For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేపలను అమ్మి చదువుకునే ఆమెకు గోల్డ్ చైన్ , రింగ్స్ ఉంటాయా ? హనన్ ను రౌండప్ చేస్తే ఊరుకోం,

ఉదయం చేపలను కొనుక్కోవడం, వాటిని ఫ్రిజ్‌ లో పెట్టడం, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చేపలను చంపెక్కరా మార్కెట్‌ లో అమ్మడమే హనన్ పని. అలా రోజూ కాలేజీ అయిపోయాక సాయంత్రం చేపలు అమ్ముతూ ఉంటుంది ఈమె.

|

ఆమె ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు చేపలు అమ్ముకుంటూ బతికేది. ఆమె గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది. ఆమెనే హనన్ హమిద్. ఆమెది కేరళ. ఎర్నాకుళంకు చెందిన ఈమె బీఎస్సీ చేస్తోంది. హనన్‌ తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే విడిపోయారు. ఆమె నాన్న మద్యానికి బానిసయ్యాడు. ఇక ఆమె తల్లి మానసిక పరిస్థితి అంతగా బాగోలేదు. దీంతో చిన్నతనం నుంచే హనన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

ఎకనామికల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హయ్యర్ స్టడీస్ చదవాలన్నది హనన్ కోరిక. దీంతో ఆమె చేపలు అమ్మడం మొదలుపెట్టింది. ఆ డబ్బును ఆమె తన చదువుకు ఉపయోగించుకునేది. ఒకరిపై ఆధారపడకుండా స్వతహాగా బతికేందుకు ఆమె ఇలా చేయడం మొదలుపెట్టింది.

చేపలను అమ్మడమే హనన్ పని

చేపలను అమ్మడమే హనన్ పని

ఉదయం చేపలను కొనుక్కోవడం, వాటిని ఫ్రిజ్‌ లో పెట్టడం, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చేపలను చంపెక్కరా మార్కెట్‌ లో అమ్మడమే హనన్ పని. అలా రోజూ కాలేజీ అయిపోయాక సాయంత్రం చేపలు అమ్ముతూ ఉంటుంది ఈమె. అంతేకాదు హనన్ చాలా పనులు చేసింది. ప్రస్తుతం ఆమె బీఎస్సీ కెమిస్ట్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడు కోళలోని అల్ అజార్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈమె చదువుతోంది. వాస్తవానికి ఆమెకు ఎంబీబీఎస్ చదవాలని కల. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోయింది.

చదువును కొనసాగించేందుకు

అంతేకాదు ఈమె ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది. కొన్నాళ్లు ట్యూషన్స్ కూడా చెప్పింది. ఆదివారం పూట రేడియోలో కొన్ని కార్యక్రమాలు చేసేది. వీలున్నప్పుడల్లా జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసేది. దాంతో ఫిల్మ్ స్టార్స్ తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. అంతే కానీ ఆమె మాత్రం ఇప్పటికీ స్టార్ కాదు. కనీసం పూట గడవని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది హనన్. తన చదువును కొనసాగించేందుకు, తల్లికి ఆసరాగా నిలబడేందుకు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది హనన్.

అయ్యో పాపం అనుకున్నారు

ఈమె పడుతున్న కష్టాలపై ఇటీవల కేరళకు చెందిన మాతృభూమి అనే దిన పత్రిక ఒక మంచి కథనాన్ని ప్రచురించింది. దీంతో కేరళలో అందరికీ ఆమె గురించి తెలిసింది. అందరూ అయ్యో పాపం అనుకున్నారు. కొందరు ఆమెకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. అయితే కొందరు మాత్రం ఆమెకు వచ్చిన స్పందనను చూసి జీర్ణించుకోలేకపోయారు.

మరో రకంగా ప్రచారం

మరో రకంగా ప్రచారం

కొందరు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఆమెను వేధించడం మొదలుపెట్టారు. బతుకుదెరువు కోసం ఆమె చేసిన పనుల్ని మరో రకంగా ప్రచారం చేశారు. హానన్ ఫొటోలను, డబ్‌ స్మాష్‌ వీడియోలను రీ పోస్ట్ చేసి కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

బంగారు గొలుసులు, బంగారు ఉంగారం

బంగారు గొలుసులు, బంగారు ఉంగారం

హనన్ పేదరాలుకాదంటూ దుష్ప్రచారం చేశారు. హానన్ ఉంగరాలు పెట్టుకుని మురిసిపోతుందని అలాంటి ఆమెను పేదరాలు అంటారేంటీ అని కొందరు పోకిరీలు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేశారు. ఆమె పేదరాలు అయితే మెడలో బంగారు గొలుసులు, వేళ్లకు బంగారు ఉంగరం, మోడ్రన్ డ్రెస్ లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఆమె ఫొటోలను పోస్ట్ చేశారు. దీంతో హనన్ ఎంతో బాధపడింది.

బెదిరించారు

బెదిరించారు

కొందరు మత ఛాందస వాదులు ఆమెను సోషల్ మీడియాలో బెదిరించారు. పరదా ధరించడం లేదని ఆమెను భయపెట్టారు. దీంతో హానన్ బాధపడుతూ తన బతుకు తనను బతకనివ్వమని, తనకు ఎవ్వరి మద్దుతు వద్దని వాపోయింది.

కేంద్ర మంత్రి, కేరళ ముఖ్యమంత్రిల నుంచి మద్దతు

కేంద్ర మంత్రి, కేరళ ముఖ్యమంత్రిల నుంచి మద్దతు

అయితే హనన్‌కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్‌, కేరళ ముఖ్యమంత్రిల నుంచి మద్దతు లభించింది. అల్ఫోన్స్‌ ఈ విషయంపై ఒక పోస్ట్ చేశారు. హనన్‌ పై దాడి చేయడం ఇకనైనా ఆపండి. ఆపదలో ఉన్న అమ్మాయిని ఆదుకోవాల్సిందిపోయి అలాంటి కామెంట్స్ చేయడం దారుణమని మండిపడ్డారు.

ఇబ్బందులు రాకుండా చూడాలి

ఇబ్బందులు రాకుండా చూడాలి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హనన్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. ఒక విద్యార్థి తాను స్వతహాగా బతకడం ఎంతో గ్రేట్ అన్నారు సీఎం. జీవితంలో కష్టాలు అనుభవించిన వారికే ఆమె సమస్యలు అర్థం అవుతాయన్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లు కూడా హనన్ కు మద్దతు పలికారు. డైరెక్టర్ అరుణ్‌ గోపి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడు. అలాగే హనన్ ను రౌండప్ చేస్తే ఊరుకోమంటూ కొందరు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

English summary

the real story of hanan hamid how hanan became the target of trolls

the real story of hanan hamid how hanan became the target of trolls
Desktop Bottom Promotion