For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానం కలిగేలా చేసే శక్తి ఇంటి వాస్తుపై ఆధారపడి ఉంటుంది, వాస్తు ప్రకారం ఇళ్లు కడితే తరగని సిరులుమీవే

|

సంతానానికి మీ ఇంటితో ముడి పడి ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. చాలా జంటలు సంతాన లేమితో బాధపడుతుంటాయి. ఇలాంటి వారికి ఇంటిలోని వాస్తు దోషం వల్లే సంతాన భాగ్యం లేదనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇదే విషయంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. కింది విధంగా చెపుతున్నారు.

ఈశాన్యం జననానికి..

ఈశాన్యం జననానికి..

"ఈశాన్యం జననానికి, నైరుతి మరణానికి సంకేతాలు" అనేవి వాస్తులో శాస్త్రవేత్తలు చెప్పుకునే సామెతలు. ఈశాన్యంలో లోపం ఉన్నప్పుడు పుత్ర సంతానం లేకపోవడం, ఉన్నా దూరం కావడం జరుగుతుందంటారు. అలాగే ఈశాన్యం మూతపడి ఉండటం ఇంటికి ఈశాన్యం తెగిపడి ఉండటం, నైరుతిలో బావి ఉండటం, ఇలాంటి కారణాలు వంశ అభివృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుంటాయి.

మంచి వాస్తున్న ఇంటిలోకి వెళితే

మంచి వాస్తున్న ఇంటిలోకి వెళితే

అలాంటి గృహంలోని సభ్యులు మంచి వాస్తున్న ఇంటిలోకి వెళితే సంతానం కలుగుతుందా అనే సందేహం కలుగుతుంది. నిజమే సంతానం కలిగే అవకాశం ఉంది. ఐతే, ఈశాన్యలోపం ఉన్న గృహంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న దానిపై వారి ఆరోగ్య క్షీణతలో వచ్చిన మార్పులపై కొత్త ఇంటి ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశముంటుందని చెపుతున్నారు.

వీర్యశక్తిని కూడా పునరుద్ధరింపజేస్తాయి

వీర్యశక్తిని కూడా పునరుద్ధరింపజేస్తాయి

ఒక ప్రదేశం మనిషి భావాలను, ఆవేశాలను నియంత్రించినట్టుగా ఈశాన్య, నైరుతి దిశలు సక్రమమైనప్పుడు పురుష వీర్యశక్తిని కూడా పునరుద్ధరింపజేస్తాయి. ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే కొత్త ఇల్లు తూర్పు, ఈశాన్య సింహద్వారమై ఉండవలసిన అవసరముంది.

మంచి ఫలితాలు వస్తాయి

మంచి ఫలితాలు వస్తాయి

దక్షిణ, పశ్చిమాలలో ఇళ్లు ఉండి ఈశాన్యం బ్లాక్ అయిన వాస్తు ఇంటిలోకి చేరితే ఆ ఇంటి దిశల డిగ్రీ నూరు శాతం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఇంట్లో చిన్న పిల్లల బొమ్మలను పడకగదిలో పెట్టుకుని తూర్పు వైపు తలపెట్టి ఆలుమగలు నిద్రించాలి. ఆత్మ సంకల్పం, దిశ ప్రభావం ద్వారా ఆలస్యంగానైన సంతానం చక్కగా కలుగుతుందని నిపుణులు చెపుతారు.

మగ అయినా ఆడ అయినా

మగ అయినా ఆడ అయినా

ఇక వాస్తు ఇంటిలో నివసించే అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్క యజమానికో లేదా యజమానురాలుకో సంబంధించిన విషయం కాదు. వారి సంతానం మగ అయినా ఆడ అయినా వాస్తు ప్రభావం వారిపైన కూడా ఉంటుంది. ఈ ప్రభావం ఏ సందర్భంలో ఎలా ఎవరిపై పనిచేస్తుందన్నది ఆ ఇంటిని బట్టి వివరించాలి.

