For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్డీ తివారీలా కామ పిశాచిలా ఉన్నాడు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌! ఈ తాతకు సిగ్గులేదేమో!

తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అసలు నిర్మలా దేవి మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే నేను చెప్పే వారికి సుఖం అందించాలి

|

అప్పుడు ఒక పెద్దాయన, వృద్ధుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగిన ఎన్డీ తివారీ రాసలీలలు అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. కాటికి కాలు చాపే వయస్సులో కామంతో రగిలిపోయాడు ఎన్డీ తివారీ.

ఈయన కామ కక్కుర్తికి చాలా మంది టీనేజీ అమ్మాయిలు బలయ్యారు. కన్యపిల్లలను రాజ్ భవన్ కు రప్పించుకొని ఎన్నోసార్లు రాసలీలు సాగించాడు. మొత్తానికి ఆ విషయం బయపడడంతో పదవి పోగొట్టుకున్నాడు.

తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌

తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌

ఇలా ఒక ఎన్డీ తివారీ మాత్రమే కాదు చాలా మంది గవర్నర్లు ఉన్నారు. తర్వాత మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ కూడా ఇలాంటి రాసలీలలే కొనసాగించారు. తాజాగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ పై వచ్చిన ఆరోపణలు చూస్తే ఆయన కూడా ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే అని అనిపిస్తోంది.

పడక గదికి వెళ్తున్నారు

పడక గదికి వెళ్తున్నారు

మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ పైరాజ్ భవన్ ఉద్యోగులే కేంద్రానికి, ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాసి ఆయన రాసలీలలపై ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ ను షణ్ముగనాథన్ క్లబ్ గా మార్చేశాడని, అమ్మాయిలను నేరు గా గవర్నర్ పడక గదికి వెళ్తున్నారని రాజ్ భవన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అన్ని వైపులా ఒత్తిడి పెరిగి .. ఆయన రాసలీలలు.. ఇది వరకు ఓ పీఆర్వో తో వ్యవహరించిన తీరు బయటపడడంతో చివరకు రాజీనామా చేశారు.

నారాయణ దత్ తివారీ విషయానికి వస్తే

నారాయణ దత్ తివారీ విషయానికి వస్తే

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ అయిన నారాయణ దత్ తివారీ విషయానికి వస్తే ఈయన గారు రాజకీయాల్లో బాగా ఆరితేరిన వ్యక్తే. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. రాసలీలలే కాదు కుటుంబానికి సంబంధించి విషయాల్లోనూ ఎన్డీ తివారీ చాలా వివాదస్పదంగానే మారాడు. ఈయన సొంత కుమారుడు రోహిత్ శేఖర్‌ తల్లితో కలిసి చేసిన పోరాటం అందరికీ తెలిసిందే.

రోహిత్ కోర్టుకు వెళ్లడంతో

రోహిత్ కోర్టుకు వెళ్లడంతో

తన తల్లి ఉజ్వలతో తివారీకి ఉన్న సంబంధం వల్లనే తాను జన్మించానని రోహిత్ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. మొదట రోహిత్ తన కుమారుడు కాదని తివారీ అడ్డం తిరిగాడు. దీంతో తివారీ తన తండ్రి అంటూ రోహిత్ కోర్టుకు వెళ్లి మరీ నిరూపించుకున్నారు.

ఉజ్వలా శర్మను పెళ్లి చేసుకుని

ఉజ్వలా శర్మను పెళ్లి చేసుకుని

అనంతరం రోహిత్‌ తన కుమారుడేనని తివారీ కూడా అంగీకరించారు. ఇక ఎన్.డి. తివారీ చాలా లేట్ వయస్సులో మళ్లీ తన భార్య ఉజ్వలా శర్మను పెళ్లి చేసుకుని అప్పట్లో వార్తల్లో నిలిచాడు. ఇక ఈ విషయంలో కూడా ఎన్డీ తివారీ వివాదం అందరికీ తెలిసిందే.

యువతులతో రాసలీలలు సాగిస్తూ

యువతులతో రాసలీలలు సాగిస్తూ

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఎన్‌డీ తివారీ పనిచేసిన సమయంలో యువతులతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయి గవర్నర్‌గిరీని పోగొట్టుకున్నాడు. అమాయక యువతులకు ఉద్యోగాలిప్పిస్తానని మాయ మాటలు చెప్పి తివారీ లోబర్చుకునేవాడు. రాజ్‌భవన్‌లో ఒక యువతితో దొరికిపోవడం, ఆ వీడియాలో మొత్తం అప్పట్లో వైరల్ గా మారడంతో ఆయన పదవి కూడా కోల్పోవాల్సొచ్చింది.

