For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్ర వేళల్లో ఆత్మ ప్రయాణం, ఏం జరుగుతుందో తెలుసా:

నిద్ర వేళల్లో ఆత్మ ప్రయాణం, ఏం జరుగుతుందో తెలుసా:

|

నిద్ర సమయాల్లో ఆత్మ ప్రయాణం ద్వారా మనం అనేక స్థాయిలకు వెళ్లి వస్తుంటాము. ఎతెరిక్ రీజియన్ కానీ, ఆస్ట్రల్ రీజియన్ పరంగా కానీ, లేదా సాధారణ కలగా గానీ ఉంటుంది.
ఎలిజెబెత్ క్లేర్ ప్రోఫెట్ ఆత్మ ప్రయాణం మరియు కలల గురించి చెప్తున్న వివరాల ప్రకారం:

రాత్రి భోజనానికి మీరు చేసే ప్రతి ఒక్క పని మీ నిద్రపైన ప్రభావం చూపుతుంది. అనగా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి, నిద్రకు ఉపక్రమించేలోపు జరిగిన సంఘటనలు ఆలోచనా విధానాలు మొదలైన వాటి మీదనే కల ఆధారపడుతుంది. మీ కలల విధానం, వస్తున్న కలల పోకడలు రెండూ కూడా పైన చెప్పిన అంశం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, గది ఉష్ణోగ్రతలు, ప్రాణవాయువు సరఫరా మొదలైనవి కూడా మీ కలలపై ప్రభావాన్ని చూపుతాయి. ఒక్కోసారి ప్రాణవాయువు సరిగ్గా అందకా నిద్రలో ఒక్కసారిగా లేచి అరుస్తున్న వారిని కూడా మనం చూసే ఉంటాము. వీరు దెయ్యాలు తమ మీద ఎక్కి తొక్కుతున్నాయనో లేదా మరేదైనా పీడకల వచ్చిందనో చెప్తుంటారు. దీనికి ప్రధానకారణం గదిలో ప్రాణవాయువు తగ్గడమే.

soul travel at night take us through many levels?

నిద్రకు ఉపక్రమించిన తర్వాత మన శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయిన అనుభూతికి లోనవుతాము. కానీ ఒక్కోసారి కొన్ని టెన్షన్స్, ఒత్తిడులు ఆ అనుభూతిని దూరం చేస్తుంటాయి. ఇలాంటివి రక్తపోటు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంటాయి.

ఒక్కోసారి శరీరం ప్రమాదానికి లోనవుతున్న వేళ, ఆత్మ శరీరంతోనే ఉండుటకు ప్రయత్నిస్తుంటుంది. తమ ప్రియమైన వారితో గడిపే క్రమంలో భౌతిక కాయాన్ని వదిలి వెళ్ళుటకు ఆత్మ సిద్దంగా ఉండలేదు. ఇలాంటి అనుభూతులన్నీ సరైన నిద్రలేని పక్షంలోనే జరుగుతుంటాయి.
మరోవైపు నిద్రలో లోకాన్ని మరచి వేరే ప్రపంచానికి వెళ్ళడం పరిపాటి. కానీ ఈ ప్రయాణం, కత్తితో కోస్తున్న కేక్ వలె ఉంటుంది అని అంటారు ఎలిజెబెత్.

మరియు కలల ప్రయాణాల్లో, వివిధములైన విమానాల్లో సాగుతున్న అనుభూతికి లోనవుతుoటాము. ఒక్కొక్క విమానం మీద ఒక్కో అభిప్రాయం ఉంటుంది. చివరికి నిద్రలేచినప్పుడు మనకు గుర్తుండే కల ఒకటో రెండో ఉంటాయి. కొన్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోలేని కలలుగా పరిణమిస్తుంటాయి.

మనం ఈ ప్రపంచాన్నే మరచిపోయి నిద్రిస్తున్న వేళ, మన అంతరంగాలలోని కొన్ని అనుభవాలు మన కలలను శాసిస్తుoటాయి. మనం వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిందే కానీ, మనకంటూ అధికారo అనేది ఉండదు. కొన్ని హృదయానికి హత్తుకునేలా ఉంటే, కొన్ని హృదయ విచారకరంగా ఉంటాయి. కొన్ని మాత్రం మనకు జీవిత సత్యాలను పాఠాలుగా చెప్తుంటాయి.

కలలు వాటి రకాలు :

కలలు వాటి రకాలు :

కలల్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలోని పాత్రలను అర్ధం చేసుకునే విధానాన్ని బట్టే, మీ అంతరాత్మ ఎలాంటిదో తెలుస్తుంది. నిజానికి మీ కలలో కనిపించే మీ పాత్ర సహజ గుణానికి వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. కలలోని మీ పాత్రను నిష్పాక్షికంగా పరిశీలిస్తే, మీ మానసిక స్థితికి, మీ ఆలోచనా విధానానికి ఎంతో దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది.

