Latest Updates
-
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త! - శుక్రవారం, 19 జూన్ 2026 -
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో
మిగిలిన రాశి చక్రాలను ఆటపట్టించడానికి లేదా అవమానించడానికి ఉత్తమమైన మార్గాలివే
మిగిలిన రాశి చక్రాలను ఆటపట్టించడానికి లేదా అవమానించడానికి ఉత్తమమైన మార్గాలివే
మీరు ఒక వ్యక్తిని ఆటపట్టించడానికి, లేదా ఒక్కోసారి అవమానిoచడానికి ఎంచుకునే ఉత్తమ మార్గం ఏమిటి? మనం తరచుగా ఇతరుల బలహీనమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా వారిని ఆటపట్టించడమో లేదా అవమానపరచడమో చేస్తుంటాం. మానవ సహజగుణం. కొందరు సరదాగా ఆటపట్టిస్తే, కొందరు వారిని భాధపెట్టేలా అవమానిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ ఈ వ్యాసంలో, రాశి చక్రాల పరంగా ఏవిధంగా ఆటపట్టించవచ్చో తెలుసుకుందాం.
ఈ అవమానాలు అతని / ఆమె రాశిచక్రం ఆధారంగా ఎలా ఉంటాయి, ఎంత సులభం? అనే వివరాలను మీకు తెలియజేస్తున్నాము!
ప్రతి రాశిచక్రం యొక్క బలహీనమైన భాగాన్ని తెలుసుకోవడానికి వివరాలను పరిశీలించండి. తద్వారా మీ వ్యతిరేకులను ఎలా ఆటపట్టించవచ్చో తెలుసుకోండి !
మిగిలిన రాశిచక్రాలను ఆటపట్టించడానికి లేదా అవమానించడానికి ఉత్తమమైన మార్గాలివే

మేష రాశి: మార్చి21-ఏప్రిల్19
ఒక మేష రాశికి చెందిన వ్యక్తిని అవమానించడం అత్యంత సులభమయిన పనులలో ఒకటి. మీరు చెయ్యాల్సిన పని ఒక్కటే “ఈ పని మీకు చేతకాదు, చేయలేరు, మీకు అంత అర్హత లేదు” అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడమే. ఇంతే కాకుండా, మీరు వారిని మరింత తీవ్రంగా అవమానించాలని కోరుకుంటే, “మీ గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు, బోర్ గా ఉంటుంది మీతో మాట్లాడితే” అని చెప్పండి చాలు. అంతకన్నా అవమానం మరొకటి ఉండదు.

వృషభ రాశి: ఏప్రిల్20-మే20
ఒక వృషభ రాశికి చెందిన వ్యక్తిని అవమానించేందుకు, “ఈ పనిని మీకన్నా మెరుగ్గా నేనే చేయగలను” అని చెప్పండి చాలు. మీరు అతని తోబుట్టువు అయితే మాత్రం, ఇంక అతని కోపానికి హద్దులుండవు. మీరు క్లాసిక్ అవమానాలని వాడాలని కోరుకుంటే, మీరు చేయవలసినది వ్యక్తిగతంగా అవమానించడమే, వ్యక్తిగత అవమానాన్ని వీరు ఎన్నటికీ జీర్ణించుకోలేరు.

మిధున రాశి: మే 21- జూన్ 20
ఒక మిధున రాశి వారిని అవమానించాలంటే ఒకటే ఒక మార్గం. వారిని విస్మరించడమే! వారు మీ చుట్టుపక్కలే ఉండి, మీకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, కేవలం పట్టించుకోకుండా, వారి కుంటి విషయాలు వినడానికి మీకు ఆసక్తి లేనట్లుగా వారికి కనిపించండి చాలు, మీ పని పూర్తి అవుతుంది!

కర్కాటక రాశి: జూన్ 21- జూలై 22
కర్కాటక రాశి వారిని అవమాన పరచడానికి, మీరు వారి వంటని, లేదా వారి కళని అవమానపరచాలి! వారి పాక నైపుణ్యాల గురించి వారిని అవమానపరచడం కంటే దారుణమైన విషయం ఏమీ లేదు. మీరు వారిని మరింత అవమానించాలని కోరుకుంటే, మేమే కాదు ఈ ప్రపంచంలో ఎవరికీ మీ వంట నచ్చదు అని చెప్పండి చాలు.

సింహ రాశి: జూలై 23-ఆగస్టు 23
ఒక సింహ రాశి వారిని అవమానించడానికి, మీరు చేయవలసినది వారి పట్ల ద్యాస ఉంచకపోవడమే. వీరు ఎప్పుడూ ద్యాస తమ మీదే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీరితో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ, మరెవరి మీదనైనా ద్యాస ఉన్నట్లుగా వీరి చెవిన పడేస్తే చాలు. మీరు మరింత అవమానాన్ని జోడించాలని కోరితే, మీకు తెలివితేటలు, హాస్య చతురత లేవని చెప్పండి. ఇంక పరిణామాలు చూడండి ఎలా మారుతాయో.

