For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నాబెల్లె బొమ్మ గురించిన భయంకరమైన నిజాలు

అన్నాబెల్లె బొమ్మ గురించిన భయంకరమైన నిజాలు

|

అన్నాబెల్లె ఎటువంటి పరిచయం అవసరంలేని భయంకరమైన బొమ్మ. ఈ బొమ్మ యొక్క భయానక రూపం ఖచ్చితంగా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. కానీ, కేవలం సినిమాలో ఉపయోగించిన సాధారణ బొమ్మగా మీరు భావిస్తున్నారా? నిజమే అనేకమందికి అది సినిమా ద్వారానే పరిచయం మరి.

అసలు అన్నాబెల్లె, దాని వెనుక కథ గురించిన వివరాలు మీకోసం.

అన్నాబెల్లె గురించి భయంకరమైన వాస్తవాలు

ఈ అన్నాబెల్లె గురించి అనేక కథనాలు మనుగడలో ఉన్నాయి, ఇది ఖచ్చితంగా మీకు వెన్నులో చలిపుట్టిస్తుంది.

Scary Truth About Annabelle

ఈ బొమ్మ నిజం:

ఈ అన్నాబెల్లె బొమ్మ వాస్తవానికి ఉనికిలోనే ఉంది. ఈ బొమ్మ ప్రస్తుతం మన్రో, కనెక్టికట్లో ఉన్న వారెన్ అకల్ట్ మ్యూజియంలో ఉంచబడింది. నివేదికల ప్రకారం, బొమ్మ చుట్టూ ఒక పవిత్రమైన శిలువ గుర్తుతో ఉన్న చెక్క పెట్టెలో ఉంచబడి ఉంది. బొమ్మ చుట్టూ ఒక గుర్తు ఉంటుంది "హెచ్చరిక: దీనిని తాకవద్దు" అని. చిత్రంలో ఉపయోగించిన పింగాణీ అన్నాబెల్లె బొమ్మకు విరుద్ధంగా, నిజమైన బొమ్మ ఒక పురాతన “రాగ్గెడీ ఆన్” (ఈ కారెక్టర్, జానీ గ్రూయేల్ అనే రచయిత చేత రూపొందించబడినది) వలె ఉంటుంది.

అన్నాబెల్లె ఒక పుట్టినరోజు బహుమతి :

అసలు బొమ్మ డోన్నా అనే నర్సింగ్ విద్యార్థికి చెందినది. 1970 లలో ఆమె తల్లి తనకు బహుమతిగా ఇచ్చినట్లు చెప్పబడింది. దీనిని ఆమె తల్లిదండ్రులు సెకండ్ హాండ్ “రాగ్గెడీ ఆన్ స్టోర్” వద్ద కొనుగోలు చేశారని చెప్పబడినది. బహుమతిగా బొమ్మను పొందిన కొన్ని రోజులకు, డోనా మరియు ఆమె రూమ్మేట్ ఆంజీ, బొమ్మ కారణంగా కొన్ని చిత్రమైన సంఘటనలను ఎదుర్కోవడం ప్రారంభించారు.

బొమ్మ తరచుగా తనకుతానే కదలడం ప్రారంభిస్తూ వచ్చింది:

బొమ్మ రోజుమొత్తంలో తనస్థానాన్ని కొద్దికొద్దిగా మారుస్తూ ఉండడం కనిపించింది. అంతేకాకుండా చేతులు కాళ్ళ కదలికలలో కూడా మార్పులు కనపడడం ప్రారంభించింది. క్రమంగా, తమ ఇంటిలో వేర్వేరు ప్రాంతాల్లోకి వెళ్ళడం ప్రారంభించినట్లుగా వారు గ్రహించారు. "డోన్నా, వృత్తిరీత్యా బయలుదేరడానికి ముందు కోచ్లో బొమ్మను ఉంచినప్పటికీ, ప్రతిరోజూ తన గదిలో మంచం మీద కనిపిస్తూ, ఆ గది తలుపు మూతవేసి ఉన్నట్లుగా కనిపించేది. క్రమంగా ఆందోళన కలిగించే అంశంగా కనిపించింది.

గోడల మీద సందేశాలు కనపడడం ప్రారంభమయ్యాయి :

ఈ ఇద్దరు అమ్మాయిలు తమ ఇంటిలో పార్చ్మెంట్ కాగితం కలిగిలేనప్పటికీ, వారు వారి అపార్ట్మెంట్ అంతటా అన్నాబెల్లె పెన్సిల్ తో వ్రాసిన సందేశాలు గోడలపై కనపడడం గమనించారు. ఈ బొమ్మ తరచుగా "మాకు సహాయం చేయండి" అని గోడలపై రాస్తూ ఉంటుంది మరియు ఈ చేతివ్రాత ఒక చిన్నబిడ్డ చేతివ్రాత వలె కనపడేది.

భయంకరమైన నిజం ఏమిటంటే?

