For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లింగనిర్ధారణకై దుస్తులు తొలగింపబడ్డ ఒక గెడ్డం కలిగిన మహిళ గాధ!

లింగనిర్ధారణకై దుస్తులు తొలగింపబడ్డ ఒక గెడ్డం కలిగిన మహిళ గాధ!

|

మనలో చాలామంది మహిళలు కనుబొమ్మల వద్ద ఒక్క వెంట్రుక ఎక్కువగా పెరిగినా, లేదా పై పెదవి పై ఒక్క వెంట్రుక కనిపించినా పార్లర్లకు పరిగెడతారు.

అదేవిధంగా, మన సమాజంలో ఇంకో రకమైన మహిళలు కూడా ఉన్నారు. వీరే తమను తాము తీర్చిదిద్దుకోడానికి కూడా బద్దకించేవారు . అవాంఛిత రోమాల ఎదుగుదల వలన ఎదురయ్యే ఇబ్బందులతో బాధపడేవారు ఉన్నారు.

ఈ వ్యాసం ద్వారా మీకు ఒక విచిత్రమైన మహిళ యొక్క విశేషాలను అందిస్తున్నాం. ఆమెను, లింగ నిర్ధారణ కొరకు తన దుస్తులను తొలగించి, కాళ్ళను బార్లా చాపాల్సినదిగా, పోలీసులు అడగవలసి వచ్చింది.

చదవండి ఇక...!

Real-life Case Of Bearded Woman Who Was Asked To Show Her Privates To Prove Her Sexuality


ఆమె థెరెసియా ముంబీ

ముప్పై ఒక్క సంవత్సరాల థెరెసియా ముంబీను ఇద్దరు మహిళ పోలీసులు ఆమె స్త్రీనో, పురుషుడో, తెలుసుకోదలచి, దుస్తులను విప్పమన్నారు. తరువాత ఆమె కెన్యాలోని,కరియొబంగిలో రవాణా కేసులో అరెస్టు చేయబడింది.


ఆమె లింగనిర్దారణకై ప్రశ్నింపబడింది:

ట్రాఫిక్ నియమాలను ఒక మినిబస్ ఉల్లఘించిన కేసులో ఈమెను నిర్బంధించి పోలీసులు, ఆమె లింగనిర్దారణకై కాళ్ళను చాపవల్సినదిగా అడిగారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి:

ముంబీ అవాంఛిత రొమాల ఎదుగుదల వలన హైపర్ ట్రైకోసిస్ అనే పరిస్థితిని ఎదుర్కుంటుంది. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు అవసరం లేని ప్రదేశాలలో కూడ అమితంగా పెరుగుతుంది.


ఆమె ఈ పరిస్థితితో రాజీ పడిపోయింది:

ముంబీకి షేవింగ్ ద్వారా వెంట్రుకలను తొలగించుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే, షేవింగ్ వలన ఆమె ముఖంపై దురద పుట్టేది. కనుక ఆమె తన శారీరక తీరుతో రాజీపడి ఉన్న సమస్యను అంగీకరించే స్థితికి వెళ్ళింది. కానీ ఒక సంఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది.

ఆమె పోలీసులను బెదిరించాలనుకుంది:

ముంబీ ఇప్పుడు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న అధికారులపై కేసు వేయాలని నిశ్చయించుకుంది. కేవలం గెడ్డం వలన తను ఆడా? మగా? అని శంకించడం సమంజసం కాదని ఆమె నమ్మకం. ఈ మినీబస్ వ్యవహారంలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు తన నుండి £3 లంచం కూడా డిమాండ్ చేశారని ఆమె తెలిపారు.

ఈ సంఘటన తో ఆమెలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది.

ఆమె ఈ సంఘటన తరువాత, ఇటువంటి పరిస్థితులు మళ్లీ ఎదురవుతాయేమోనని, పనిచేయడం మానేసింది. కనుక , న్యాయం జరిగాలని ఈ విషయాన్ని కోర్టుకు లాగేందుకు సిద్ధమైంది.

ఆమెకున్న ఒకేఒక్క ప్రశ్న ఏమిటంటే...

"ఇది న్యాయమేనా? ఈ అధికారులనే నాకు రక్షణ కల్పించవలసినదిగా ఆదేశిస్తే, పబ్లిక్ లో నా పరిస్థితి ఏమిటి?"

ఆమె కేసును గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ల ద్వారా మాకు తెలుపండి.

English summary

Real-life Case Of Bearded Woman Who Was Asked To Show Her Privates To Prove Her Sexuality

Teresiah Mumbi is a 31-year-old woman who has apparently been humiliated by the Kenya police after they judged her on her sexuality, since she had a beard! The woman was asked to strip down and also widen her legs to expose her privates to the cops, as they wanted to confirm her identity. Currently, she is suing those cops.
Story first published:Friday, June 8, 2018, 17:34 [IST]
Desktop Bottom Promotion