కన్యా రాశి: ఆగస్టు 24-సెప్టెంబర్ 23
ఒక కన్యా రాశికి చెందిన వ్యక్తిని అవమానించడానికి, మీరు చెయ్యల్సింది ఒక్కటే “ వారు కష్టపడి ప్రయత్నిస్తున్న అంశంలో మీరు చేతకాని వారు అని అనడమే” . మీరు వారిని మరింత ఏడిపించాలని కోరుకుంటే, “మీ గురించి ఎవరికీ ఆలోచన లేదు” అని చెప్పండి చాలు.

తులా రాశి: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23
ఒక తులా రాశి వారిని అవమానించడానికి, మీరు చెయ్యాల్సిన పని ఒక్కటే “వారి తీవ్రమైన భయాల గురించి మాట్లాడడమే, అవి మీకు చిన్నగా అనిపిస్తున్నాయా అని అడగండి”. దీనికి కారణం వారు ప్రతి చిన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచించడమే. ప్రతి విషయానికి తీవ్రంగా కలవరపడుతూ ఉంటారు.

వృశ్చిక రాశి: అక్టోబర్ 24-నవంబరు 22
మీరు ఒక వృశ్చిక రాశి వారిని అవమానించాలనుకుంటే, మీరు చెయ్యాల్సిన పని అన్నిటి కన్నా పెద్ద అబద్ధం చెప్పడమే, మరియు మీరు అంత తెలివైన వారు కాదు అని చెప్పండి! మీరు వీరిని మరి కాస్త ఎక్కువ అవమానపరచాలని కోరుకుంటే, అప్పుడు వారు అంత రొమాంటిక్ కాదు అని చెప్పండి చాలు.

ధనుస్సు రాశి: నవంబర్ 23-డిసెంబరు 22
ధనుస్సురాశి వారిని అవమానించడానికి, మీతో ప్రయాణించడం చాలా ఇబ్బందికరం అని వారికి చెప్పండి! కాసేపు తీక్షణంగా చూడండి. కొన్ని క్షణాల వ్యవధిలోనే వారు ఆ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని వాదనకు వస్తారు.

మకర రాశి: డిసెంబర్ 23- జనవరి 20
ఒక మకర రాశికి చెందిన వ్యక్తిని అవమానించడానికి, మీరు కేవలం వారి సంగీత పరమైన అభిరుచిని అవమానించడం చేయవచ్చు! ఉదాహరణకు "ఇది నేను విన్న పాటల్లో సాహిత్యపరంగా అత్యంత భయానకమైన పాట కానీ ఇది కూడా మీకు నచ్చిందంటే, మీ టేస్ట్ నాకు అర్ధం కావడం లేదు అనండి." వారి ముఖ కవళికలు చూడండి మీకే తెలుస్తుంది!

కుంభ రాశి: జనవరి21-ఫిబ్రవరి 18
ఒక కుంభ రాశికి చెందిన వ్యక్తిని అవమానించడానికి, మీరు చేయవలసిన పని ఒక్కటే వారి వ్యక్తిగత సమస్యల గురించి పబ్లిక్లో ప్రశ్నించడమే. వీరు ఎప్పుడూ గోప్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వ్యక్తిగత సమస్యల గురించి ప్రస్తావిస్తే వీరి కోపం నషాళానికి అంటుతుంది.

మీన రాశి: ఫిబ్రవరి 19-మార్చి 20
మీన రాశి వారిని అవమానించాలనుకుంటే, ఏ కళలో అయినా వారి ఆసక్తులను అవమానిస్తే చాలు. కళ నుండి దూరమైతే అన్న ప్రశ్న సంధించండి. ఈ ప్రశ్న ఈ వ్యక్తులను అత్యoత భాదిస్తుంది. మీరు కఠినమైన రీతిలో వారిని అవమానించాలని కోరుకుంటే, మీ అరుపులకు ఎవరూ భయపడరని చెప్పండి చాలు.
ఈ వ్యాసం ఒకరి మద్య ఒకరికి చిచ్చులు పెట్టడానికి కాదండోయ్. ఇది కేవలం వాళ్ళ స్వభావాలను ఉద్దేశించి రాశి చక్రాల గుణగణాలను నిర్దేశించి చెప్పిన వివరాలు. ప్రతిమనిషికీ తమకంటూ ఆత్మ గౌరవం అనేది ఉంటుంది, దానిని కించపరిచేలా ప్రవర్తిస్తే ఎవరికైనా కోపం నషాళానికి అంటుతుంది. ఈ కారణాల వలన ఈ రాశి చక్రాల వారు తీవ్రంగా ఆలోచనలు చేస్తారు కాబట్టి , ఇలాంటివి వాళ్ళ ముందు ప్రదర్శించకుండా ఉండడమే మేలు. ఏది ఏమైనా అందరూ మనలాంటి మనుషులే, ఒకర్ని భాధపెడితే మనకేమొస్తుంది చెప్పండి. కొందరు కావాలని హేళన చేస్తూ భాద పెడుతూ ఉంటారు. అలాంటి వారికి చురకలు వేయడం ఏమాత్రం తప్పు కాదు. పరిస్థితులను బట్టి మనిషి వెళ్ళాలి, అంతేకాని మనిషిని బట్టి పరిస్థితులు వెళ్లకూడదని నిర్ధారించుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. రాశి చక్రాల గురించి మరిన్ని వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి. మీరు ఇలాంటి అవమానానికి గురైనవారైతే, మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications