For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోహ్లీ ఆకలి తట్టుకోలేక బెడ్ షీట్ తినాలనుకునేవాడట.. విరాట్ ఫిటె నెస్ సీక్రెట్స్ ఇవే, ఇలా చేస్తే ఫిట్

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో సృష్టించిన రికార్డులు అందరికీ తెలిసినవే. కోహ్లీ ప్రపంచ క్రికెటర్లలో ఒకడు.విరాట్ కోహ్లీ ఫిట్ నెస్, విరాట్ కోహ్లీ వ్యాయామం, విరాట్ కోహ్లీ జిమ్, కోహ్లీ బాడీ

|

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో సృష్టించిన రికార్డులు అందరికీ తెలిసినవే. కోహ్లీ ప్రపంచ క్రికెటర్లలో ఒకడు.కాగా బ్యాట్స్‌మెన్‌గా ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
అందుకు కారణం అతని ఫిట్నెస్. డాషింగ్ బ్యాట్స్ మెన్ గా దూసుకెళ్తున్న కోహ్లీ అంత ఫిట్ గా ఉండటానికి ఏం చేస్తారు? ఏం తింటారు? అని చాలా మంది తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు.

అలాగే విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ అసలు డైట్‌లో ఏం తీసుకుంటున్నాడని అందరూ అనుకుంటూ ఉంటారు.

గంటల తరబడి జిమ్ లో

గంటల తరబడి జిమ్ లో

గంటల తరబడి జిమ్ లో ఉండి వ్యాయామం చేయడమే తన ఫిట్నెస్ కు కారణం కాదు అని విరాట్ ఒకసారి అన్నారు. నా ఫిట్నెస్ కు కారణం నా ఆహారపు అలవాట్లు కూడా అని కూడా గతంలో "బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్"వెబ్ సిరీస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. తన ఆహార అలవాట్ల గురించి కోహ్లీ ఈ ఇంటర్వూ లో చెప్పుకున్నారు.

ఆమ్లెట్ తో

ఆమ్లెట్ తో

ఉదయాన్నే మెనూ.. ఆమ్లెట్ తో మొదలవుతుందట. మూడు ఎగ్ వైట్లు, ఒక ఫుల్ ఎగ్ తో ఆమ్లెట్ తీసుకుంటారట విరాట్ కోహ్లీ. పాలకూర, బ్లాక్ పెప్పర్, వెన్నను రోజూ విరాట్ కోహ్లీ తినే ఆహారంలో చేర్చుకుంటారట. బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ ముక్కల్ని విరాట్ కోహ్లీ రెగ్యులర్ గా తింటారట. ఆత రువాత గ్రీన్ టీ తో విరాట్ కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ ముగుస్తుందట.

డిన్నర్ ను సీ ఫుడ్ తో ముగిస్తారట

డిన్నర్ ను సీ ఫుడ్ తో ముగిస్తారట

విరాట్ కోహ్లీ లంచ్ లైట్ గా తీసుకుంటారట. మధ్యాహ్నం లంచ్ లో గ్రిల్డ్ చికెన్, ఉడికించిన బంగాళాదుంపలు, పాలకూర, కాయగూరలు తింటారట. ఇక కోహ్లీ డిన్నర్ ను సీ ఫుడ్ తో (సముద్రపుచేపలు) ముగిస్తారట. ఇవన్నీ డాక్టర్ల సలహా మేరకే కోహ్లీ పాటిస్తున్నాడట.

ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి

ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి

అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో నెగ్గుకు రావాలంటే ఫిట్నెస్ అనేది అత్యంత కీలకం. ఆ విషయాన్ని మన పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి ఎప్పుడో గ్రహించాడు. దానిలో భాగంగానే తన ఫిట్నెస్ నుకాపాడుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తునే ఉన్నాడు.

మాజీ కోచ్ డంకెన్ ఫ్లెచర్

మాజీ కోచ్ డంకెన్ ఫ్లెచర్

రానురానువిరాట్ కోహ్లి ఫిట్నెస్ విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట్లో ఫిట్నెస్ నుపెద్దగా పట్టించుకోని కోహ్లి.. కొన్నేళ్ల క్రితం తన ఆహార నియమావళి విషయంలో కఠినమైన పద్ధతులు అవలంభిస్తున్నాడు. అది తన సక్సెస్ కు కారణమని గతంలో స్పష్టం చేసిన కోహ్లి.. అందుకు కారణం భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ డంకెన్ ఫ్లెచర్ అని కూడా చెప్పాడు.