గోడ మందాలు తగ్గించి

గోడ మందాలు తగ్గించి

ఇంటిలో గోడలు వెడల్పులు తగ్గించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువాని వుంచటానికి నైరుతిమూల గోడమందం తగ్గించకూడదు. దీనివలన నైరుతిమూల పెరిగినట్లవుతుంది. అలాగే తూర్పు ఆగ్నేయం గోడ మందం తగ్గించి అక్కడ వంట కోసం పొయ్యిని ఏర్పాటు చేయకూడదు. ఇలా గోడమందం కొన్నిచోట్ల తగ్గించడం వలన ఇంటి కొలతలతో తేడా వస్తుంది. అది మంచిది కాదు. గోడ మందాలు తగ్గించి అక్కడ అలమరలు ఏర్పాటు చేసుకోవచ్చు.

పోర్టికో కట్టుకోవచ్చు

పోర్టికో కట్టుకోవచ్చు

ఈశాన్యంలో పోర్టికో కట్టుకోవడం వల్ల ఈశాన్యమున అధిక బరువు అంటారు. కాని ఇలా అనటం సరికాదు. తూర్పు లేదా ఉత్తర ఈశాన్యమూలలో పోర్టికో కట్టుకోవచ్చు. స్థలం కన్నా రోడ్డు ఎత్తులో ఉండకూడదు. ఎప్పుడూ రోడ్డు కంటే ఇల్లు ఎత్తులో ఉండాలి. నైరుతిగది వైశాల్యం ఈశాన్యగది వైశాల్యమున కన్నా ఎక్కువగా వుండాలి. అనగా నైరుతి గది ఈశాన్యం గదికన్నా పెద్దదిగా వుండాలి.

ఆగ్నేయ బ్లాకు

ఆగ్నేయ బ్లాకు

మీ ఇంటి స్థలానికి తూర్పున, దక్షిణాన రోడ్లు కనుక వుంటే ఆ స్థలాన్ని ఆగ్నేయం మూల స్థలం లేదా ఆగ్నేయం బ్లాక్ అంటారు. ఈ బ్లాకుకు వాస్తు బలము లేదని అంటారు. ఆగ్నేయ బ్లాకు ఇతర బ్లాకుల వలె అభివృద్ధి చెందటం ఎక్కువగా ఉండదు. అయితే ఈ బ్లాకులో కూడా శాస్త్ర ప్రకారం గృహం కడితే బాగా రాణిస్తుంది.

తూర్పు వైపున కాంపౌండ్ వాల్

తూర్పు వైపున కాంపౌండ్ వాల్

ఆగ్నేయ స్థలానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇటువంటి స్థలానికి తూర్పులో రోడ్డు రూపంలో ఖాళీ ఉండటంతో సహజసిద్ధమైన వాస్తు ఈ స్థలానికి ఏర్పడుతుంది. మామూలుగా తూర్పు వైపున కాంపౌండ్ వాల్ మినహా వాస్తు కోసం చాలా మంది ఏమీ కట్టరు. కనుక ఆ ప్రదేశం ఎప్పటికీ ఖాళీగా వుండిపోతుంది. ఇలా వుండటం చాలా మంచిది.

శుభ శూచకం కానే కాదు

శుభ శూచకం కానే కాదు

ఇక మైనస్ ఏంటంటే దక్షిణంలో రోడ్డు మూలంగా ఖాళీ స్థలం వుండటం వాస్తు ప్రకారం మంచిది కాదు.

