For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహన దారులను హెచ్చరించే క్రమంలో ట్రాఫిక్ పోలీసే యమ ధర్మ రాజులా కనిపిస్తే?

వాహన దారులను హెచ్చరించే క్రమంలో ట్రాఫిక్ పోలీసే యమ ధర్మ రాజులా కనిపిస్తే?

|

మన భద్రత కోసం నియమింపబడిన నియమాలను పాటించకూడదనే స్వతంత్ర నిర్ణయాలతో, హెచ్చరిస్తున్న వారిపట్ల తిరుగుబాటు ధోరణితో మొండిగా ఉంటున్నాం అన్నది జగమెరిగిన సత్యం.

హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ లేదా సీటు బెల్ట్ ధరించకుండా కారు నడపడం ఊహించని మరియు దారుణమైన ప్రమాదాలకు కారణం కావొచ్చు. జరుగుతుంది అని నొక్కి చెప్పడం లేదు. జరిగితే, తర్వాత ఏమిటి? అని మాత్రమే ఆలోచించమని హెచ్చరిస్తున్నాము.

రోడ్డు భద్రత నెలగా జులై నెలని నిర్వహించడంతో, డ్రైవింగ్ నియమాలు మరియు నిబంధనలను అనుసరించడానికి మరియు ఎక్కువమంది దృష్టిని ఆకర్షించడానికి ఒక ప్రత్యేక ప్రణాళికతో బెంగళూరు పోలీసులు ముందుకు వచ్చారు.

Traffic Police Use Yamaraj To Warn Motorists Against Violations

వాహన దారులను హెచ్చరించే క్రమంలో ట్రాఫిక్ పోలీసే యమ ధర్మ రాజులా కనిపిస్తే?

ట్రాఫిక్ పోలీసులు 'యమధర్మరాజు' ని తమ బ్రాండ్ అంబాసిడర్గా, ప్రకటిస్తూ యమధర్మరాజు వేషంలో హెల్మెట్ ధరించకుండా, నిర్లక్ష్యంగా మరియు ఇతర నియమాలను ఉల్లంఘించే వ్యక్తులకి అవగాహన కల్పించే క్రమంలో రోడ్లపై కనిపించారు.


ఇక్కడ పొందుపరచిన వీడియోలోని చిత్రాలని చూడండి :

బెంగళూరులోని టౌన్ హాల్ చుట్టుపక్కల ఉన్న 'ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు, యమధర్మరాజు వేషంలో, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే మీ ఇంటికి మేమొస్తాం అన్న నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు.

సాంప్రదాయక బంగారు దుస్తులలో యమ ధర్మ రాజు వలె దుస్తులు ధరించిన వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులకు ఒక ఆలోచన కలిగించేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ వినూత్న ఆలోచన పట్ల దేశమంతా హర్షం వ్యక్తం చేసింది.

అతను వాహనాలలో వెళ్తున్న కుటుంబాలని సందర్శించి జాగ్రత్తని హెచ్చరించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే మోటార్ సైకిళ్ల వెంటపడుతూ అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం అందరినీ ఆకర్షించింది.

ట్రాఫిక్ పోలీసుల ప్రకారం, అటువంటి అద్భుతమైన మరియు అవగాహన డ్రైవులు ప్రమాదాలు తగ్గించడానికి సహాయ పడుతాయి. ట్రాఫిక్ భద్రతా నియమాల ప్రాముఖ్యత గురించి పాదచారులు మరియు వాహనవాదుల మధ్య అవగాహన పెంచడం గురించి ఈ ప్రచారం ప్రత్యేకమైన దృష్టి సారించింది అని తెలిపారు.

ఇటువంటి కొత్త ప్రచారాలు మరియు వినూత్న ఆలోచనలతో అయినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ మరియు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారు పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాము.


ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవన శైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Traffic Police Use 'Yamaraj' To Warn Motorists Against Violations

A mace-wielding 'Yamraj,' who is the God of Death, is seen rounding around the Town Hall in Bengaluru where he warns them about visiting their homes if they break traffic rules. The traffic police roped in 'Yamraj' as their brand ambassador to make people aware of the message of the dangers of not wearing a helmet, driving recklessly and other rules as well.
Story first published:Saturday, July 14, 2018, 16:25 [IST]
Desktop Bottom Promotion