నగ్నంగా మారిన గవర్నర్

నగ్నంగా మారిన గవర్నర్

ఆ వీడియలో నగ్నంగా మారిన గవర్నర్ ఆ అమ్మాయిలను కూడా నగ్నంగా మార్చి మసాజ్, ఇతర పనులు చేయించుకుంటున్నట్టు ఉంటుంది. ఆ క్లిప్స్ హల్ చల్ చేశాయి. అప్పుడు అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గవర్నర్‌ పడగ్గదికి వెళ్లి

గవర్నర్‌ పడగ్గదికి వెళ్లి

ఇక మేఘాలయ రాజ్‌భవన్‌ కూడా మొన్నా ఆ మధ్య రాసలీలలకు కేంద్రంగా మారిందని ఆరోపణలు వచ్చాయి. గవర్నర్‌ ఆఫీసును ఆయన అమ్మాయిల క్లబ్బుగా మార్చేశాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

చాలా మంది నేరుగా గవర్నర్‌ పడగ్గదికి వెళ్లి ఆయనతో కోరికను తీర్చి వస్తున్నారని రాజ్‌భవన్‌ సిబ్బందే ప్రధాని మోదీకి లేఖ రాశారు.

షణ్ముగనాథన్‌ ఉద్యోగులంతా మహిళలే

షణ్ముగనాథన్‌ ఉద్యోగులంతా మహిళలే

వెంటనే షణ్ముగనాథన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని రాజ్‌భవన్‌లో పనిచేసే 98 మంది నేరుగా ఫిర్యాదు చేశారు. షణ్ముగనాథన్‌ ప్రజాసంబంధాల అధికారులుగా ఇద్దరు మహిళలను, ఒక ఆడ వంటమనిషి, మహిళానర్సును గవర్నర్‌ నైట్‌డ్యూటీలో నియమించుకుని వారితో కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాడు.

యువతులకు మాత్రమే అవకాశం

యువతులకు మాత్రమే అవకాశం

షణ్ముగనాథన్‌ తన వద్ద పనిచేసేందుకు కేవలం యువతులకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. ఇక రాజ్‌భవన్‌లో పీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేసిన ఒక మహిళను కౌగిలించుకుని ముద్దులు పెట్టడానికి కూడా ప్రయత్నించాడు షణ్ముగనాథన్‌. అలా వాస్తవాలు చెప్పిన వారిపై ఎదురుదాడికి దిగాడు షణ్ముగనాథన్‌. వాళ్లంతా తన కుమార్తెలు, మనవరాళ్లలాంటివాళ్లని పేర్కొన్నారు ఈ నీచుడు.

షణ్ముగనాథన్‌ తమిళనాడు వాడే

షణ్ముగనాథన్‌ తమిళనాడు వాడే

తమిళనాడుకు చెందిన వి.షణ్ముగనాథన్‌ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకర్త. తమిళ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా రాశారు. 2015 మే 20 నుంచి మేఘాలయ గవర్నర్‌గా వ్యవహరించారు. 2015 సెప్టెంబరు నుంచి 2016 ఆగస్టు దాకా మణిపూర్‌ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 సెప్టెంబరు నుంచి అరుణాచల్‌ గవర్నర్‌గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

బన్వరిలాల్‌ లైంగిక వేధింపులు

బన్వరిలాల్‌ లైంగిక వేధింపులు

ఇప్పుడు అసలు మేటర్ లోకి వద్దాం.. తాజాగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ కూడా ఇలాంటి కోవకు చెందిన వ్యక్తిగానే ఉన్నట్లున్నారు. ఎందుకంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి ఇతడి బాగోతం గురించి బాహాటంగానే చెప్పింది. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి స్వయంగా చెప్పింది.

పాత్రికేయురాలి చెంపను సుతారంగా తాకారు

పాత్రికేయురాలి చెంపను సుతారంగా తాకారు

ఇక ఈ మహానుభావుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై, ఆమె ఆడియో టేప్ పై స్పందించేందుకు రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ప్రొఫెసర్‌ ఎవరో తనకు తెలియదని నీతి వ్యాక్యాలు చెప్పాడు. విలేకరుల సమావేశానికి వచ్చిన ఒక పాత్రికేయురాలి చెంపను సుతారంగా తాకారు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌.

