For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె అందుకోసం ఏకంగా కుక్క మూత్రాన్నే తాగింది, క్యాన్సర్ కూడా నయం అవుతుందని అంటోంది

కుక్క మూత్రంలో ఉండే అవి అన్నీకూడా క్యాన్సర్ ని నయం చేస్తాయని ఆమె చెబుతోంది. అయితే, ఈమె చెప్పినవన్నీ నిజాలని ఏ అధ్యయనంలో కూడా వెల్లడికాలేదు. ఆమె అందుకోసం ఏకంగా కుక్క మూత్రాన్నే తాగింది.

|

ఆడవారు అంద సంరక్షణ కోసం ఏవేవో చేస్తుంటారు. ముఖంపై ఒక్క మొటిమ వస్తే దాన్ని పోగొట్టుకునేందుకు వంద రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే కొందరు మహిళలు ఒక అడుగు ముందుకేసి కొన్ని సాహసాలు చేస్తారు. ఎవరి నమ్మకాలు వారివి. దానికి మనం ఏమి చేయలేం. ఇలానే ఒక మహిళ చేసింది.

కుక్క మూత్రాన్ని తాగింది

తన చర్మ సంరక్షణలో భాగంగా ఆమె ఏకంగా కుక్క మూత్రాన్ని తాగింది. ముఖంపై ఎలాంటి మొటిమలు, గుల్లలు రాకుండా ఉండేందుకు కుక్క మూత్రం బాగా పని చేస్తుందని ఆమె అలా చేసింది. అంతేకాదు కుక్క మూత్రం తాగితే క్యాన్సర్ కూడా రాదని ఆమె నమ్మకం.

వీడియో సోషల్ మీడియాలో వైరల్

వీడియో సోషల్ మీడియాలో వైరల్

తన చర్మ సంరక్షణలో భాగంగా కుక్క మూత్రం తాగుతున్నానంటూ ఆమె ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఆమె చెబుతున్న ప్రకారం.. కుక్క మూత్రంలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందట. అలాగే ఒక కప్పు కుక్క మూత్రంలో 10 గ్రాముల కాల్షియం కూడా ఉంటుందట.

క్యాన్సర్ నయం

క్యాన్సర్ నయం

కుక్క మూత్రంలో ఉండే అవి అన్నీకూడా క్యాన్సర్ ని నయం చేస్తాయని ఆమె చెబుతోంది. అయితే, ఈమె చెప్పినవన్నీ నిజాలని ఏ అధ్యయనంలో కూడా వెల్లడికాలేదు. మెడిసిన్ కు సంబంధించి అంతగా నాలెడ్జ్ లేని రోజుల్లో చైనా, రోమ్, గ్రీస్ మరియు ఈజిప్ట్ లలో మూత్రథెరపీ నిర్వహించేవారు. అప్పుడు ఈ మూత్ర థెరపీలకు మంచి పేరు ఉండేది.

ఎవరూ నిర్ధారించలేదు

అయితే వైద్యుల ప్రకారం.. ఏ మూత్రం అయినా సరే వ్యర్థమే. బాడీలోని వ్యర్థాల సమూహమే మూత్రం. అలాంటి మూత్రాన్ని మళ్లీ బాడీలోకి పంపించడనేది చాలా తెలివితక్క వ్యవహారమని కొందరి వైద్యుల వాదన. అయినా కుక్క మూత్రాన్ని తాగితే ప్రయోజనాలుంటాయా లేదా అనేది మాత్రం ఇంత వరకు ఎవరూ నిర్దారించలేదు. ఒక మహిళ మాత్రం అలా చేసి ట్రెండింగ్ అవుతోంది. ఆమె అందులో ఏదో ఉందని నమ్మింది కాబట్టి అలా చేసింది. అందరూ అలా చేయాల్సిన అవసరం లేదు.

English summary

video shows woman drinking her dogs pee for clear her acne

Woman claims drinking her dogs URINE has helped clear her acne
Story first published:Thursday, August 2, 2018, 16:10 [IST]
Desktop Bottom Promotion