కావున, ఈ కల ఒక ఆస్ట్రల్ రకానికి చెందిన కల కూడా కావచ్చు. కాకపోతే కాస్త నిశితంగా పరిశీలించాలి. టాప్సీ-టుర్వీ , అలిస్ ఇన్ వండర్లాండ్ వంటి కలలు కూడా కావొచ్చు. కానీ మీ నిజ జీవితానికి ఈ కలలకు ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉంది. మీ చేతన మనస్సు ఈ కలల పాఠాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు, కానీ ఈ కలలన్నీ అంతర్లీన సుప్త చేతనా వస్థ నుండి వస్తున్న కలలు అని మరవకండి. అందుచేతనే అసమర్థతలకు అడ్డంకులు లేని విధంగా కలలు కంటుంటారు. మీరు మేల్కొన్నప్పుడు, మీరు ఈ కలను కాగితంపై వ్రాస్తే, దాని యొక్క వివరణను, అంతరార్ధాన్ని మీరు అందుకోగలరు.

ఎలిజబెత్ క్లేర్ ప్రోఫెట్ కల :

ఎలిజబెత్ క్లేర్ ప్రోఫెట్ కల :

నేను ఒక చిన్న పిల్లవానినిని కలిగి ఉన్నట్లు ఒక ఆసక్తికరమైన కల వచ్చింది. నేను ఈ బిడ్డతో సముద్రంలో ఉన్నాను, మరియు ఆమె నీటిలో పడి మునిగిపోతూ ఉంది. లోతుగా వెళ్తూ ఉంది. వెంటనే నేను కూడా దూకి ఆమెని కాపాడాను.

ఈ కలలోని సారాంశం ప్రకారం,

ఈ కలలోని సారాంశం ప్రకారం,

ఆ బిడ్డ నాజీవితం అని అర్ధం. నా జీవితం కొన్ని నిర్దిష్టమైన సమయాల్లో క్లిష్టపరిస్తితులను ఎదుర్కొంటూ ఉంది. నాజీవితాన్ని కాపాడుకొనే క్రమంలో భాగంగా నాదేవుడు క్రీస్ట్ (కలలో నాకు నేనే క్రీస్ట్) నాకు సహాయం చేశాడు. నా ఆలోచనా విధానం మాత్రమే నాజీవితాన్ని నిలబెడుతుంది, కాపాడుతుంది. జీవితాన్ని కాపాడే క్రమంలో ఎవరూ నీకు సహాయం చెయ్యరు, ఒక్క నువ్వు తప్ప. అని అర్ధమైంది.

ఈ కలలోని సారాంశం తెలుసుకున్నాక,

ఈ కలలోని సారాంశం తెలుసుకున్నాక,

నా జీవితంలో నేను చేస్తున్న తప్పులు, అవి ఎలా నా జీవితాన్ని నాశనం చేయబోతున్నాయి అన్న అవగాహన కలిగింది. కానీ నాకల నన్ను జాగ్రత్త చేయడానికి ప్రయత్నించింది అని అర్ధమైంది. కల ప్రక్రారం, దేవుడి సహకారంతో నా ప్రయత్నలోపం లేకుండా అడుగులు వేస్తె జీవితాన్ని నిలబెట్టుకోవచ్చని అర్ధమైంది.

కలలు మీకు ఏం నేర్పుతాయి అంటే?

కలలు మీకు ఏం నేర్పుతాయి అంటే?

కలలు అనేక వాస్తవిక విషయాలకు స్వరూపాలుగా ఉన్నాయి, కొంచం అవగాహన చేసుకుని ఆలోచించగలిగితే అనేక పాఠాలు అర్ధమవుతాయి.

కానీ అన్నిరకాల కలలు పాఠాలను నేర్పుతాయి అనుకోవడానికి లేదు, ఒక్కోసారి అర్ధంపర్ధంలేని కలలు, అసంబద్దమైన, అసహ్యకరమైన, మానసికoగా సమస్యలను కలుగజేసే కలలు కూడా వస్తుంటాయి. నిజానికి ఇవి నిజజీవితంలోని మానవుని విధి విధానాలు, ఆలోచనాధోరణులు, భయాలు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి తీవ్రంగా ఏదైనా పరిస్థితిని గురించి ఆలోచిస్తున్న ఎడల, లేదా ప్రభావితమైన ఎడల దానికి సంబంధించిన పరిష్కారం కలలలోనే లభిస్తుంది.