క్రమంగా ఈ అమ్మాయిలిద్దరూ ఆ బొమ్మ తరచుగా కదులుతూ, గోడలపై సందేశాలను రాస్తూ వస్తుందని నమ్మారు. ఒకరోజు డోనా ఇంటికి వచ్చేసరికి, ఆ బొమ్మ చెస్ట్ మరియు చేతుల మీద రక్తపు మరకలు ఉండడం గమనించింది. మిస్టరీని పరిష్కరించడానికి అమ్మాయిలు తక్షణం, ఒక మాధ్యమాన్ని(దెయ్యాలతో మాట్లాడగలిగేలా) సంప్రదించారు. 7 ఏళ్ల అమ్మాయి అన్నాబెల్లె హిగ్గిన్స్ అని పిలిచే ఒక ఆత్మ, వారు ఉండే ప్రాపర్టీలో మరణించినట్లు తెలిసింది. భయపడిన వారిరువురూ ఆ మాద్యమం ద్వారా అన్నాబెల్లె, వారితో ఉండుటకు సుముఖంగా ఉన్నట్లు తెలిపిన సందేశాన్ని సమ్మతించి ఆ బొమ్మలో ఉండుటకు అనుమతించారు.

వారి స్నేహితురాలిపై దాడి :

'లౌ' అని పిలవబడే వారి స్నేహితురాలొకరు ఆ స్థలంలో భయంకరమైన పీడకలతో నిద్ర లేచింది. ఊపిరి ఆగిపోతున్న భావనకు లోనైంది. అంతేకాకుండా, అన్నాబెల్లె తన కాళ్ళను పట్టి లాగుతున్న అనుభూతికి లోనైంది. మరుసటి రోజు, ఆమె తన ఛాతీ మీద ఏడు విభిన్నమైన పంజా గుర్తులను చూచి, ఒక కనిపించని శక్తి దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చింది.

అమ్మాయిలు ఆ బొమ్మను చర్చి ప్రీస్ట్ వద్దకు తీసుకుని వెళ్ళగా:

ఆ బొమ్మను పరిశీలించిన చర్చి ప్రీస్ట్, ఆ బొమ్మను ఆత్మ ఆవహించినట్లుగా, మరియు నెమ్మదిగా వ్యక్తిని లోబరచుకుని, చివరగా మనిషి శరీరంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా గుర్తించాడు.

ఆ ఆత్మ ఇంకా ఉంది :

బొమ్మను వారి నుండి దూరంచేసి, మ్యూజియంలో ఉంచినప్పటికీ, వారి సంరక్షణలో ఉన్న ఈబొమ్మ ఎల్లప్పుడూ వేటాడే ప్రవర్తనను ప్రదర్శిస్తుంటుందని నమ్ముతారు. ఇప్పటికీ కొందరు ఈ బొమ్మను వారివారి స్థలాలలో అక్కడక్కడా కనిపిస్తున్నట్లు తెలుపుతున్నారని నివేదిక.

మీరేమనుకుంటున్నారు :

వాస్తవాలు అతి భయంకరమైనవి అయినప్పటికీ, ఈ విషయాలు ఉనికిలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఇవన్నీ కల్పితాలు అని కొట్టివేసే వారూ లేకపోలేదు. ఎంతోమంది ఆత్మ కలిగిన బొమ్మను తమకు ఇవ్వవలసినదిగా అభ్యర్ధించారు కూడా. పరీక్షించడానికి. కానీ ప్రజా శ్రేయస్సు కోసం ఎవరికీ అనుమతిని ఇవ్వడం లేదని నివేదికలు. ఏదిఏమైనా కళ్ళతో చూసిన విషయాలనే నమ్మలేని ఈరోజుల్లో, నోటిమాటలు తప్ప సాక్ష్యాలు లేని ఈ సంఘటనలను నమ్మడం సరైనది కాదు అని హేతువాదుల మాట.

కొందరిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం, తమ కోరికలను తీర్చుకోవడం, పేరు పరపతుల కోసం, ప్రతీకారేచ్చలు తీర్చుకోవడం మొదలైన అంశాల కారణంగా ఇటువంటి చర్యలకు దిగే అనేకమంది ఉదాహరణలుగా లేకపోలేదు కూడా. పైగా బొమ్మలో కొద్ది పాటి చిన్న మార్పులు కూడా బొమ్మ కదలడానికి అనుమతిని ఇస్తుంది అని అనేక ప్రయోగాలలో తేలిన నిజం. పైగా దేనికీ సరైన సాక్ష్యాలు నేటికీ లేవు కూడా.

ఏది ఏమైనా దేవుడు ఉన్న చోట దెయ్యం కూడా ఉంటుందన్న అనేకమంది మానసిక బలహీనతలు, కొన్ని తప్పుడు ప్రచారాలకు కూడా కారణభూతమవుతున్నాయని హేతువాదుల మాట. ఇక పీడకల విషయానికి వస్తే, ఎవరైనా భయపెట్టే అంశాల గురించి మాట్లాడినప్పుడు, లేదా గదిలో ఆక్సిజన్ శాతం తక్కువైనప్పుడు మన మనసు పొరల్లో దాక్కొని ఉన్న భయాలే పీడకలలుగా వస్తుంటాయని అనేక ప్రయోగాలలో తేలిన నిజం కూడా.

కానీ ప్రజల క్షేమంకోసం ఎవరికీ బొమ్మను పరీక్షించే అవకాశo ఇవ్వమని మ్యూజియం మాట. ఇది ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. ప్రచారంలో ఉన్న కథనం మాత్రం మీతో పంచుకోవడం జరిగినది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Scary Truth About Annabelle

Annabelle is a Raggedy Ann doll which demonologists Ed and Lorraine Warren believe to be haunted. The doll resides in a glass box at The Warrens' Occult Museum in Monroe, Connecticut. However, there are specific facts about Annabelle that can scare many. All do not know these facts about Annabelle.
Desktop Bottom Promotion