లక్ష్మీ సుబ్రహ్మణినయన్‌ మండిపడ్డారు

లక్ష్మీ సుబ్రహ్మణినయన్‌ మండిపడ్డారు

గవర్నర్‌ అలా చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. నేను తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగితే.. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకి వెళ్లడం ఏమిటి అంటూ మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణినయన్‌ మండిపడ్డారు కూడా.

ముఖాన్ని శుభ్రం చేసుకున్నాగానీ

ముఖాన్ని శుభ్రం చేసుకున్నాగానీ

లైంగిక వేధింపుల గురించి అడిగితే అందరి ముందే ఇలా చేస్తే ఎలా అంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఆయనగారు నా ముఖాన్ని తాకిన తర్వాత పదేపదే శుభ్రం చేసుకున్నాగానీ ఆ మలినం మాత్రం నన్ను వదలడం లేదంటూ తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ పై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణినయన్‌.

ఎన్డీ తివారీ మాదిరిగానే కామ పిశాచిలాగా

ఎన్డీ తివారీ మాదిరిగానే కామ పిశాచిలాగా

78 ఏళ్ల వయస్సున్న ఆ వ్యక్తి తాతలాగా కనపడొచ్చుగానీ ఈయన కూడా ఎన్డీ తివారీ మాదిరిగానే కామ పిశాచిలాగా ఉన్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. రాజ్యాంగ పరంగా ఉన్నత స్థానంలో వ్యక్తులు ఇలా దారుణంగా ప్రవర్తించడం ఇదేమీ మొదటిసారి కాదు... ఇలాంటి గవర్నర్లకు బుద్ది వచ్చేటట్లు చేయాల్సిన అవసరం అందరిపై ఉందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు.

వ్యభిచారం చేయాలంటూ విద్యార్థినులపై ఒత్తిడి

వ్యభిచారం చేయాలంటూ విద్యార్థినులపై ఒత్తిడి

ఇక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర‍్మలాదేవి గురించి కూడా కొంత తెలుసుకుందాం. విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోటలోని దేవాంకుర్‌ కళాశాల ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యభిచారం చేయాలంటూ విద్యార్థినులను ఒత్తిడి చేస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిందనే ఆరోపణలపై నిర‍్మలాదేవిని పోలీసులు అరెస్టు చేశారు.

తాతను సుఖపెడితే

తాతను సుఖపెడితే

ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అసలు నిర్మలా దేవి మాట్లాడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. "ప్రాక్టికల్‌ పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే నేను చెప్పే వారికి సుఖం అందించు. తాతను సుఖపెడితే.. డబ్బుతో పాటు సంఘంలో మంచి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. నేను చెప్పినట్లు వింటే నీ భవిష్యత్తు బావుంటుంది" అంటూ ఓ విద్యార్థినిని నిర్మలాదేవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ మారాయి. ఈ వివాదం ఏకంగా రాజ్‌భవన్‌ను తాకింది.

ఐదుగురు సభ్యుల కమిటీ

ఐదుగురు సభ్యుల కమిటీ

నిర్మలా దేవి మాటలున్న ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యవహారంపై విచారణ జరిపేందుకు యూనివర్సిటీ సెనేట్‌ సభ్యుడి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు.

ఆ తాత ఎవరో కాదు తమిళనాడు గవర్నరే

ఆ తాత ఎవరో కాదు తమిళనాడు గవర్నరే

నిర్మలాదేవి పేర్కొన్న ఆ తాత ఎవరో కాదు తమిళనాడు గవర్నరే అని స్తానిక మీడియాలో కథనాలు వెలువెడ్డాయి. నిర్మలాదేవి ఆడియోలో తాత అనే పదం ఉన్నంతమాత్రాన ఆ తాతను నేను కాదు అంటున్నాడు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌. చూద్దాం.. ఈ గవర్నర్ తాత రాసలీలలు కూడా త్వరలో మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది.

English summary

tamil nadu sex for degrees case allegations of indian governors

tamil nadu sex for degrees case allegations of indian governors
Story first published:Wednesday, April 18, 2018, 13:28 [IST]
Desktop Bottom Promotion