For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమికుల రోజున బహుమతిగా ఇవ్వడానికి పనికి వచ్చే 16 రకాల ఉత్తమ పూలు ఇవే

పూర్వకాలం నుండి కూడా పూలు విభిన్న రకాల పేర్లు మరియు అర్ధాలు మరియు చిహ్నాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్క పువ్వుకి ప్రత్యేకమైన అర్ధం ఉంటుంది మరియు ప్రత్యేకమైన గుర్తుకు చిహ్నంగా నిలుస్తుంది.

By R Vishnu Vardhan Reddy
|

ప్రేమికుల రోజు సందర్భంగా ఇచ్చి పుచ్చుకోవడానికి ఉత్తమమైన బహుమతులలో పూలు కూడా ఒకటి. పూలతో బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఇప్పటికి, ఎప్పటికి చెక్కుచెదరని ఒక ఆచారం. అయితే ఈ ప్రేమికుల రోజు సందర్భంగా కొన్ని మనస్సు దోచే అందమైన పూలను కలయికగా చేసి, మీరు మీ భాగస్వామికి ఇచ్చి వారిని ఆశ్చర్యపరచవచ్చు. ప్రేమ, ఆనందం, శాంతి, అభిరుచి మరియు కృతజ్ఞత వీటన్నింటికి పూలు చిహ్నంగా నిలుస్తాయి. అయితే మీరు ఎంచుకొనే పూలు మీ అభిరుచిని తెలియజేస్తాయి మరియు మీ ప్రేమికుల రోజు పై ప్రభావం చూపిస్తాయి. సరైన మరియు ఆకర్షణీయమైన పూలను గనుక ప్రేమికుల రోజున బహుమతిగా ఇస్తే, ఆ రోజుని ప్రత్యేకంగా మీరు మలచినట్లు అవుతుంది.

పూర్వకాలం నుండి కూడా పూలు విభిన్న రకాల పేర్లు మరియు అర్ధాలు మరియు చిహ్నాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్క పువ్వుకి ప్రత్యేకమైన అర్ధం ఉంటుంది మరియు ప్రత్యేకమైన గుర్తుకు చిహ్నంగా నిలుస్తుంది. కొన్ని పూలు శుభాకాంక్షలను తెలియజేస్తే మరికొన్ని దయ, జాలిని తెలియజేస్తాయి. మరికొన్ని ప్రేమను తెలియజేస్తాయి. అసలు నిజం ఏమిటంటే, పూలు అన్నిరకాల బావోద్వేగాలను చెప్పడానికి ఉపయోగపడతాయి. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను పూలు తెలియజేయగలవు. ఏ పువ్వుకి ఏ పేరు ఉంది, దాని వెనుక ఉన్న అర్ధం ఏమిటి? అని మీకు గనుక తెలిస్తే, మీరు మీ యొక్క భావాలను పూలతో అద్భుతంగా తెలియజేయవచ్చు.

ఈ వ్యాసంలో ప్రేమికుల రోజు బహుమతులుగా ఇవ్వడానికి ఉత్తమమైన పూలు ఏమిటో తెలుసుకోబోతున్నాం. వాటి గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

అభిరుచి పువ్వు :

అభిరుచి పువ్వు :

స్వచ్ఛమైన ప్రేమకు, నమ్మకానికి మరియు విశ్వాసానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. మీరు ఏమి చెప్పదలుచుకున్నారో ఆ విషయాలన్నింటిని మీరు ప్రేమించే వ్యక్తికి ఈ పువ్వు బహుమతిగా ఇవ్వడం ద్వారా తెలియజేయవచ్చు. ఈ అభిరుచి పువ్వు నిత్యం పూస్తూనే ఉంటుంది. ఇందులో 50 జాతులు ఉన్నాయి. ఇది పస్సిఫ్లోరాసీఏ కుటుంబానికి చెందినది. ఈ ఊదా నీలి మరియు తెలుపు రంగు పువ్వుకి పది రక్షక పత్రావళులు మరియు రేకులు ఉంటాయి. ఇవి పది సెంటీమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇవి చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. ఈ అన్యదేశ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బహుమతి ఇవ్వడానికి ఇవి ఉత్తమమైన పూలు.

