Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అమ్మలు పక్కన లేకుంటే నాన్నలేం చేస్తారో తెల్సా?
అమ్మలు పక్కన లేకుంటే నాన్నలేం చేస్తారో తెల్సా?
పిల్లలను నిర్వహించడం అనేది అంత సులభమైన విషయం కాదు, అందులో జోక్ ఏమాత్రం లేదు. ప్రత్యేకంగా తల్లి దూరంగా ఉన్న సమయాల్లో పిల్లలను నిర్వహించే బాధ్యతలను నాన్నలు స్వీకరిస్తుంటారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ, వీరికి కాస్త కష్టతరమైన అంశమే ఇది. క్రమంగా వారిని వేగలేక పిల్లలతో కసరత్తులు చేస్తుంటారు.
ఇక్కడ పొందుపరచబడిన వీడియోలో, ఇద్దరి పిల్లల ఈ తండ్రి రెండాకులు ఎక్కువే చదివినట్టు ఉన్నాడు. తన పిల్లలను నిర్వహించడంలో నేనేమీ తక్కువ కాదంటూ నిరూపించే ప్రయత్నం చేస్తున్నట్లుంది. వారి మామ్ దగ్గర లేనప్పుడు, తండ్రి పిల్లలతో పాటు డ్యాన్స్ చేయడం వంటివి అత్యంత వినోదభరితంగా కనిపిస్తుంది.
ఈ వీడియోలో అతను "సంవత్సరపు ఉత్తమ తండ్రి" అవార్డు తీసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లల తల్లి అయిన రుజీనా తన గదిలో ఒక కెమెరాను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. క్రమంగా వారి గురించిన వీడియోలను, పిల్లల యొక్క అమ్మమ్మకు చూపాలని ఆలోచన. అయితే వాళ్ళ అమ్మమ్మ సర్ప్రైజ్ సంగతేమో కానీ, వీడియో చూసిన తల్లి మాత్రం సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. తాను లేని సమయంలో పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన భర్తను చూస్కుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైంది. ఈ వీడియో చూడండి... ఈ ముఖంలో కూడా నవ్వులు పూయక మానవు.
టీవీలో వస్తున్న కరౌకే ప్రోగ్రాంలో వస్తున్నపాటకు పాప డాన్స్ చేస్తుండగా, ఉయ్యాలలోని బిడ్డ కూడా చిందులేస్తూ కనిపిస్తున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన వీళ్ళ తండ్రి కూడా పాపతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మరో పక్క పనులు చేస్కుంటూ కనిపిస్తున్నాడు.

ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లల తండ్రి ఒక బుట్టలో బట్టలు వేసుకుని లాండ్రీ పనికి ఉపక్రమిస్తూ, మద్యలో వాటిని పక్కన పెట్టి పిల్లలతో కాసేపు రాబోట్ డాన్స్ తో చిందులేసి మరలా పనికి ఉపక్రమించడం జరుగుతుంది. తనకు ఎన్ని పనులు ఉన్నా, పిల్లలు మనసులోనే ఉన్నారు అని చెప్పకనే చెప్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియోలోని తండ్రి, అనేకమందికి ఆదర్శంగా కనిపిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. తండ్రిని చూడగానే ఆ పాప తండ్రివైపుకి తిరిగి కలిసి డాన్స్ చేయడం చూస్తుంటే, వారి మద్య ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది.
తల్లి అందుబాటులోలేని పక్షంలో, తాను అందుబాటులో ఉన్నా కూడా, క్రెచ్ లలో పిల్లలను ఉంచడం, ఆయాలను నియమించడం వంటివి చేసే తండ్రులే కాకుండా, తానే అమ్మగా మారి పిల్లలను చూసుకుంటున్న తండ్రులందరికీ ఈ వీడియో అంకితమివ్వాల్సిందే. ఎవరంటే ఇష్టం అని అడిగితే అమ్మ అని టక్ మని సమాధానం చెప్పే పిల్లలనే చూస్తుంటాం. కానీ పురిటి నొప్పులు తప్ప మిగిలిన అన్ని నొప్పులను తల్లితో సమానంగా భరిస్తూ, మన సంతోషాల కోసం, భవిష్యత్ కోసం ప్రాకులాడే నిస్వార్ధ ప్రేమికుడు నాన్న.
ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications