For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రజినీకాంత్ కొత్త పార్టీ గుర్తు వెనుక ఉన్న రహస్యాలు మీకు తెలుసా?

భారతదేశం మొత్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న నటుల్లో రజినీకాంత్ కూడా ఒక్కరు. ఎంతో బాధ్యతతో హుందాగా వ్యవరించే రజినీకాంత్, ఈ మధ్యే తమిళనాడు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ తీ

By R Vishnu Vardhan Reddy
|

భారతదేశం మొత్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న నటుల్లో రజినీకాంత్ కూడా ఒక్కరు. ఎంతో బాధ్యతతో హుందాగా వ్యవరించే రజినీకాంత్, ఈ మధ్యే తమిళనాడు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయంతో అయన అభిమానుల తో పాటు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు. అయన పార్టీ ఎన్నో సంచలనాలకు వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. కొంతమంది ప్రజలు మాత్రం అయన పార్టీ గుర్తు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అనే విషయమై తెలుసుకోవడానికి ఆరాలు తీస్తున్నారు.

సాధారణంగా అన్ని రాజకీయ పార్టీ లు తమ పార్టీ గుర్తులను తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రూపొందించుకుంటూ ఉంటాయి. రజినీకాంత్ బాబా సినిమా లో తాను చూపించే గుర్తునే తన రాజకీయ పార్టీ గుర్తుగా పెట్టుకోవడం జరిగింది. తాను ఇవ్వబోయే వాగ్దానాలకు ఎప్పటికి కట్టుబడి ఉంటాను అనే సంకేతాన్ని ప్రజలోకి బలంగా పంపించాలి అనే ఉద్దేశ్యం తోనే పార్టీ గుర్తుని అలా పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తానూ రాజకీయాల్లోకి రాబోతున్నాని చెప్పి మంచి శుభ వార్తని అందించారు రజినీకాంత్.

Rajnikanth's political symbol

రజినీకాంత్ పార్టీ గుర్తు కు సంబంధించి ఎన్నో రకాల అర్ధాలు ఉన్నాయి. రజినీకాంత్ పార్టీ గుర్తుని "బాబా గుర్తు" అని కూడా అంటారు. శరీరంలో చెడుని తొలిగించడానికి, పరిశుద్ధులను చేయడానికి ఆ గుర్తు చిహ్నంగా నిలుస్తుంది. ఈ గుర్తునే తన రాజకీయ ప్రస్థానానికి కూడా వాడుకోనున్నారు.

ఆ సంజ్ఞ ఏమి చూపిస్తుందంటే :

ఆ సంజ్ఞ ఏమి చూపిస్తుందంటే :

రజినీకాంత్ తన పార్టీ కి పెట్టుకున్న గుర్తు చాలా సాధారణంగా ఉంటుంది. మధ్య వేలు మరియు ఉంగరం వేలు ముడుచుకొని ఉంటాయి. బోటని వేలు ఆ రెండు వేళ్ళ గోర్ల చివర్లను కప్పి వేస్తుంది. చూపుడు వేలు, చిటికిన వేలు నిటారుగా నిలుచొని ఉంటాయి. ఈ గుర్తు రజినీకాంత్ నటించిన బాబా సినిమా లోనిది. ఆధ్యాత్మికతను మరియు యోగ సంబంధమైన ఎన్నో విషయాలను పరిపూర్ణంగా తెలియజేయబోతుంది అనే విషయానికి ప్రతిబింబంగా ఆ గుర్తు నిలుస్తుంది.

అపన ముద్ర :

అపన ముద్ర :

ఈ ముద్ర కు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. ఇందులో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. శరీరంలో ఒక దైవ భావన కలగటానికి ఇది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో వాయు ముద్ర కూడా కలిసి ఉంది. ఈ గుర్తు మాములుగా శరీరంలో శక్తిని పునరుద్ధరిస్తుంది. అంతేకాకుండా శరీరంలో వాత, పితల ద్వారా ఏ ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో, వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

సింహ ముఖ ముద్ర :

సింహ ముఖ ముద్ర :

ఈ గుర్తుని సాధారణంగా ప్రాచీన నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి మరియు ఒడిస్సి లలో వాడుతుంటారు. ఈ గుర్తు అడవికి రాజు, ఎంతో తెలివి మరియు దైర్యం కలిగిన సింహానికి ప్రతీకగా ఇది నిలుస్తుంది.

కరణ ముద్ర :

కరణ ముద్ర :

ఈ యొక్క ప్రత్యేకమైన గుర్తు ఏదైతే ఉందొ, దీనిని కరణ ముద్ర అని కూడా అంటారు. దీనికి బుద్ధునితో కూడా సంబంధం ఉంది. ఈ గుర్తుని బుధ్దినికి సంబంధించిన ఎన్నో చిత్రాల పై కూడా మనం చూడవచ్చు. ఈ గుర్తు చాలా శక్తివంవంతమైనదని, వ్యతిరేక శక్తిని తగ్గిస్తుందని మరియు చెడుని దూరం చేస్తుంది అని కూడా చాలా మంది నమ్ముతారు.

దెయ్యం కొమ్ములు :

దెయ్యం కొమ్ములు :

1970 సంవత్సరంలో బ్లాక్ సబ్బచ్ కు చెందిన రోన్ని జేమ్స్ డియో అనే వ్యక్తి ఈ గుర్తుని అప్పట్లో వాడేవాడు. ఆ సమయంలో ఈ గుర్తు దెయ్యం కొమ్ములుగా బాగా ప్రసిద్ధి చెందింది. తన అమ్మమ్మ ఈ వింత గుర్తుని దెయ్యాలను ఎదిరించడం కోసం వాడేదని, అలా తాను కూడా ఈ గుర్తుని వాడటం మొదలుపెట్టాడని ఆయన చెప్పాడు.

ఈ గుర్తు చెడుని దూరం చేయడానికి మరియు వ్యవస్థను పరిశుభ్రం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చాలామంది నమ్ముతున్నారు. మరి ఇలాంటి గుర్తుని తన పార్టీ గుర్తుగా పెట్టుకున్న రజినీకాంత్ వ్యవస్థలో ఎటువంటి పెనుమార్పులు తీసుకొస్తాడో చూడాలి. అతడు రాజకీయంగా కూడా ఎన్నో విజయాలను సాధించాలని, రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ గా ఎదగాలని మనం అందరం కోరుకుందాం.

English summary

The Actual Meaning Behind Rajnikanth's Symbol

The political party symbols has its own ideology, and Rajinikanth's 'Baba symbol' seems well aligned with his claim, as he steps into Tamil Nadu's politics. He promises of a spiritual and political government.
Story first published:Sunday, January 7, 2018, 10:05 [IST]
Desktop Bottom Promotion