For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పట్లో హలీం ఐదు పైసలకే అమ్మేవారు.. హలీం హైదరాబాద్ అలా వచ్చింది

|

రంజాన్ మాసం ప్రారంభమైంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం
హాలీమ్ హవా మొదలైంది. రంజాన్ మాసం ఆధ్యాత్మిక మాసం. ముస్లిం సోదరులు ఉపవాసాల్లో, ఆరాధనల్లో గడిపే మాసం ఇది.

పగలంతా పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిష్టగా చేసే ఈ ఉపవాసాల నెలలో హైదరాబాదులో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక సందడి అలుముకుంటుంది. ఇఫ్తార్ విందులు ముస్లిం,ముస్లిమేతర సోదరుల్లో సమైక్యతకు వేదికలవుతున్నాయి.

అయితే ఈ మాసంలో హలీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హలీమ్ కు బార్కాస్ కు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. నిజానికి ఇది బార్కాస్ కాదు, బారాక్స్. సైనికులుండే బారాక్స్ పదం భ్రష'రూపమే బార్కాస్.

నిజాము సైన్యం ఉండే బారాక్స్ ఇది ఒకప్పుడు. నిజాము సైన్యంలో అరబ్బు దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉండేవారు. వారిని చావూష్ లని పిలిచేవారు. అప్పట్లో అరబ్బు దేశాలు ఇంత సంపన్న దేశాలు కూడా కాదు.

ఎమన్ దేశస్థులు

ఎమన్ దేశస్థులు

నిజాం సైన్యంలో పనిచేయడానికి ముఖ్యంగా ఎమన్ దేశస్థులు చాలా మంది వచ్చారు. ఎమన్ లోని హజ్రల్ మౌత్ ప్రాంతానికి చెందినవారిని ఎక్కువగా నిజాము సైన్యంలో చేర్చుకున్నారు. ఈ సైనికులు విశ్వాసానికి, యుద్ధవిద్యలకు అప్పట్లో పేరుపొందినవారు. ముఖ్యంగా నిజాము వ్యక్తిగత రక్షణ దళంలో ఈ సైనికులు ఎక్కువగా ఉండేవారు.

హరీస్‌ కూడా తీసుకువచ్చారు

హరీస్‌ కూడా తీసుకువచ్చారు

ఈ ఎమన్ సైనికులు తమతో పాటు ఎమన్ కు చెందిన వంటకం హరీస్‌ కూడా తీసుకువచ్చారు. అదే హలీమ్ గా మారింది. హలీమ్ నిజానికి అరబీ వంటకం. హైదరాబాదులో నిజాం కాలంలో ఎమన్ నుంచి వచ్చిన వారు అలా ఈ వంటకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు.

బార్కాస్ ప్రాంతంలో

బార్కాస్ ప్రాంతంలో

స్వాతంత్య్రం తర్వాత నిజాం సైన్యం రద్దయ్యింది. బార్కాస్ ప్రాంతంలో ఈ మూలాలకు చెందిన ప్రజలు ఇప్పటికీ నివసిస్తున్నారు. నేడు కూడా ప్రతిరోజు మనకు అక్కడ హరీస్, హలీమ్ లభిస్తాయి.

హైదరాబాద్ హలీమ్ ఫేమస్

హైదరాబాద్ హలీమ్ ఫేమస్

హైదరాబాద్ లో హలీమ్ చాలా ఫేమస్. గోధుమలు, మాంసం, పప్పులు కలిపి పేస్టులా తయారు చేసే ఈ వంటకం ముఖ్యంగా రమజాన్ మాసంలో ఎక్కువగా వండుతారు. రంజాన్ వస్తే చాలు హైదరాబాదులోని ప్రతి హోటల్ హలీమ్ ను వడ్డిస్తుంది. హలీమ్ వండడానికి నెలరోజుల కోసం నిపుణులైన వంటవాళ్ళను కూడా నియమించుకుంటారు.

కొత్త ఘుమఘుమలతో

కొత్త ఘుమఘుమలతో

హైదరాబాదీ హలీమ్ కొత్త ఘుమఘుమలతో ఎవ్వరినైనా సరే నోరూరిస్తుంది. ముస్లిం ముస్లిమేతరులన్న తేడా లేకుండా అందరూ హలీమ్ ను ఎంతో రుచిగా తింటారు. రంజాన్ మాసంలో ఇచ్చే ఇఫ్తార్ విందుల్లో హలీమ్ తప్పనిసరిగా ఉంటుంది.

రంజాన్ లో మాత్రమే హలీమ్

రంజాన్ లో మాత్రమే హలీమ్

హైదరాబాదు నగరంలోని హోటళ్లలో కేవలం రంజాన్ మాసంలో మాత్రమే హలీమ్ లభిస్తుందనుకుంటే పొరబాటు. బార్కాస్ ప్రాంతంలో ప్రతిరోజు కూడా హలీమ్ లభిస్తుంది. బార్కాస్లో రెండు రకాల హరీస్ మనకు లభిస్తుంది. ఒకటి ఖారీ హరీస్, రెండవది మీఠీ హరీస్. మీఠీ హరీస్ అంటే మామూలుగా వండిన హరీస్ లోనే పంచదార కూడా కలుపుతారు. హరీస్ లో గోధుమ, మాంసం, కొత్తిమీర, ఘీ మాత్రమే అందులో ఉంటాయి.

