For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 12 ఆహారాలు !

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 12 ఆహారాలు !

|

ఆరోగ్య ప్రధానమైన వంటలను ప్రయోగాత్మకంగా తయారు చేసేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేసే సమయం ఎప్పుడో ముగిసింది. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఆహారాలు లభిస్తున్నాయి. కొంతమందికి వివిధ రకాల ఆహార పదార్ధాలతో ప్రయోగాలు చేయడం నేటికీ ఒక అభిరుచిగా ఉంది.

మీరు ఎక్కువగా తినడానికి మక్కువ చూపిస్తారా ! మీరు క్రొత్త ఆహారాలను తినటానికి ప్రయత్నించే ముందు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆ ఫుడ్ మీకు మంచిదో, కాదో అన్నది మీరు ముందుగా గుర్తించాలి. నేటి ప్రపంచంలో మీరు కనీసం 12 అత్యంత ప్రమాదకరమైన ఆహారాలను కనుగొనవచ్చు.

12 Most Dangerous Foods In The World

కొన్ని ఆహారాలు మన దృష్టిని ఆకర్షించేవిగా ఉంటాయి, కానీ అవి మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి కావచ్చు. వాటిలో కొన్ని మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తే, మరికొన్ని మిమ్మల్ని చంపవచ్చు కూడా. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆహార పదార్ధాల జాబితాలో అనేక ఆహారాలు ఉన్నాయి. కాబట్టి, ప్రత్యేకంగా ఇది మీ కోసం ఒక క్రొత్త రుచి గానీ అయితే, మీరు వీటిని తినే విషయంలో మరింత జాగ్రత్తలను తెలుసుకోవడం చాలా మంచిది ! ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆహార పదార్ధాల జాబితాలో శాకాహారము & మాంసాహారము రెండింటిని చేర్చబడ్డాయి.

మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టే ఆహారాల గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకొని, వాటికి పూర్తిగా నివారించాలి. ఇప్పుడు, మనము ప్రపంచంలో 12 అత్యంత ప్రమాదకరమైన ఆహార పదార్థాల గురించి మాట్లాడుకోబోతున్నాము.

పచ్చి జీడిపప్పు :-

పచ్చి జీడిపప్పు :-

ప్రపంచంలో 12 అత్యంత ప్రమాదకరమైన ఆహార పదార్థాలలో పచ్చి జీడిపప్పు ఒకటి. కొన్ని అధ్యయనాలు ప్రకారం, ఈ పచ్చి జీడిపప్పు మీ చర్మంపై అలెర్జీలు కలుగజేయగలదు & కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు.

అడవి పుట్టగొడుగులు :-

అడవి పుట్టగొడుగులు :-

అడవి పుట్టగొడుగులు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారం. అడవి పుట్టగొడుగులలో మీరు చిన్నముక్క తిన్నా అది వాంతికి కారణమవుతుంది, దీనిని పెద్ద మొత్తంలో తీసుకున్నట్లయితే మీకు మరణం కూడా సంభవించవచ్చు.

పఫ్ఫర్ ఫిష్ :-

పఫ్ఫర్ ఫిష్ :-

పఫ్ఫర్ ఫిష్ను, ఫ్యూగు అని కూడా పిలుస్తారు. మీరు ఈ చేపను సరిగ్గా వండకపోతే అది సైనైడ్ కన్నా ఎక్కువ విషపూరితంగా ఉంటుంది. కాబట్టి, ఇది ప్రపంచంలో 12 అత్యంత ప్రమాదకరమైన ఆహారాలలో ఒకటి.

కర-పెండలం :-

కర-పెండలం :-

మీరు పచ్చిగా ఉన్న ఈ కర-పెండలం దుంపను తినడం వల్ల దానిలో ఉండే ఎంజైమ్ సైనైడ్గా మార్చబడుతుందని కనుగొనబడింది. కాబట్టి ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించే మరో ఆహారంగా చెప్పవచ్చు.

వేరుశెనగలు :-

వేరుశెనగలు :-

చాలామందికి అలెర్జీని కలుగచేసే ఆహార పదార్థాలలో ఇది ఒకటి. మీరు ఎక్కువ మొత్తంలో వేరుశెనగలను తీసుకోవడం వలన అలెర్జీ సంభవించడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీనిని ఎక్కువగా సిఫారసు చేయరు.

రబర్బ్ :-

రబర్బ్ :-

రబర్బ్ ఆకులు విషపూరితమైనవి, ముఖ్యంగా, మీరు దాని కాండాలను వాడకాన్ని నివారించాలి. వాటి ఆకులలో ఉండే విష పదార్థాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, అవి మిమ్మల్ని చంపవచ్చు కూడా.

మొలకలు వచ్చిన చిక్కుడు :-

మొలకలు వచ్చిన చిక్కుడు :-

జర్మనీలో జరిగిన ఒక సంఘటన ద్వారా మొలకలు గల బీన్స్లో "ఇ కోలి" యొక్క వ్యాప్తికి కారణమవుతాయని కనుగొనబడింది, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. ఆ ఘటనలో "ఇ కోలి" చాలామందిని చంపింది, అలాగే చాలామంది జబ్బు పడేలా చేసింది.

షెల్-ఫిష్ :-

షెల్-ఫిష్ :-

షెల్-ఫిష్ను తినడం వల్ల ఎవరికైతే అలర్జీ వస్తుందో అటువంటి వారికి ఇది చాలా ప్రమాదకరమైనది. మీరు షెల్-ఫిష్ కారణంగా అలెర్జీ గురయినట్లయితే అది దురదకు, పొత్తికడుపు నొప్పికి దారితీస్తుంది. అలాగే అది మీ జీవితానికి ముప్పుగా ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి.

ఎల్డర్-బెర్రీస్ :-

ఎల్డర్-బెర్రీస్ :-

వీటి ఆకులు, కొమ్మలు, విత్తనాలు మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకారిగా ఉన్నందువలన వాటిని మీరు నివారించాలి. మీరు వీటిని పచ్చిగా తినడాన్ని కూడా నివారించడం చాలా మంచిది.

అఖీ :-

అఖీ :-

అఖీ, జమైకాలో లభించే ఈ పండు చాలా ప్రమాదకరమైన ఆహారం. దీనిని విత్తనాలు లేకుండా మాత్రమే తీసుకోవాలి. దాని విత్తనాలలో ఉన్న విషాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

పచ్చి పాలు :-

పచ్చి పాలు :-

మార్కెట్లో అందుబాటులో ఉన్న పాశ్చరైజ్డ్ పాలు మనకు ఏమాత్రం ప్రమాదకరం కాదు, కానీ కొంతమంది వ్యక్తులు పచ్చి పాలను వాడటం చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఈ పచ్చిపాలలో "ఇ కోలి" అనే ప్రమాదకరమైన సమ్మేళనం దాగి ఉంది.

 స్టార్ ఫ్రూట్:

స్టార్ ఫ్రూట్:

మీరు కిడ్నీ సమస్యలను కలిగి ఉంటే ఈ స్టార్ ఫ్రూట్ మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది మీ మెదడు & నాడీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే న్యూరోటాక్సిన్లను కలిగి ఉంటుంది.

English summary

12 Most Dangerous Foods In The World | Dangerous Foods Around The World | Foods That Are Dangerous | Dangerous Foods

Take a look at the most dangerous foods in the world. Read the article to know which are the most dangerous foods in the world.
Desktop Bottom Promotion