For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ లో పాల్గొనాలనే కోరిక జనాల్లో తీవ్రంగా తగ్గిపోయింది, కరెంట్ పోతేనే చేసుకోవాలనిపిస్తుందట

సాధారణంగా ప్రతి వ్యక్తి వందశాతం సెక్స్ కోరికలను కలిగి ఉండడు. కొన్ని కారణాల వల్ల ప్రతి వ్యక్తిలో సెక్స్ కోరికలు తగ్గిపోతుంటాయి. మానసిక ఒత్తిళ్ల వల్ల అనారోగ్యం వల్ల కోరికలు తగ్గిపోతాయి.

|

మీరు ఎక్కువగా టీవీ చూస్తున్నారా? అయితే మీరు అందులో వీక్ అయిపోతారు. బాగా టీవీ చూసే దంపతులు అందులో ఎక్కువగా పాల్గొనలేరంట. ఈ విషయం తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది.

సాధారణంగా ప్రతి వ్యక్తి వందశాతం సెక్స్ కోరికలను కలిగి ఉండడు. కొన్ని కారణాల వల్ల ప్రతి వ్యక్తిలో సెక్స్ కోరికలు తగ్గిపోతుంటాయి. మానసిక ఒత్తిళ్ల వల్ల అనారోగ్యం వల్ల ఇతర సమస్యల వల్ల చాలా మందిలో దానిపై ఆసక్తి తగ్గిపోతుంది. అయితే దంపతులు టీవీ చూడడం వల్ల 6% సెక్స్ కోరికలు తగ్గిపోతాయని ఇటీవల ఒక అధ్యాయనంలో వెల్లడైంది.

ఆరుశాతం తక్కువగా సెక్స్ లో

ఆరుశాతం తక్కువగా సెక్స్ లో

బాగా టీవీ చూసే దంపతులు మిగతావారితో పోల్చుకుంటే వారంలో ఆరుశాతం తక్కువగా సెక్స్ లో పాల్గొంటారు. డెలావేర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు స్మార్ట్ ఫోన్ల వల్ల కూడా సెక్స్ లో పాల్గొనాలనే ఆసక్తి తగ్గిపోతుందట.

నెలలో కేవలం మూడు సార్లు మాత్రమే సెక్స్

నెలలో కేవలం మూడు సార్లు మాత్రమే సెక్స్

ఈ అధ్యయనంలో 80 దేశాలకు సంబంధించిన దాదాపు నాలుగు మిలియన్ల మంది అభిప్రాయాలను తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం చాలా మంది నెలలో కేవలం మూడు సార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొంటున్నారని తేలింది. దీన్ని బట్టి జనాల్లో సెక్స్ పాల్గొనాలనే కోరిక ఎంత తీవ్రంగా తగ్గిపోయిందో తెలుసుకోవొచ్చు.

పరిశోధన నిర్వహించిన వ్యక్తికి కూడా కోరిక తగ్గిందట

పరిశోధన నిర్వహించిన వ్యక్తికి కూడా కోరిక తగ్గిందట

అంతేకాదండోయ్ ఈ పరిశోధన నిర్వహించిన ఆయనకు కూడా పాపం టీవీ మోజులో పడి సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయట. ఆయన హెచ్ బీఓ టీవీలో రాత్రి పూట వచ్చే ఒక సిరీస్ ను రెగ్యులర్ గా చూస్తుంటాడట. రాత్రి 10.30 వరకు అలాగే ఆయన టీవీ చూస్తూ కూర్చొంటాడట. అప్పటికే నిద్ర ముంచుకురావడంతో అందులో పాల్గొనకుండానే నేరుగా నిద్రపోతాడంట. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా వెల్లడించాడు.

స్మార్ట్ ఫోన్ల వాడకంతో తగ్గుతున్న కోరికలు

స్మార్ట్ ఫోన్ల వాడకంతో తగ్గుతున్న కోరికలు

ఇక డెలావేర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ పరిశోధనను ఐదు ఖండాల్లో లక్షల మందిపై చేశారు. ఇటీవల అందరూ స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నారు. వీటివల్ల వల్ల కూడా మనుషుల్లో సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతాయని పరిశోధనలో వెల్లడైంది. 2010 లో నిర్వహించిన పరిశోధనలో జనాలకు కాస్త సెక్స్ పై ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తేలింది. కానీ స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత మనుషుల్లో సెక్స్ కోరికలు బాగా తగ్గాయన్నది వాస్తవం.

రోజులో 11 గంటల పాటు

రోజులో 11 గంటల పాటు

నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ లో ఈ పరిశోధనకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుశంగా ప్రచురించారు. ఇక యూఎస్ లో ఉండే వారిలో చాలా మంది ఒక్క రోజులో 11 గంటల పాటు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, టీవీ చూడడం, తదితర పనుల్లో నిమగ్నమై ఉంటారని నీల్సెన్ సర్వే ప్రకారం వెల్లడైంది. ప్రస్తుతం మరో గంటన్నరపాటు అధికంగా అక్కడి జనం వాటితోనే గడుపుతున్నారట. దీంతో వారిలో సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతున్నాయట.

కరెంట్ పోతే సెక్స్ చేసుకోవాలనిపిస్తుందట

కరెంట్ పోతే సెక్స్ చేసుకోవాలనిపిస్తుందట

బ్రిటన్ ఎక్కువ మంది రాత్రి 10 నుంచి 11 మధ్యలో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం, టీవీ చూడడం వంటివి చేస్తున్నట్లు తేలింది. దీని వల్ల వారిలో సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయి. అయితే రాత్రి పూట కరెంట్ పోవడం వల్ల పవర్ కట్స్ వల్ల చాలా మంది జంటల్లో సెక్స్ లో పాల్గొనాలనే కోరిక పుడుతుందట. లేదంటే టీవీ చూడడం, ఇంటర్నెట్ లో నిమగ్నమై ఉంటున్నారట. అవి ఇవీ చూసి రాత్రి 10 :30 తర్వాత బెడ్ పైకి వెళ్తే నిద్ర వస్తుంది తప్ప సెక్స్ పై కోరిక కలగదని ఈ పరిశోధనలో ప్రధానంగా తేలిన విషయం. సో.. భార్యా భర్తలు ఇప్పటికైనా టీవీలను చూడడం తగ్గించండి. ఫోన్లను పక్కన పెట్టండి. లేదంటే అందుకు పనికిరాకుండాపోతారు.

English summary

television may be destroying sex for couples

television may be destroying sex for couples
Story first published:Friday, September 7, 2018, 16:15 [IST]
Desktop Bottom Promotion