For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోలీసులు ఇంత కక్కుర్తికి పాల్పడుతారా? దొంగతనం చేసి సీసీ కెమెరాల్లో అడ్డంగా బుక్ అయ్యారు (వీడియోలు)

ఆమె పేరు నందిని. వయస్సు 34. సూపర్ మార్కెట్లో ఏదో కొనేటట్లుగా లోపలికి వెళ్లింది. అటూ ఇటూ చూసింది. ఎక్కడా సిబ్బంది కనపడలేదు. దీంతో సెల్ లో మాట్లాడుతున్నట్లు నటించింది. తర్వాత అక్కడున్న కొన్ని వస్తువులను

|

పోలీసులంటే అందరికీ ఎంతో కొంతైనా అభిమానం ఉంటుంది. వారు కాస్త నీతి నిజాయితీగా ఉంటారని అనుకుంటారు. ఎవరో ఒకరిద్దరు పోలీసులు కాస్త అవినీతికి పాల్పడినా మొత్తం పోలీసు డిపార్ట్ మెంట్ అయితే జనాలకు ఇంకా నమ్మకం ఉంది. కానీ కొందరు పోలీసులు మాత్రం మరీ చిల్లర దొంగతనాలు చేసి ఆ డిపార్ట్ మెంట్ కు ఉన్న పరువు పోగొడుతున్నారు.

తాజాగా చోటుచోటుచేసుకున్న రెండు సంఘటనలే ఇందుకు నిదర్శనం. తిరుపతిలో, చైన్నైలో ఇద్దరూ కానిస్టేబుల్స్ దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వాళ్లు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. కానిస్టేబుల్స్ అంత చిన్నవాటికి కక్కుర్తిపడతారా అని అనుకుంటాం.

యూని ఫామ్ లోనే సూపర్ మార్కెట్ కు

చెన్నైలో ఒక మహిళా కానిస్టేబుల్ యూని ఫామ్ లోనే ఒక సూపర్ మార్కెట్ కు వెళ్లింది. తర్వాత ఆమె సెల్ ఫోన్ లో మాట్లాడుతూ నటిస్తూ అక్కడున్న ఒక ఐటెంను కొట్టేసింది. ఎవ్వరూ చూడలేదనుకుంది. సీసీ కెమెరాలకు చిక్కింది. చెన్నై లోని చెట్‌ పెట్ లోని సూపర్ మార్కెట్ కు స్థానిక పోలీస్ స్టేషన్ లో పని చేసే ఒక మహిళా కానిస్టేబుల్ వెళ్లింది.

Video Credit

నటించింది

నటించింది

ఆమె పేరు నందిని. వయస్సు 34. సూపర్ మార్కెట్లో ఏదో కొనేటట్లుగా లోపలికి వెళ్లింది. అటూ ఇటూ చూసింది. ఎక్కడా సిబ్బంది కనపడలేదు. దీంతో సెల్ లో మాట్లాడుతున్నట్లు నటించింది. తర్వాత అక్కడున్న కొన్ని వస్తువులను తన యూనిఫామ్ షర్ట్ జేబులో వేసుకుంది.

ఏం తెలియనట్లు

ఫైవ్ స్టార్ చాక్లెట్స్, జెమ్స్, మస్కిటో రీ పిల్లెంట్ క్రీమ్ ఇలా చిన్న చిన్న వస్తువులు మొత్తం జేబులో వేసుకుని, ఏం తెలియనట్లు బయటకు వచ్చింది. అయితే ఈ విషయాన్ని సీసీ టీవీలో గమనించిన సిబ్బంది సెక్యూరిటీని చెక్ చెయ్యమని చెప్పారు.

దబాయించింది

ఏయ్ నేను ఏమి తీసుకోలేదని దబాయించింది. అయితే సెక్యూరిటీ చేస్తే ఆమె దొంగతనం చేసినవన్నీ బయటపడ్డాయి. తర్వాత ఆమె తీసుకున్న వస్తువులను మొత్తం ఒక పేపర్ పై రాసి వాటి విలువ కూడా రాసి క్షమాపణలు కోరుతూ లేఖ రాయాలని సూపర్ మార్కెట్ సిబ్బంది ఆమెను కోరారు.

దాడి చేయించింది

అయితే ఆమె కోపంతో ఊగిపోయింది. అసలు నేను ఇక్కడ ఏ వస్తువులు తీసుకోలేదు అని చెప్పింది. ఇంటికెళ్లి తన భర్తను తీసుకొచ్చి తనను ప్రశ్నించిన వారిపై దాడి చేయించింది. ఒక ఉద్యోగి గాయపడ్డారు. ఇవన్నీ సూపర్ మార్కెట్ సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యాయి.

సస్పెండ్ చేశారు

ఈ విషయం డిపార్ట్ మెంట్ లోని పై అధికారుల దృష్టికి వెళ్లడంతో మహిళా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేశారు. చివరకు ఆమె దొంగలించిన వస్తువుల వివరాలు మొత్తం రాసి క్షమాపణ చెప్పింది.

కోడి గుడ్లను కూడా దొంగలిస్తారా

ఇక తిరుపతిలోని కొర్లగుంటలో మరో సంఘటన జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక షాప్‌ లో గుడ్లను కొనేందుకు వెళ్లాడు. అయితే ఇంతలో ఏమనుకునున్నాడో ఏమో అక్కడ గుడ్లు అమ్మే అమ్మాయి తనను చూడడం లేదని ఓ నాలుగు గుడ్లు చేతిలోకి తీసుకుని తర్వాత జేబులో పెట్టుకున్నాడు.

తెలియదు పాపం

తెలియదు పాపం

పాపం సీసీ కెమెరాలో ఈ విషయం రికార్డ్ అయ్యిందని అతగాడికి తెలియదు. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు మరీ కోడి గుడ్లను కూడా దొంగలిస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియాపై అందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

English summary

tamil nadu woman cop caught on camera stealing chocolates tirupati constable theft eggs

tamil nadu woman cop caught on camera stealing chocolates tirupati constable theft eggs
Story first published:Friday, July 27, 2018, 11:35 [IST]
Desktop Bottom Promotion