తులిప్స్ పువ్వు :

తులిప్స్ పువ్వు :

ఖచ్చితత్వమైన ప్రేమను తెలియజేస్తాయి. ఎరుపు తులిప్స్ నిజమైన ప్రేమకు చిహ్నంగా నిలిస్తే, ఊదా రంగు తులిప్స్ విధేయతకు చిహ్నంగా నిలుస్తాయి. మీరు వివిధరకాల తులిప్స్ పూల కలయికను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇవి మంచి తనానికి ప్రతీకగా నిలుస్తాయి మరియు క్షమాపణ అనే సందేశాన్ని పంపడానికి ఉపయోగపడతాయి. ఎరుపు రంగు తులిప్స్ బహుమతిగా ఇవ్వడానికి ఉత్తమమైనవి. మీ నిజమైన ప్రేమను, మీరు ప్రేమించే వారికి వ్యక్తపరచాలని అనుకుంటే గనుక ఎరుపు రంగు తులిప్స్ ని ఇవ్వండి.

ఫేన్సీ పూలు :

ఫేన్సీ పూలు :

జాగ్రత్తకు మరియు వినయం కి ఇవి చిహ్నంగా నిలుస్తాయి. మీ స్నేహితునికి దీనిని ప్రేమికుల రోజునాడు బహుమతిగా ఇవ్వవచ్చు. ఫేన్సీ పూలు చాలా సున్నితమైనవి, ప్రకాశవంతమైనవి మరియు అందమైనవి. ఇవి ఏ తోటకైనా విపరీతమైన అందాన్ని తెచ్చిపెట్టగలవు. ప్రజలు ఈ ఫేన్సీ పూలను, పూల అలంకరణలో వాడతారు మరియు పెళ్లి వంటి శుభకార్యాల్లో వాడతారు. మరికొన్ని పూలను పెళ్లి కూతుర్ని తయారుచేసేటప్పుడు కూడా వాడతారు. ప్రేమికుల రోజున బహుమతిగా ఇవ్వడానికి ఉత్తమమైన పూలలో ఇవి కూడా ఒకటి.

అల్సట్రోఎమెరియా పూలు :

అల్సట్రోఎమెరియా పూలు :

ఈ రకమైన పూలను బహుమతులుగా ప్రేమికులరోజున ఇవ్వాలని భావించినట్లైతే గనుక, ఇది ఒక విభిన్నమైన ఆలోచనగా చెప్పవచ్చు. ఈ అల్సట్రోఎమెరియా ని పెరువియల్ లిల్లీస్ అని కూడా అంటారు. ఇవి తెలుపు, బంగారం, ఆప్రికాట్, లేత గులాబీ రంగు మరియు లేవేండర్ తో పాటు వివిధ రకాల రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇవి చాలా ఎక్కువ సమయం పాటు తాజాగా ఉండగలవు. ఇవి భక్తి మరియు స్నేహాన్ని ఎంతో ఖచ్చితత్వంతో వ్యక్తపరచగలవు.

ఎస్టర్ :

ఎస్టర్ :

పూవు మధ్యలో పసుపుపచ్చ రంగులో ఉండి, ఎంతో అందమైన రంగులతో ఇవి విరపూస్తాయి. ఈ ఎస్టర్ పూలను చాలామంది వశీకరణ పువ్వు అని కూడా పిలుస్తుంటారు. ఇది ప్రేమకు ఒక తాలిస్మాన్ మరియు ఇది ఓపికకు చిహ్నంగా నిలుస్తుంది. వివిధరకాల ఎస్టర్ పూలను సరైన పద్దతిలో అమరిస్తే, అద్భుతాలు సృష్టిస్తుంది. ప్రేమికుల రోజు ఇచ్చుకునే ఆరాధనీయ బహుమతుల్లో ఇది కూడా ఒకటి.

కాళ్ళ లిల్లీ :

కాళ్ళ లిల్లీ :

ప్రేమికలరోజు నాడు బహుకరించే అందమైన పూలలో ఇవి కూడా ఒకటి. ఈ సొగసైన కాళ్ళ లిల్లీ కొన్ని వందల సంవత్సరాలుగా కళాకారులకు స్ఫూర్తి. వైభవానికి మరియు అందానికి ఈ అద్భుతమైన పువ్వు ప్రతీకగా నిలుస్తుంది. ఇవి ప్రేమికుల రోజు సందర్భంగా బహూకరించడానికి ఉత్తమమైన పూలని చెప్పవచ్చు.

