనోతో ఆయ‌న‌కు ప‌రిచ‌య‌ం

కేంబ్రిడ్జ్ లో ఉన్న స‌మ‌యంలో ఇంగ్లీష్ చ‌దివే ఇటాలియ‌న్ మ‌హిళ సోనియా మైనోతో ఆయ‌న‌కు ప‌రిచ‌య‌మ‌యింది. 1968లో ఢిల్లీలో వారు ఇద్ద‌రూ పెళ్ళి చేసుకున్నారు. ఇద్ద‌రు పిల్ల‌లు రాహుల్‌, ప్రియాంక‌తో క‌ల‌సి వారు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లో నివాసం ఉన్నారు. చుట్టూ రాజ‌కీయ కోలాహ‌లం ఉన్న‌ప్ప‌టికీ వారిది మాత్రం పూర్తిగా వ్య‌క్తిగ‌త జీవితం.

త‌మ్ముని మృతి కార‌ణంగా

త‌మ్ముని మృతి కార‌ణంగా

1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి మారింది. అప్ప‌ట్లో అంత‌ర్గ‌తంగా, బ‌హిర్గ‌తంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వ‌డానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది. మొద‌ట్లో వీటిని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ త‌రువాత త‌ల వొగ్గ‌క త‌ప్ప‌లేదు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు.

ఆయన పాదాలను తాకేందుకు వంగగానే

ఆయన పాదాలను తాకేందుకు వంగగానే

1984 అక్టోబ‌ర్ 31న త‌ల్లి ఇందిరాగాంధీ దారుణ హ‌త్య‌కు గురైన స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రిగాను, కాంగ్రెస్ అధ్య‌క్షునిగాను ఆయ‌న బాధ్యతలు నిర్వ‌ర్తించాల్సి వ‌చ్చింది. అది 1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలు. స్థలం తమిళనాడులోని శ్రీపెరంబదూర్. ఒక యువతి ఒక గంధపు మాల తీసుకుని అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వైపు కదిలింది. ఆమె ఆయన పాదాలను తాకేందుకు వంగగానే, చెవులు పగిలిపోయేలా ఒక పేలుడు సంభవించింది. అయితే బాంబు పేలడానికి ముందు చిటపటమని టపాసులు పేలిన శబ్దం వచ్చింది, వెంటనే నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత భారీ శబ్దంతో బాంబు పేలింది.

రాజీవ్ కపాలం ఛిద్రమైంది

రాజీవ్ కపాలం ఛిద్రమైంది

శ్రీపెరంబదూర్‌లో ఆ భయంకర పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి అక్కడ ఉన్నారు. పొగలు అలముకోవడంతో రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన కపాలం ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది.

అందరి శరీరాలు మాంసం ముక్కలుగా మారాయి

అందరి శరీరాలు మాంసం ముక్కలుగా మారాయి

ఇక రాజీవ్ చూడడానికి వచ్చిన జనాల్లో చాలా మంది నల్లటి మాంసపు ముద్దల్లా మారిపోయారు. ఆ రోజు అందరి శరీరాలు మాంసం ముక్కలుగా మారాయి. రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా కాసేపు బతికినా తర్వాత ప్రాణాలు వదిలారు. తర్వాత కొందరికి రాజీవ్ గాంధీ శరీరం కనిపించింది. ఆయన లోటో బూట్లు, తర్వాత తెగిపడిన చేయి, దానికి ఉండే గుచ్చీ వాచ్ చూసి ఆ భాగాలన్నీ రాజీవ్ గాంధీవేనని నిర్ధారించకున్నారు.

సోనియా నిశ్చేష్టులయ్యారు

సోనియా నిశ్చేష్టులయ్యారు

ఆ రోజు 10 గంటల 25 నిమిషాలకు.... డిల్లీలో రాజీవ్ నివాసం 10, జన్‌పథ్ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. అప్పటికే సోనియా, ప్రియాంక కూడా నిద్రకు ఉపక్రమించారు. అయితే రాజీవ్ ప్రైవేట్ సెక్రటరీ విన్సెంట్ జార్జ్ కు ఒక ఫోన్ వచ్చింది. ఆ మాటలు వినగానే వెంటనే జార్జ్... మేడమ్, మేడమ్ అని అరుస్తూ ఇంటి లోపలికి పరిగెత్తారు. నైట్ గౌన్‌లో ఉన్న సోనియా వెంటనే బయటికి వచ్చారు. కొద్దిసేపు ఆమెకు అర్థం కాలేదు. సోనియా గాంధీకి అసలు విషయం చెప్పాడు జార్జ్. సోనియా నిశ్చేష్టులయ్యారు.

మీ అమ్మలాగే నిన్ను కూడా చంపేస్తారు

మీ అమ్మలాగే నిన్ను కూడా చంపేస్తారు

ఆమె ఆ సమయంలో ఎంత గట్టిగా ఏడ్చారంటే, అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరూ ఆ ఏడుపుకు ఉలిక్కిపడ్డారు. అయితే ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు సోనియా, రాజీవ్ తో గొడవ పడిదంట. రాజీవ్ ను ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించవద్దని, మీ అమ్మలాగే నిన్ను కూడా చంపేస్తారని సోనియాగాంధీ ఏడ్చింది. దానికి రాజీవ్ "నాకు మరో మార్గం లేదు. నేనెలాగూ చనిపోతా అని నాకు తెలుసు." అని అన్నాడట. చివరకు రాజీవ్ గాంధీ చనిపోయారు. కానీ ఆ రోజు 10 జన్‌పథ్ గోడలు మొదటి సారి సోనియా రోదించడం విన్నాయి. సోనియా ఏడుపుతో ఆ గోడలు దద్దరిల్లాయి. అంతలా రోదించింది ఆమె.

English summary

rajiv gandhi assassination what exactly happened on that fateful night of may 21 in madras and new delhi

rajiv gandhi assassination what exactly happened on that fateful night of may 21 in madras and new delhi
Story first published:Thursday, July 12, 2018, 11:35 [IST]
Desktop Bottom Promotion