అవన్నీ ఒక్క కలలోనే మీ జీవితాన్ని తివాచీ పరిచినట్లు చూపగలవు.

అవన్నీ ఒక్క కలలోనే మీ జీవితాన్ని తివాచీ పరిచినట్లు చూపగలవు.

ఆత్మ ప్రయాణం: ఆస్ట్రల్ ప్రయాణం మరియు ఎతెరిక్ ప్రయాణం భిన్నంగా ఉంటాయి!

ఆస్ట్రల్ మరియు ఎతెరిక్ ప్రయాణాల గురించిన వేర్వేరు రచనలలో వివాదాస్పద అంశాలు దాగి ఉన్నాయి. ఎతెరిక్ ప్రయాణంలో, దేవుని యొక్క జ్ఞాపకశక్తిని గురించి అంశాలను కలిగి ఉంటాయి.

ఎతెరిక్ ప్రయాణంలో హెచ్చుతగ్గులలో ప్రయాణాలు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ తగ్గు స్థాయిలోని ఎతెరిక్ ప్రయాణం ఇంచుమించు ఆస్ట్రల్ ప్రయాణానికి లేదా ఆస్ట్రల్ శరీరానికి అనుసంధానించబడి ఉంటుంది.

జీవితమంటేనే ఒక తరగతి గది మరియు మనoదరికీ మన ఆలోచనల పట్ల స్వేచ్చా సమానత్వాలు ఉన్నాయి

జీవితమంటేనే ఒక తరగతి గది మరియు మనoదరికీ మన ఆలోచనల పట్ల స్వేచ్చా సమానత్వాలు ఉన్నాయి

జీవితం గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది- ఇక్కడ మీకు జీవితం అనే పుస్తకంలో ప్రతి సమీకరణం ఒక ఖచ్చితమైన సమాధానంతో వస్తుంది. ప్రతి ఒక్కరికీ పాఠాలు చెప్పబడుతాయి, దీనికి సంబంధించిన ప్రతి అంశమూ ఆ దేవుని కనుసన్నలలోనే జరుగుతుంది. పరిస్థితులకు అనుగుణంగా ఈ భోధన అనేది నిర్ధారించబడుతుంది.

మనఆలోచనలు,

మనఆలోచనలు,

మనఆలోచనలు, పరిసరాలపై ఉన్న అవగాహన మనకు అనేక రకాల పాఠాలను వివరిస్తుంది. మరియు దేవునియందున్న అనంతమైన, అచంచల విశ్వాసం ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సాధన లేదా ద్యానం చేయడం ద్వారా అనేక లాభాలను పొందవచ్చు. తద్వారా ఎటువంటి ప్రతికూల మరియు క్లిష్టమైన పరిస్థితులకు కూడా సమాధానాలు పొందవచ్చు.

కొన్నిసార్లు మనం తప్పుడు అంచనాలు

కొన్నిసార్లు మనం తప్పుడు అంచనాలు

కొన్నిసార్లు మనం తప్పుడు అంచనాలు లేదా నిందారోపణలు చేస్తుంటాము, మరియు మన తప్పుల నుండి మనమే కొన్ని పాఠాలను నేర్చుకుంటాము. ఇది మానవ సహజ గుణం మరియు స్వతంత్ర సంకల్ప స్వభావం. ఈ తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలు, మరలా ఆ తప్పులు చేయనీయకుండా అడ్డుకుంటుంది. అంతర్గత తెలివిలో నిఘూడమై సమయానుసారం మంచి చెడుల విశ్లేషణను మనకు తెలుపుతూ ఉంటాయి. తద్వారా ఏ పని చేసినా అందులో న్యాయాన్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి.

కావున, ఒక విజయానికి అనేక అపజయాలే పునాదులు అని గుర్తెరుగక తప్పదు. కానీ ఓటమే లేని జీవితం కావాలని మనిషి కోరుకోవడం, ఎంతవరకు సమంజసం. అలా విజయాలు వస్తూ పొతే, అది మానవ జీవితం ఎందుకవుతుంది. విజయానికి ఎప్పుడూ అపజయాలు మెట్లు కావాలి. తద్వారా అచంచలమైన ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగులేసి విజయపధంలో నడువగలరు.

నైట్ క్లాసులు మరియు పీడకలలు :

నైట్ క్లాసులు మరియు పీడకలలు :

మరొక సందర్భంలో ఒక విద్యార్ధి ప్రోఫెట్ ను పీడకలల గురించి అడిగాడు. ఆమె ఇలా సమాధానమిచ్చింది :

కొన్ని కలలు ఆలయాలలో కాంతులవలె ఉన్న అనుభవాల జ్ఞాపకాలు. అవి చాలా ఎక్కువగా, ఉత్తమంగా వెలుగులు విరజిమ్ముతుంటాయి.