సుల్తాన్ ఇచ్చే విందుల్లో

సుల్తాన్ ఇచ్చే విందుల్లో

1930 ప్రాంతంలో నిజాం దర్బారులోని సుల్తాన్ సైఫ్ నవాజ్ జంగ్ తాను ఇచ్చే విందుల్లో హరీస్ తప్పనిసరిగా వడ్డించేవారు. అయితే ఆ తర్వాత హరీస్ భారతీయీకరణ చెందింది. హరీస్‌లో కేవలం గోధుమ, మాంసం, కొత్తిమీర వంటివి తప్ప మరేమీ ఉండవు. దానికి పప్పులు, మసాలాలు, వగైరా దినుసులను కూడా చేర్చడంతో మన హైదరాబాదీ హలీమ్ తయారైంది.

నోరూరించే వంటకం

నోరూరించే వంటకం

ఇక హైదరాబాదు హోటళ్ళలో హలీమ్ 1950 తర్వాతి నుంచి ప్రతి రంజాన్ లో ముఖ్యమైన వంటకంగా చోటు సంపాదించుకుంది. శతాబ్దాలుగా నోరూరిస్తున్న వంటకం ఇది. అరబ్బు, టర్కీ, పర్షియా దేశాల్లో ప్రజలు ఇష్టపడే వంటకం. అరబ్బు దేశాల్లో దీన్ని హరీస్ అంటే.. పర్షియన్లు దీన్ని హలీమ్ అంటారు.

అరుదైన వంటకాలు

అరుదైన వంటకాలు

రెండో ప్రపంచయుద్ధ కాలంలో నిజాము ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన పాలకుడు. నిజాము వంటశాలలో అఫ్గనిస్తాన్, ఈరాన్, సౌదీ అరేబియా దేశాల వంటవాళ్ళు ఉండేవారు. అరుదైన వంటకాలు కూడా అక్కడ తయారయ్యేవి. బిరియానీ, కబాబ్, హలీమ్ వంటి వంటకాలతో నిజాము వంటశాల ఘుమఘమలాడేది. హైదరాబాదు హోటళ్ళలో మొట్టమొదట హలీమ్ ను ప్రవేశపెట్టిన కీర్తి మదీనా హోటలుకే దక్కుతుంది.

మదీనా హోటలు ఫస్ట్

మదీనా హోటలు ఫస్ట్

మదీనా హోటలు చరిత్ర శతాబ్దకాలం చరిత్ర. దాదాపు 70 సంవత్సరాల క్రితం మదీనా హోటలులో మొదటి సారి హలీమ్ వంటకాన్ని కస్టమర్లకు వడ్డించారని తెలుస్తోంది. ఇప్పుడు ఒక ప్లేటు హలీవ్‌ు విలువ వందరూపాయలకు పైబడి ఉంది కాని ప్రారంభంలో మదీనా హోటల్లో ఒక ప్లేటు హలీమ్ విలువ కేవలం ఐదు పైసలే.

పిస్తా హౌస్

పిస్తా హౌస్

ఇప్పుడు హైదరాబాదు హలీమ్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు పిస్తా హౌస్. హైదరాబాదు పాతనగరంలోని పిస్తా హౌస్ హోటలులో ఈ హలీమ్ లభిస్తుంది. హైదరాబాదులోని అన్ని ప్రాంతాల్లోను సేల్స్ కౌంటర్ల ద్వారా హలీవ్‌ు అమ్మకాలను పిస్తా హౌస్ కొనసాగిస్తోంది. అంతేకాదు, హలీమ్ ఎగమతులకు కూడా పిస్తా హౌస్ పెట్టింది పేరు.

ఆన్ లైన్ అమ్మకాలు

ఆన్ లైన్ అమ్మకాలు

ప్రస్తుతం చాలా హోటళ్ళు ఆన్ లైన్ అమ్మకాలు కూడా నిర్వహిస్తున్నాయి. దాదాపు అరవై దేశాలకు హైదరాబాద్ హలీమ్ ఎగుమతి అవుతోంది. ఇంత ప్రఖ్యాతి పొందింది కాబట్టే జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ అంటే జి.ఐ. దీనికి కూడా లభించింది. భారతదేశానికి చెందిన వంటకాల్లో జి.ఐ పొందిన మొట్టమొదటి మాంసాహార వంటకం ఇది. ఎన్నో పోషకాలుండే హలీమ్ ను ఈ రంజాన్ మాసంలో ఒక్కసారైనా తినడం మాత్రం మరిచిపోకండి.

English summary

the history of hyderabad haleem how a bland iftar dish from yemen got indianised

the history of hyderabad haleem how a bland iftar dish from yemen got indianised
Story first published: Sunday, May 27, 2018, 10:00 [IST]