కార్నేషన్లు :

కార్నేషన్లు :

తూర్పు ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాలుగా కార్నేషన్లు పూలను సాగుచేస్తున్నారు. ఇందులో ఉండే ప్రతి ఒక్క రంగుకి, ఒక ప్రత్యేకత ఉంది. లేత ఎరుపు రంగు మాతృ ప్రేమని తెలియజేస్తుంది. ఎరుపు రంగు ప్రశంశ ని తెలియజేస్తుంది తెలుపు అదృష్టాన్ని తెలియజేస్తుంది. ఇవి చాలా ఎక్కువరోజులపాటు తాజాగా ఉంటాయి మరియు వాటి యొక్క శరీరంకూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడటానికి నక్షత్రాలులా ఉంటాయి.

క్రిసాన్తిమం :

క్రిసాన్తిమం :

ధనానికి, విశ్వసనీయతకు మరియు నిజానికి చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ క్రిసాన్తిమం పూలు స్నేహితులకి లేదా భాగస్వామికి లేదా వ్యాపార భాగస్వామికి బహుకరించడం ద్వారా మీ యొక్క నిజమైన ఉద్దేశ్యాలను తెలియజేయవచ్చు.

ఆర్కిడ్లు :

ఆర్కిడ్లు :

ఒక ఆర్కిడ్లు బొకే తీసుకోవడం గాని లేదా మొక్కని తీసుకోవడం చేసినట్లయితే అది స్వర్గానికి వెళ్లి వచ్చినట్లు ఉంటుందని చెబుతారు. ఫ్లేనోప్సిస్, వంద, పాఫిప్డిలుమ్ లేదా డెండ్రోబియం వంటి సాధారణమైన రకాలు ఆర్కిడ్లుల్లో లభిస్తాయి. బాగా పెరిగిన ఆర్కిడ్లును కత్తిరించిన పూలగా వివిధరకాల పూల అలంకరణలో వాడుతుంటారు.

ప్యూనిస్ :

ప్యూనిస్ :

ఇవి తియ్యగా మరియు అద్భుతంగా ఉంటాయి. ప్రకృతిలో లభించే పూలలో మంత్ర ముగ్దులను చేసేవాటిల్లో ఇవి కూడా ఒకటి. ఇవి చాలా పరిపూర్ణంగా ఉంటాయి మరియు ఆనందపరిచే విధంగా ఉంటాయి మరియు సుతిమెత్తని రేకుల గుర్తులు వీటికి ఏర్పడివుంటాయి. అద్భుతమైన ప్యూనిస్ పూలను ఉపయోగించి బొకే లను గనుక తయారుచేసినట్లైతే గనుక, వసంత ఋతువు వచ్చిందని అర్ధం. వీటిని వధువులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ పూల రకాన్ని ఒక్కటిగా మాత్రమే ఇవ్వవచ్చు లేదా ఇతర పూలతో కలిపి అయినా ఇవ్వవచ్చు. ఎలా ఇచ్చిన సరే, ఈ ప్యూనిస్ పూలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి మరియు చూసిన ప్రతిసారి మనస్సు దోచుకుంటాయి. అందుచేత ఎందుకు ప్యూనిస్ బొకేను ప్రేమికుల రోజు పంపకూడదో ఆలోచించండి?

గులాబీ పూల బొకే :

గులాబీ పూల బొకే :

గులాబీ పూల బొకేని బహుమతిగా ఇవ్వడం ఎప్పుడుగాని తప్పు కాదు. ఎందుకంటే ఎప్పటికి అది ఉత్తమమైన నిర్ణయమే. మీ స్నేహితుడికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికైనా లేదా మీరు ప్రేమించే వ్యక్తులకు మీ ప్రేమ తెలియజేయడానికైనా ఇవి చాలా ఉత్తమమైనవి. ఈ గులాబీ పూలను సరిగ్గా అమరిస్తే మీ భావాలను అవి ఖచ్చితత్వంతో తెలియజేస్తాయి. సొగసైన ఆకారం మరియు మర్చిపోలేని సువాసనలు వీటి సొంతం. అన్ని సమయాల్లో ఇచ్చే దానికి వీలుగా ఏదైనా ఉంది అంటే అది గులాబీ పూల బొకే. ఈ రోజుటికి రోజా పూలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి మరియు తాజాగా ఉండే రోజ్ బొకే కి మించిన ఉత్తమమైన బొకే ఇంకొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో రంగులు ఉన్నాయి మీరు ఎంచుకోవడానికి. ఆ విధంగా ఎంచుకొని, మీరు మీ యొక్క భావాన్ని తెలియజేయవచ్చు. మీరు గనుక మీ యొక్క అభిరుచిని తెలియజేయాలనుకుంటున్నారా ? అటువంటి సమయంలో ఎరుపు రంగు గులాబీ బొకేని పంపండి. ఇది ఎంతో ఉత్తమంగా ఉంటుంది మరియు ప్రేమని తెలియజేయడానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఇదే కాకుండా నారింజ రంగు మరియు ఊదా రంగు గులాబీలను ఇవ్వడం ద్వారా ఆకర్షణ మరియు మురిసిపోవడం వంటి విభిన్న సందేశాలను చెప్పడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. పురుషులకు పంపడానికి కూడా విభిన్న రకాలు ఉన్నాయి.