మీరు తరగతిలో చదువుతున్న అనుభవాన్ని గుర్తు చేసుకోవచ్చు. అంటే మీరు నిద్రలో మీ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, మీ ఆత్మ మీ ఎథెరిక్ ఎన్వలప్ నకు చేరుతుంది. మరియు మీ ఎథెరిక్ ఎన్వలప్లో, ఆస్ట్రల్ ప్రయాణానికి చేరుతుంది. తద్వారా భావోద్వేగ ప్రయాణానికి చేరి ఎతెరిక్ లెవల్స్ అంచుకు చేరేలా ప్రయత్నిస్తుంది. మాస్టర్స్ ఇక్కడే తిరోగమనం చెందుతుంటారు.

ఆత్మ ప్రయాణానికి, ఆధ్యాత్మిక రక్షణ ఖచ్చితంగా అవసరమవుతుంది:

ఆత్మ ప్రయాణానికి, ఆధ్యాత్మిక రక్షణ ఖచ్చితంగా అవసరమవుతుంది:

ఇప్పుడు, ఆస్ట్రల్ లెవల్లో పీడకలలు అనేది సాధారణ విషయం ఇంట్లో ఉండే గందరగోళాలు, లేదా కుటుంబాలతో వాగ్వాదాలు నిద్రకు ఉపక్రమించే ముందు జరిగితే, వీటికి ప్రతి చర్యలు ఆస్ట్రల్ రీజియన్లో ఉండడం ఖచ్చితం. తద్వారా ఒక రక్షణలేని గందరగోళంలో ఆస్ట్రల్ రీజియన్లో చిక్కుకునే అవకాశం ఉంది. తద్వారా కొన్ని కలలు పునరావృతమవడం, లేదా వాటికి కొనసాగింపు కలలు రావడం అనేది పరిపాటి.

మాస్టర్స్ రీజియన్ వద్దకు వెళ్ళినప్పుడు, ఉదయాన్నే 5 లేదా 6 గంటల మద్య సమయాల్లో తిరిగి శరీరాన్ని చేరుకుంటూ ఉంటారు. కానీ ఆస్ట్రల్ రీజియన్ జ్ఞాపకాలు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడవు. అందుచేతనే, ఎక్కువగా పగటి వేళల్లో ఈ గందరగోళాల నేపద్యంలో పీడకలలు వస్తుంటాయి.

ఆస్ట్రల్ రీజియన్లో పీడకలలు వస్తుంటే, ఎథెరిక్ రీజియన్లో అనుభవాలు మరియు జ్ఞాపకాలను కలిగి ఉంటారు.

ఫ్లయింగ్ డ్రీమ్స్ :

ఫ్లయింగ్ డ్రీమ్స్ :

మార్క్ ప్రోఫెట్, ఎలిజబెత్ క్లేర్ ప్రోఫెట్ యొక్క భర్త. ఒక మార్గదర్శక ఆధ్యాత్మిక నాయకునిగా పేరుగడించిన ఈయన, ఒకసారి వెలుపల శరీర అనుభవాలను గురించి ఈ వ్యాఖ్య చేశారు:

కొంతమంది ప్రజలు వారు ఎగురుతూ ఉన్నట్లుగా కలలు వచ్చేవని మాకు చెప్పారు. ఇది రెండు కారణాల చేత తరచుగా పనిచేసే ఉపచేతన జ్ఞాపకం. ఒకటి, మనిషి భౌతికంగా ఎలా గాల్లోకి ఎగరగలడు అన్న అవగాహన ఉన్నప్పుడు, రెండు యోగి మిలరెప కథనం తెలిసి ఉండడం ద్వారా కానీ అని అంటాడు. ఒకవేళ మీరు అలా ఎగురుతున్న అనుభూతికి లోనైతే, యోగి మిలరెప మరలా వచ్చాడు అంటారు.

మనం ఎగురుతున్న కళను కోల్పోయాము. మనం పక్షులo కాము; భూభాగంతో పూర్తిగా అనుసంధానించబడిన వాళ్ళం. కానీ కొంతమంది తమ పరిపూర్ణ శరీరాల్లో ప్రయాణం చేయగలరు - వారు ఆవిధంగా "ఎగరగలరు". అని ఉపన్యాసం ముగించారు.

ఇటువంటి ఆసక్తికరమైన కథనాలకోసం, బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

soul travel at night take us through many levels?

Soul travel, our journeying at night, takes us through many levels – etheric, astral or simply dreaming.
Story first published:Sunday, June 10, 2018, 14:22 [IST]
Desktop Bottom Promotion