టెన్నిస్ ప్లేయర్ తరహాలో ట్రయన్ కావాలి

టెన్నిస్ ప్లేయర్ తరహాలో ట్రయన్ కావాలి

తొలుత తన ప్రతిభను గుర్తించిన డంకెన్ ఆ తరువాత తన ఫిట్ నెస్ పై కూడా కొన్ని సూచనలు చేశాడని కోహ్లి ఆ మధ్య చెప్పాడు. "నీలో ప్రతిభ ఉంది. కానీ శిక్షణ విషయంలో నీవు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. ఒకవేళ నీవు మూడు ఫార్మాట్లలో అత్యున్నత స్థాయిలో ఉండాలంటే ఒక టెన్నిస్ ప్లేయర్ తరహాలో ట్రయన్ కావాలి. దానిలో భాగంగా నీ రోజువారీ వ్యాయమం. "

ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి

ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి

" కోహ్లీ నువ్వు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే కఠినమైన పద్ధతులను అవలంభించ తప్పదు. మనం ఫిట్ గా ఉన్నప్పుడే మానసికంగా కూడా బలంగా ఉంటాం" అని ఫ్లెచర్ తనకు హితబోధ చేసినట్లు కోహ్లి పేర్కొన్నాడు. ఆ రోజు డంకెన్ చేసిన ఆ అమూల్యమైన సూచనే తన కెరీర్ ఎదుగుదలకు ఎంతగానే ఉపయోగపడిందని కోహ్లి ఆ మధ్య చెప్పాడు.

దినచర్య చాలా దారుణం

దినచర్య చాలా దారుణం

గతంలో తన రోజువారీ దినచర్య చాలా దారుణంగా ఉండేదని కోహ్లి అప్పట్లో పేర్కొన్నాడు. అసలు తిండి విషయంలో నియంత్రణ ఉండేది కాదనన్నాడు. రోజుకు రెండుసార్లు కూల్ డ్రింక్ తాగేవాడినని, అదే క్రమంలో రాత్రి పొద్దుపోయే వరకూ ఏదొకటి తింటూనే ఉండేవాడినని కోహ్లి తెలిపాడు.

ఒక రోజు స్నానం చేసి వచ్చి

ఒక రోజు స్నానం చేసి వచ్చి

ఫ్లెచర్ చెప్పిన మాటలు విన్నాక ఇంటిక వెళ్లి దాని గురించి చాలా సీరియస్‌గా ఆలోచించాచడట కోహ్లీ. ఇంటికెళ్లిన తరువాత ఒక రోజు స్నానం చేసి వచ్చి తనను తాను అద్దంలో చూసుకున్నాడట. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావాలనుకున్నప్పుడు ఇలా ఉండకూడదని తనకు అర్థమైందట. మనలో ఎంత ప్రతిభ అయినా ఉండవచ్చు కానీ ఫిట్‌నెస్‌ విషయంలో ఎంతో శ్రమించాలి అని ఫ్లెచర్ చెప్పిన మాటల వల్ల కోహ్లీకి తెలిసిందట.

బెడ్‌షీట్‌ ను తినేయాలని అనిపించేదట

బెడ్‌షీట్‌ ను తినేయాలని అనిపించేదట

తర్వాత జిమ్‌లో రోజు గంటన్నరకు పైగా గడపడం అలవాటు చేసుకున్నాడట. కొవ్వు పదార్థాలు, జంక్‌ పుడ్‌, కూల్‌ డ్రింక్స్‌, కేక్‌, ఐస్‌క్రీమ్‌లు ఇలా అన్నీ మానేశాడట. అప్పటి వరకు ఏది బడితే అది తిన్న కోహ్లీకి ఇవన్నీ మొదట్లో కాస్త ఇబ్బందికరంగా అనిపించేవట. తొలి రెండు నెలలు కోహ్లీకి చాలా కష్టంగా అనిపించిందట. బాగా ఆకలేసేది అట. ఒక్కోసారి రాత్రి పూట ఆకలి తట్టుకోలేక కప్పుకునే బెడ్‌షీట్‌ నైనా తినేయాలని కోహ్లీకి అనిపించేదట. అవన్నీ భరించాడట కోహ్లీ.

కాళ్లలో బలం పెరిగిందట

కాళ్లలో బలం పెరిగిందట

ఇక 2015 నుంచి తన ట్రయినింగ్‌ పద్దతినే మార్చేశాడట కోహ్లీ. క్లీన్‌ అండ్‌ జెర్క్‌, స్నాచ్‌, డెడ్‌ లిఫ్ట్‌ అంశాలను చేర్చుకున్నాడట. దాంతో తన చేతులు, కాళ్లలో బలం పెరిగిందట. అలా కోహ్లీ ట్రైనింగ్‌కు బానిసనయ్యాడట.

బొద్దుగా ఉండే తాను

బొద్దుగా ఉండే తాను

అలా తన ట్రయనింగ్ చాలా కఠినంగా ఉన్నా, అది తన సక్సెస్ కారణమైందన్నాడు. గతంతో పోలిస్తే చాలా బరువు తగ్గినట్లు కోహ్లి అన్నాడు. అప్పుడు బొద్దుగా ఉండే తాను.. ఇప్పడు ప్రతీరోజు కఠినమైన శిక్షణను అవలంభిస్తున్నానని పేర్కొన్నాడు.

రెండింటిని కలిపి చేస్తే

రెండింటిని కలిపి చేస్తే

కోహ్లీ కార్డియో-అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వెయిట్లు, కార్డియో రెండు మంచివేకావచ్చు. అయితే రెండింటిని కలిపి చేయడం మేలని కోహ్లీ అభిప్రాయం. విరాట్ దీనిని అనుసరిస్తాడట.

English summary

virat kohlis fitness routine and full diet plan and this is what he would eat as his cheat meal

virat kohlis fitness routine and full diet plan and this is what he would eat as his cheat meal
Story first published:Thursday, June 7, 2018, 15:05 [IST]
Desktop Bottom Promotion