Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పబ్లిక్ లో వర్షంలో తడుస్తూ లిప్ టు లిప్ కిస్ పెట్టుకుని మైమరచిపోయిన జంట, ఫొటోగ్రాఫర్ జాబ్ ఊడింది
బంగ్లాదేశ్ లోని ఢాకా యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్ లో జరిగింది. ఇక అటుగా వెళ్తున్న ఒక దినపత్రిక ఫొటోగ్రాఫర్ ఆ చిత్రాన్ని కెమెరాలో బంధించాడు. తర్వాత దాన్ని తమ పత్రికలో పబ్లిష్ చేయాలనుకున్నాడు.
ప్రేమికులు అంటే లోకాన్ని మరిచి విహరిస్తుంటారని తెలుసు. అయితే అందరూ కూడా లిమిట్స్ లో ఉండి ప్రవర్తిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ప్రేమలో ఉన్నప్పుడు చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అందులో లీనమై ఉంటారు. వారి మధ్య గాలి కూడా దూరంతా స్థలం లేకుండా అల్లుకుపోయి ముచ్చటించుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు.
అయితే కొన్ని దేశాల్లో ఇది కామన్ అయిపోయింది. మనదేశంలో కూడా ఇలాంటివి పబ్లిక్ గానే జరుగుతున్నా అలాంటి విషయాలను అంతగా పట్టించుకోవడం లేదు. అయితే బంగ్లాదేశ్ లో పబ్లిక్ గా ప్రేమ జంట రొమాన్స్ చేసుకుంటే మాత్రం అక్కడ కాస్త వింతగానే చూస్తారు.

అందరూ చూస్తుండగానే లిప్ టు లిప్ కిస్
చల్లని సాయంత్రాన వర్షపు చినుకులు పడుతుంటే ఏ ప్రేమజంట అయినా కూడా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటుంది... బైక్ పై అలా రివ్వుమని తిరగాలనుకుంటుంది. అయితే వారిద్దరూ మాత్రం పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే లిప్ టు లిప్ కిస్ పెట్టుకుని ఆనందించారు. తమను అందరూ గమనిస్తున్నారనే విషయాన్ని కూడా వారు మరిచిపోయి రొమాన్స్ లో తేలిపోయారు.
ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు
ఇదంతా బంగ్లాదేశ్ లోని ఢాకా యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్ లో జరిగింది. ఇక అటుగా వెళ్తున్న ఒక దినపత్రిక ఫొటోగ్రాఫర్ ఆ చిత్రాన్ని కెమెరాలో బంధించాడు. తర్వాత దాన్ని తమ పత్రికలో పబ్లిష్ చేయాలనుకున్నాడు. కానీ అతని పత్రిక యాజమాన్యం అందుకు అంగీకరించకపోవడంతో ఆయన ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు.
ప్రపంచం నలుమూలల నుంచి లైక్స్
ఈ ఫొటో వెనుకున్న నేపథ్యం కూడా వివరించాడు. అంతే క్షణాల్లో ప్రపంచం నలుమూలల నుంచి ఆ ఫొటోకు లైక్స్, కామెంట్స్ వచ్చాయి. చాలా మంది షేర్ చేశారు. ఇక ఢాకా యూనివర్సిటీలో కనీసం అబ్బాయి, అమ్మాయి కలిసి కనిపించడమే గగనం. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ఇలాంటి ఆంక్షలు ఎన్నో ఉన్నాయి.
ముద్దులు పెట్టుకుంటూ మైమరిచి
అలాంటి వాతావరణంలో కూడా ఈ జంట అలా ముద్దులు పెట్టుకుంటూ మైమరిచి గడపడం నిజంగా గ్రేట్. ఈ ఫొటోను తీసిన వ్యక్తి పేరు జిబాన్ అహ్మద్. మొత్తానికి ఆయన తన ఇన్ స్టాగ్రామ్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చూపించాడు. అయితే పాపం ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందుకు, గతంలో కూడా ఇలాంటి వివాదస్పద ఫొటోలు తీసినందుకు ఆ ఫొటో గ్రాఫర్ జాబ్ ఊడింది. అలాగే ఆయనపై ఆయన కోలిగ్స్ మండిపడ్డారు. కొందరు కొట్టారు కూడా.



Click it and Unblock the Notifications