తూర్పులో రోడ్డు రావటం వలన ఖాళీ ప్రదేశం, పడమర దిశగా ఇళ్లు రావటం వలన ఆ ప్రాంతంలో బరువు ఏర్పడటం మంచిదే. కానీ.. దక్షిణాన రోడ్డు రూపంగా ఖాళీ రావటం, ఉత్తర దిశగా ఇళ్లు వుండటం, వాటి వలన దిశా బరువు పెరగటం శుభ శూచకం కానే కాదు. దీని వల్ల కేవలం కీర్తిప్రతిష్టలు మాత్రమే వుంటుంటాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. డబ్బు విపరీతంగా ఖర్చయపోతుంటుంది. రూపాయి కూడా సంపాదించేందుకు ఆదాయ వనరులు దొరకవు. స్నేహితులను నమ్మి ఇచ్చిన హామీల వల్ల, స్యూరిటీల వల్ల జీవితం చాలా చికాకులమయంగా మారిపోతుంది.

గర్భవతులుగా మారే ప్రమాదం వుంది

గర్భవతులుగా మారే ప్రమాదం వుంది

బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు నిల్వలు తగ్గిపోతాయి. ఇంట్లో ఇల్లాలికి, యజమానికి రోజూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో ఆడపిల్లలు ఇంటాబయట ఆందోళనలకు గురవుతుంటారు. ప్రేమవ్యవహారాలతో పాటు గర్భవతులుగా మారే ప్రమాదం వుంది. చిన్న చిన్నగొడవలు కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తాయి. ఇంటి బాధలు తట్టుకోలేక ఇంటి యజమాని, మగ సంతానం తాగుడు, క్లబ్‌లకు అలవాటు పడతారు. దుబారా ఖర్చులు ఎక్కువై పోతాయ. పిల్లల మీద కంట్రోల్ పోతుంది. ఇలా రకరకాలైన వాస్తు సమస్యలను అనుభవించాల్సి వుంటుంది.

దక్షిణంవైపున బాగా ఎత్తుగా పెరిగే చెట్లు

దక్షిణంవైపున బాగా ఎత్తుగా పెరిగే చెట్లు

ఇల్లు కట్టేటప్పుడే దక్షిణంవైపు కనీసం రెండడుగుల వెడల్పుతో బరువైన కాంపౌండ్‌వాల్‌ను, స్ట్రాంగ్ బేస్‌మెంట్ తో దిట్టంగా వుండే అరుగులను కట్టించండి. దక్షిణంవైపున బాగా ఎత్తుగా పెరిగే కొబ్బరిచెట్లు, రావి, వేప చెట్లను వాస్తుకోసం పెంచండి. దక్షిణ భాగాన్ని లేదా ఆ దిశగా కట్టుకున్న ఇంటి పోర్షన్‌ను బాగా ఎత్తుగా మట్టితో కాకుండా, బలమైన గ్రైనేట్ రాళ్లతో మెరక చేయండి. ఫలితం బాగుంటుంది.

డ్రైనేజీ గోతులను దక్షిణంలోకి అస్సలు రానీయకండి

డ్రైనేజీ గోతులను దక్షిణంలోకి అస్సలు రానీయకండి

ఇంటి పోర్టికో దక్షిణానికి డౌన్ చేయకుండా వుంటే మంచిది. ఆ ప్రాంతంలో వరండా లాంటిది ప్లాన్ చేసుకోండి మంచి జరుగుతుంది. మీకు ఉత్తర దిశగా కనుక రోడ్డు లాంటిది వుంటే, అది మీ ఇంటికి దక్షిణాన వున్న రోడ్డుకంటే కనీసం ఐదారు అడుగుల ఎక్కువ ఖాళీ వుండేలా జాగ్రత్త పడండి. ఉత్తర ఈశాన్యంలో బావికాని, బోర్‌వెల్ కాని వుండేలా వాస్తు జాగ్రత్త తీసుకోండి. ఇంటికి సంబంధించిన డ్రైనేజీ గోతులను దక్షిణంలోకి అస్సలు రానీయకండి.

