Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పదిహేను ఏళ్లకు పైగా చనిపోయిన భార్యతోనే పడుకుంటూ కాపురం చేస్తున్న భర్త
పెళ్లినాడు చేసిన బాసలు మరిచిపోయి భార్యను వేధించే భర్తలను మనం రోజూ చూస్తున్నాం. భార్యలను చంపి దర్జాగా తిరిగే వారిని కూడా చూస్తున్నాం. అయితే భార్య భర్తల బంధం ఎంతో పవిత్రమైనది. కొందరు భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగుతుంటాయి. అయితే చివరకు మాత్రం ఇద్దరూ ఒక్కటైపోతుంటారు. అలాంటి జంటలు చాలానే ఉంటాయి. కొందరు భార్యాభర్తల మధ్యను ఉన్న ప్రేమను మరణం కూడా విడదీయలేదేమో.

భార్య జ్ఞాపకాలతో
భార్యాభర్తల్లో ఎవరు మరణించినా మరొకరి జీవితం దుర్భరంగా మారుతుంది. చనిపోయిన వారి భర్త లేదా.. భార్య జ్ఞాపకాలతో ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. ఒక భర్త తన భార్య చనిపోయినా కూడా ఆమెతోనే సంత్సరాల తరబడి గడిపేస్తున్నాడు. భార్యను బతికినంతకాలం ప్రాణంగా ప్రేమించిన ఆయన.. ఆమె మరణం తరువాత కూడా ఆమె మృతదేహాన్ని పక్కనపెట్టుకుని జీవిస్తున్నాడు. ఆయన భార్యపై చూపిస్తున్న ప్రేమ అందరినీ అబ్బురపరుస్తోంది. మరికొందరైతే ఆయన ప్రేమ ఎంత గొప్పది.. అలాంటి భర్త ప్రేమను పొందిన భార్య ఎంత అదృష్టవంతురాలు అని కితాబునిస్తున్నారు.

లావన్ భార్య మరణించినా
వియత్నాంలో క్వాంగ్ నాం ప్రావిన్స్‌లో నివసించే లావన్ భార్య మరణించింది. ఆమె మృతదేహాన్ని సమాధి చేసి కుటుంబసభ్యులు ఆ బాధ నుంచి తేరుకున్నారు. లావన్ మాత్రం ఆమె ఎడబాటును భరించలేక కుంగిపోయాడు. ఆమెను తలచుకుంటూ ప్రతి రోజూ ఏడ్చేవాడు. భార్యను మరవలేని లావన్ మాత్రం రోజూ ఆమె సమాధి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. వాతావరణం అనుకూలించని సమయంలో అనారోగ్యానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో తన ఇంట్లో నుంచే శ్మశానానికి సొరంగాన్ని తవ్వాడు. అక్కడే పడుకునేవాడు. తన భార్యతో పాటు తాను మరణించలేక ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె సమాధి వద్ద సుమారు 20 నెలలు గడిపాడు.

అస్తికలను, మట్టిలో కలవకుండా
సమాధి వద్ద ఉన్నప్పుడు గాలి, వాన వస్తున్నాయని భావించి ఆ భర్త ఓ ఆలోచన చేశాడు. ఒక రోజు తన భార్య సమాధిని తవ్వి ఆమె అస్తికలను, మట్టిలో కలవకుండా, మిగిలిన శరీరభాగాన్ని బయటికి తీసి వాటిని కాగితం, మట్టిని ఉపయోగించి మనిషి రూపంలా తయారు చేశాడు. ఆ శరీరానికి ముఖంగా ఓ మాస్క్‌ను కూడా తగిలించాడు.
అంతటితో ఊరుకోలేదు. దానికి ఒక డ్రెస్ కూడా వేశాడు. ఆ శరీరాన్ని తన ఇంటిలో పెట్టుకొని దాని పక్కనే నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఇక ఆ తండ్రి పక్కనే కొడుకు కూడా కొన్ని సంవత్సరాలుగా నిద్రపోతున్నాడు. గతంలో ఈ విషయం సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొట్టింది.

మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు
ఇక లావన్ భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడని దాన్ని చూస్తూ ఆనందపడేవాడని విషయాన్ని పసిగట్టిన కొందరు మొదట భార్యపై అతడికి ఉన్న ప్రేమను అర్ధం చేసుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే ఇరుగుపొరుగు వారు మాత్రం అస్సలు ఊరుకోలేదు. సంప్రదాయానికి విరుద్ధంగా చేస్తున్నాడని.. ఏదైనా కీడు జరుగుతుందని భావించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు లావన్ ను ఒప్పించి మళ్లీ అతని భార్యకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇలాంటి భర్తలు ఉంటే
అయితే భార్య మృతదేహానికి అంత్యక్రియలు జరిపించినా, లావన్ ఇంట్లో మరో విగ్రహం రూపంలో అతని భార్య మృతదేహం ఉందని స్థానికులు నమ్ముతున్నారు. అతడికి భార్యపై ఉన్న ప్రేమను గుర్తించిన వారు మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి భర్తలు ఉంటే, రోజు నరకం అనుభవించే భార్యలు ఈ ప్రపంచంలో ఉండరేమో. మొత్తం మీద ఐదు సంవత్సరాల పాటు భార్య మృతదేహానికి సంబంధించిన అస్తికలతో తయారు చేసిన బొమ్మను పక్కను ఉంచుకుని పడుకున్నాడు లావన్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ కూడా ఆయన అదే భార్య బొమ్మ పక్కనే పడుకుంటున్నాడట. అంటే దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఆయన అలా పడుకుంటున్నాడని అర్థం అవుతోంది.

ఇప్పటికీ భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడట
కొసమెరుపు ఏంటంటే.. లావన్ భార్య శవాన్ని మరో విగ్రహం రూపంలో ఇంట్లోనే దాచాడట. అధికారుల ఎదుట ఆమె శవం లేని మరో విగ్రహానికి అంత్యక్రియలు జరిపించినట్లు స్ధానికులు అనుకుంటున్నారు. లావన్ కు భార్యపై ఉన్న ప్రేమను చూసి గౌరవించాలో.. అతని పిచ్చి ప్రేమ పరాకాష్టకు చేరిందని తిట్టుకోవాలో స్ధానికులకు ఇప్పటికీ అర్ధం కావట్లేదట.



Click it and Unblock the Notifications