ప్రొద్దుతిరుగుడు పూల బొకే :

ప్రొద్దుతిరుగుడు పూల బొకే :

దీర్ఘాయువు మరియు స్వచ్ఛమైన ప్రేమ తెలియజేయాలంటే ప్రొద్దుతిరుగుడు పూలను బహుమతిగా ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇవి వాటికి చిహ్నంగా నిలుస్తాయి. దేశ వ్యాప్తంగా ప్రొద్దుతిరుగుడు పూలు ఎంతో ఎత్తుకు పెరుగుతాయి. కాబట్టి వీటి గురించి అందరికి తెలుసు మరియు ఇవి పసుపు పచ్చ రంగులో వికసిస్తాయి. కొన్ని పూలైతే దాదాపు ఒక వ్యక్తి తల పరిమాణంలో వికసిస్తాయి.

డెల్ఫీనియం :

డెల్ఫీనియం :

వీటిని ఒక కట్టగా అమర్చి, ఒక నాటకీయ రూపంలో ఇవ్వవచ్చు లేదా మిగతా పూలతో కళాత్మకంగా అమర్చి కూడా ఇవ్వవచ్చు. డెల్ఫీనియం పూలు నీలం రంగు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఇది మనస్సు విప్పి మాట్లాడే స్వభావాన్ని తెలియజేస్తుంది మరియు తీవ్రమైన బంధాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా వేసవి సమయంలో ఇవి ఎంతగానో ఉత్సాహ పరుస్తాయి.

హైడ్రాంజియాస్ :

హైడ్రాంజియాస్ :

కత్తిరించినట్లు ఉండే ఈ హైడ్రాంజియాస్ పూలు ఎంతో అందంగా ఉంటాయి. లేత ఎరుపు రంగు, మృదువైన నీలం రంగు మరియు శక్తివంతమైన ఎరుపు రంగులో ఇవి లభ్యమవుతాయి. ఇవి ఎక్కడైతే పెడతారో ఆ ప్రాంతాన్ని ఇది రంగుల మాయం చేస్తుంది మరియు మనస్సుని ఆనందపరుస్తుంది. కావున వీటిని బహుమతిగా ఇవ్వవచ్చు.

ఐరిస్ :

ఐరిస్ :

ఇవి విశ్వాసానికి, సౌర్యానికి మరియు జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తాయి. ఈ విషయాన్ని ఎవరైనా ఎదుటి వ్యక్తికి తెలియజేయాలనుకుంటే, వీటిని బహుమతిగా ఇవ్వవచ్చు. ఇవి చాలా సాధారణంగా, విభిన్నంగా మరియు ఎంతో అందంగా ఉంటాయి.

లార్కస్పూర్ :

లార్కస్పూర్ :

ఇవి చాలా పొడవైనవి. తిమింగలం ఆకారంలో ఈ పూలు ఉంటాయి మరియు విభిన్నమైన నీలం రంగుని ఇవి కలిగి ఉంటాయి. ఇవి చాలా తేలికగా మరియు సహజంగా ఉంటాయి. వీటిని కళాత్మకంగా పూల బొకేతో అమర్చవచ్చు. ఇంత అందమైన మరియు అతి సన్నమైన ఈ పూలు మనస్సు విప్పి మాట్లాడే విధానానికి మరియు భక్తికి చిహ్నంగా నిలిచి అటువంటి సందేశాన్ని పంపిస్తాయి.


English summary

Best Flowers To Gift| Best Flowers For Valentines Day| Valentine Gift Ideas, Gifts Valentines Day

Best flowers to gift for valentine day are here. Flowers are best gift ideas for valentine. Select many types of flowers for valentine day
Story first published:Monday, February 12, 2018, 12:03 [IST]
Desktop Bottom Promotion