ఈశాన్యంలో నుయ్యి తవ్వి

ఈశాన్యంలో నుయ్యి తవ్వి

దక్షిణం రోడ్డు ఏ మూలను పెంచకుండా తూర్పు రోడ్డు ఏ మూలను పెంచకుండా, తూర్పు రోడ్డు ఈశాన్యం పెంపుతో నడక సాగిన స్థలంలో ఎటువంటి ఆగ్నేయ దోషాలు లేకుండా, ఉత్తర ఈశాన్యం నడక వచ్చునట్లు ద్వారాలు ఏర్పాటు చేసుకొని, ఈశాన్యంలో నుయ్యి తవ్వి, స్థలానికి దక్షిణ పశ్చిమాలు మిర్రుగాను, తూర్పు ఉత్తరాలు పల్లంగాను వుండునట్టు ఏర్పాటు చేసుకొని నిర్మించు గృహము తూర్పు వీథి గల గృహముకు తీసిపోకుండా ఇచ్చును.

దక్షిణం వైపు రోడ్డుకు గేటును వుంచకూడదు

దక్షిణం వైపు రోడ్డుకు గేటును వుంచకూడదు

ఆగ్నేయ స్థలంలో గృహమునకు, దక్షిణం వైపు ద్వారాలు వుంచకూడదు. దక్షిణం వైపు రోడ్డుకు గేటును వుంచకూడదు. ఈ స్థలానికి తూర్పు రోడ్డుకు ప్రధాన ద్వారామును ఏర్పాటు చేయాలి. తూర్పు ఆగ్నేయము పెరుగుట వలన మగ సంతతి లేకపోవటమో, అసలు సంతతే లేకపోవటమో జరుగును.

దక్షిణ ఆగ్నేయం పెంపువలన స్త్రీలు అనారోగ్యవంతులగుట, అల్లుళ్ళతో తగాదాలు రావటం జరుగును.

సంతతి దురలవాట్లకు లోనై

సంతతి దురలవాట్లకు లోనై

దక్షిణ ఆగ్నేయం తగ్గుట వల్ల, ఆ ఇంట సంతతి దురలవాట్లకు లోనై, దుర్మరణము, హఠాన్మరణము, హత్య, ఆత్మహత్యలకు పాల్పడతారు. ఆగ్నేయం తూర్పుగా గాని, దక్షిణంగా గాని పెరగకూడదు. ఆగ్నేయం, వాయవ్య ఈశాన్యాల కన్నా మిర్రుగా వుండి నైరుతి కన్నా పల్లంగా వున్న మంచి ఫలితాలను ఇచ్చును. తూర్పు ఆగ్నేయపు వీధిపోటు కలిగి, దక్షణ నైరుతి పెరిగిన, అందు గల సంతతి పుట్టి మరణించడం లేదా దురలవాట్లు కలిగియుండుట జరుగును.

మగ సంతతిపైన దుష్ర్పభావము

మగ సంతతిపైన దుష్ర్పభావము

తూర్పు ఆగ్నేయపు వీధిపోటు, మగ సంతతిపైన, ఇంటి యజమానురాలిపైన దుష్ప్ర భావము చూపును.ఆగ్నేయం పల్లంగా వున్నా, అందు బావి వున్నా ఇద్దరు భార్యలుండుట, భార్యావియోగం వలన గాని, సంతానం లేదని గాని రెండో వివాహం చేసుకోనుట జరుగును. ఆగ్నేయపు నడక గాని, ఇతర ఆగ్నేయదోషాలున్న ఆ ఇంట రెండవకుమారుడి గురించి వివరించాల్సి వుండును. యజయానురాలిపై కూడా పై దోషాలు పనిచేస్తాయి.

ఆగ్నేయము పల్లంగా

ఆగ్నేయము పల్లంగా

ఆగ్నేయపు మూతపడి దక్షిణ ఆగ్నేయం పెరిగిన, పెళ్ళిళ్ళ అనంతరం ఆ ఇంటి కూతుళ్ళు ఏదో ఒక కారణంతో పుట్టింటికి చేరుకొందురు. తూర్పు ఆగ్నేయం పెరిగి ఆగ్నేయ దోషాలున్న పెళ్ళి అనంతరం కూడా ఉదో ఒక కూతురి పోషణభారం వహించాల్సి వుండును. ఆగ్నేయము పల్లంగా గాని, నూతులుండటం గాని ఇతర ఆగ్నేయ దోషాలున్న ఆ ఇంట చోర, అగ్ని భయలుండి, కోర్టు తగాదాలు, జైలుశిక్షలు అనుభవించుట, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుట జరుగును.

