Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
వీడియో అలర్ట్ : అద్దంలోని ప్రతిబింబం బాలుని కన్నా వేగంగా కదిలితే?
వీడియో అలర్ట్ : అద్దంలోని ప్రతిబింబం బాలుని కన్నా వేగంగా కదిలితే?
నిజంగా విడ్డూరమే ఇది, అద్దం ముందున్న బాలుని కన్నా 5 సెకండ్ల ముందుగానే ప్రతిబింబం కదలడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంది. ప్రతి కదలిక కూడా కొన్ని సెకండ్ల ముందుగా కదలడం చూస్తుంటే, అసలేం జరుగుతుందో అర్ధం కాని స్థితికి తీస్కెళ్తూ ఉంది అనడంలో ఆశ్చర్యమే లేదు. గతంలో చూసిన ఒక హాలీవుడ్ హారర్ సినిమా తలంపుకు వచ్చేలా!
ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
మేము ఖచ్చితంగా చెప్పగలము, మీరు ఒకటికి రెండుసార్లు చూసి కానీ నిర్ధారణకు రాలేరని. అసలు ప్రతిబింబం ముందుగా వెళ్ళడం ఏమిటి? అని ఆశ్చర్యపోవాలో భయపడాలో అర్ధం కాని పరిస్థితికి లోనవుతున్నారు కదా?. వీడియో చూస్తున్న వారే అంత ఆలోచిస్తే, తీసినవారు ఇంకెంత భయపడి ఉంటారో మరి.

నిజానికి ఆ బాలుని తల్లి స్నాప్ చాట్ లో తన స్నేహితులతో ఈ వీడియోను పంచుకుంది, తెలీని అయోమయంలో. అసలు ఇది ఎలా జరిగింది, ప్రతిబింబం ముందుగా కదలడం ఏమిటి? ఇది నా కెమరా తప్పిదనమా లేక, నిజంగానే ప్రతిబింబం కదిలిందా? అని ప్రశ్నిస్తూ.
కానీ టాగ్ చేయబడిన స్నేహితులు, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికిలోనై, క్రమంగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. చూసిన ప్రతి ఒక్కరూ ఒకింత సంభ్రమాశ్చర్యాలకు లోనవడం పరిపాటిగా ఉంది. పైగా కెమరా ట్రిక్స్ అనడానికి కూడా లేకుండా, సాధారణ మొబైల్ కెమరాతో తీసినట్లుగా ఉండడం, కాస్త ఆలోచించదగిన విషయముగా కూడా ఉంది.
ఏదిఏమైనా ఇటువంటి విషయాలు కొంతమేర భయం కలిగించేవిలానే ఉంటాయి. ముఖ్యంగా తమ ఇళ్ళల్లో జరిగినప్పుడు. సాధ్యాసాధ్యాల గురించిన వివరాలు కాస్త ఆలస్యంగా తెలిసినప్పటికీ, ఆ క్షణాన మాత్రం తత్తరపాటుకు గురికాక తప్పదు. కొన్ని సందర్భాలలో ఇటువంటి ఘటనలే దెయ్యాలు అన్న భ్రమలను పెంచడానికి కారణమవుతుంటాయి. క్రమంగా జీవితకాలమంతా ఒక అభద్రతాభావానికిలోనై జీవిస్తుంటారు. క్రమంగా ఆక్సిజన్ సరఫరా సరిగ్గాలేని వేళల్లో పీడకలల్లా పీడిస్తుంటాయి కూడా.
వీడియో చూసి మీకెలా అనిపించిందో క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.
ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications