Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బోరుబావిలోకి తలకిందులుగా దూరి ఇతను చేసిన సాహసాన్ని చూస్తే వావ్ అనాల్సిందే! ఏం గట్స్ రా బాబూ
అంతలోనే ఒక హీరో వచ్చాడు. చూడడానికి పొట్టిగా ఉన్నా గట్స్ మాత్రం అదుర్స్. బోరు బావి గుంతలో మేక పిల్ల ఎంత లోతులో ఉందో పరిశీలించాడు. అరే.. భాయ్ నన్ను గట్టిగా పట్టుకోండి.. నా తల మొదట గుంతలో పెడతాను.
కొన్ని రోజుల క్రితం థాయ్‌లాండ్ లో గుహలో పన్నెండు మంది పిల్లలు, కోచ్ చిక్కుకుపోవడంతో అందరూ వారి గురించే ఆలోచించారు. వారు క్షేమంగా బయటకు రావాలని కోరుకున్నారు. అయితే కొందరు చిన్నారులు బోరుబావి గుంతల్లో పడిపోతుంటారు. వారిని రెస్క్యూ టీమ్ లు ఎంతో కష్టపడి రక్షించాలని ఒక్కోసారి ప్రయత్నించినా ఫలితం ఉండదు. బోరుబావి చుట్టూ గుంతలు తవ్వి ఎంత శ్రమించినా కూడా ఒక్కోసారి చిన్నారుల ప్రాణాలను రక్షించలేరు. అసలు బోరు బావి గుంతలను పూడ్చకుండా ఉండడం వల్లే చిన్నారులు ప్రాణాలు కోల్పొతారు.
మేకపిల్ల పడిపోయింది
అయితే కర్నాటకలో కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన చోటుచేసుకుంది. ఒక బోరు బావి గుంతలో చిన్నపాటి మేకపిల్ల పడిపోయింది. దాన్ని ఎలా బయటకు తీయాలని అందరూ ఆలోచిస్తూఉన్నారు.

పెద్ద లోతుకు పోకపోవడంతో
బోరుబావి గుంత చుట్టూ చేరి అందులోకి తొంగిచూస్తూ మేకపిల్ల ఎంత లోతు లోపల ఉందో పరిశీలించారు. మేక పిల్ల పెద్ద లోతుకు పోకపోవడంతో దాన్ని తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఎవ్వరికీ ఆ మేకపిల్లను ఎలా తియ్యాలో అర్థం కాలేదు. ఇక కొందరైతే దాన్ని తియ్యడం కష్టం వదిలేద్దామన్నారు.

పొట్టిగా ఉన్నా గట్స్ మాత్రం అదుర్స్
అంతలోనే ఒక హీరో వచ్చాడు. చూడడానికి పొట్టిగా ఉన్నా గట్స్ మాత్రం అదుర్స్. బోరు బావి గుంతలో మేక పిల్ల ఎంత లోతులో ఉందో పరిశీలించాడు. అరే.. భాయ్ నన్ను గట్టిగా పట్టుకోండి.. నా తల మొదట గుంతలో పెడతాను. తర్వాత నా కాళ్లను గట్టిగా పట్టుకుని నన్ను అందులో జారవిడచండి కచ్చితంగా నేను మేకపిల్లను బయటకు తీసుకొస్తాను అన్నాను.

గుంతలోకి తల పెట్టాడు
మేకపిల్ల కోసం అంత ధైర్యం చెయ్యొద్దులే అంటే అతను వినలేదు. వెంటనే గుంతలోకి తల పెట్టాడు. తర్వాత అతన్ని చిన్నగా జారవిడిచారు. అంతే క్షణాల్లో మేకపిల్ల చెవిని పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. చుట్టు పక్కనున్న వాళ్లు మొత్తం ఆశ్చర్యపోయారు. ఎవడ్రా వీడు.. నిజంగా మగాడే అనుకున్నారు.
మోహన్ దాస్ మీనన్
ఇక ఈ వీడియోను మోహన్ దాస్ మీనన్ అనే ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దానికి కొన్ని వేల లైక్స్, వ్యూస్ వచ్చాయి. చాలా మంది అతని డేర్ ను పొగుడుతూ కామెంట్స్ చేశారు. అయితే కర్ణాటకలో ఇది ఒక రూరల్ ఏరియాలో జరిగినట్లు తెలుస్తుంది కానీ ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు.



Click it and Unblock the Notifications