తూర్పు ఈశాన్యం గుండా పంపాలి

తూర్పు ఈశాన్యం గుండా పంపాలి

దక్షిణ ఆగ్నేయ వీధిపోటు వున్నచో ఆర్ధికపుష్టి కలిగి యుందురు. ఇందుకు తోడుగా గృహముకూడా వాస్తు సమ్మతంగా వుండిన మరింత యోగించును.

ఆగ్నేయ భాగం నుంచి వాడకం నీరు బయటకు పోకుండా తూర్పు ఈశాన్యం గుండా పంపాలి.ఆగ్నేయ బ్లాకు స్థలానికి మరుగుదొడ్లు, మరుగుదొడ్డి గుంటలు వాయవ్య భాగంలో శాస్ర్తబద్దంగా ఏర్పాటు చేసుకోవాలి. నుయ్యిని ఉత్తర ఈశాన్యం గుండా పంపాలి.ఆగ్నేయ భాగం మిర్రుగా వుండి మిగిలిన భాగాలు పల్లంగా వుండిన వంశక్షయము కలుగుట, పిచ్చివారు వుండుట జరుగును.

తూర్పు వీధి కన్నా పల్లంగా వుండకూడదు

తూర్పు వీధి కన్నా పల్లంగా వుండకూడదు

ఆగ్నేయంలో వంట గది పూర్తిగా శాస్ర్త సమ్మతం.

ఆగ్నేయ స్థలం తూర్పు వీధి కన్నా పల్లంగా వుండకూడదు.

ఆగ్నేయ దోషాలున్నా ఇంటి యజమానికి అన్య స్ర్తీ సంబంధాలు ఉంటాయి. అరుగులు తూర్పువైపున గృహము ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తగ్గులోను, దక్షిణం వైపు గృహము ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఎత్తుగాను వుండాలి. గృహన్ని ఈశాన్యం హద్దు చేసి నిర్మించిన, అందు సంతతి లేకుండుట, వున్నా నిష్ర్పయోజకులై ఆ గృహము స్ర్తీ ధనంగా మారిపోవును.

తూర్పువీధిలో ఈశాన్యం బ్లాకు ఈశాన్యం తగ్గటం వల్ల కొన్ని చోట్ల వాస్తు దోషాలున్నా ఆగ్నేయం బ్లాకు ఆర్థికంగా బాగుండునే గాని ఇతర దోషాలు అనుభంవించక తప్పదు.

తరగని సిరులు గలవారైపోతారు

తరగని సిరులు గలవారైపోతారు

ఆగ్నేయపు బ్లాకుకు ఉత్తర ఈశాన్యం వీధిపోటు వుంటే తరగని సిరులు గలవారై యుండి, ధనమును ఖర్చు పెట్టక లోభులై యుందురు. తూర్పునకు వాలు వసారా (వరండా) వుండాలే గాని దక్షిణంవైపు వరండా వుండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. నైరుతిలో యజమాని పడక గది, వాయువ్యంలో యజమాని సంతానం గది ఉండాలి. వీలైతే నైరుతిలోని వంటగదిని ఆగ్నేయంలోకి మార్చుకోవాలి. ఆగ్నేయంలోని పడక గదిని నైరుతిలోకి మార్చుకోవాలి. అలా వీలుకాకపోతే నైరుతి, ఆగ్నేయ భాగాలకు సంబంధించిన అధిపతుల యంత్రాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.

English summary

vastu defects and their harmful effects

vastu defects and their harmful effects
Story first published: Tuesday, June 12, 2018, 11:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more