Latest Updates
-
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్‌లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026
దెయ్యం పేరు చెబుతూ విద్యార్థినులపై లైంగిక దాడులు చేస్తున్న వార్డెన్
మీరట్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు రోజూ రాత్రి ఒక దెయ్యం వెళ్తూ ఉంటుంది. మీరట్ స్కూల్ దెయ్యం, మీరట్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, దెయ్యంగా వార్డెన్.
మీరట్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు రోజూ రాత్రి ఒక దెయ్యం వెళ్తూ ఉంటుంది. సుమారు వంద మందికి పైగా విద్యార్థినులు ఉన్న హాస్టల్లో ఆ ముసుగు దెయ్యం రోజూ తనకు ఇష్టమొచ్చినట్లు చేసేంది.
ఇక ఆ దయ్యం విద్యార్థినులను తాకకూడని చోట తాకేది. తన ఆనందం తీర్చుకుంటూ విద్యార్థినులను లైంగికంగా వేధించేది.
రోజూ రాత్రి అందరూ పడుకున్నాక ఆ దెయ్యం మెల్లగా విద్యార్థినులు పడుకున్న గదిలో వెళ్తుంది. ఏదో పెర్ఫ్యూమ్ లాంటిదాన్ని కొందరు అమ్మాయిలపై చల్లుతుంది. ఎవరితోనో మాట్లాడుతుంది. అమ్మాయిల దుస్తులు లాగేసి రాక్షశాసందం పొందుతుంది.

అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది
అయితే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది .నిజంగా దెయ్యం కాదు. ప్రతి రోజు రాత్రిపూట వార్డెన్.. దెయ్యం మాదిరి బట్టలు ధరించి భయభ్రాంతులకు గురి చేసేది. అంతేకాదు.. విద్యార్థినులను వేధిస్తూ.. హింసించేది. తమ పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తూ.. వేధింపులకు గురి చేస్తున్న వార్డెన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా మెజిస్ట్రేట్‌కు కూడా విద్యార్థినులు లేఖ రాసి వార్డెన్ పై ఫిర్యాదు చేశారు.

అనవసర ఆరోపణలు
విద్యార్థినుల ఫిర్యాదుపై వార్డెన్ స్పందించారు. కాగా వార్డెన్ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాల వసతి గృహంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అన్ని నిజాలు బయటపడుతాయన్నారు వార్డెన్.

త్వరలోనే విచారణ
విద్యార్థినుల ఫిర్యాదుపై విద్యాధికారులు త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది. వార్డెన్ వేధింపులపై విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వార్డెన్ ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

జాగ్రత్తగా చూడాల్సిన వార్డెనే
కాగా తమను జాగ్రత్తగా చూడాల్సిన వార్డెనే అలా చేస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. రాత్రి పూట వార్డెన్ ముఖానికి ముసేగుసుకొని తమ గదిలోకి వస్తోందని, అసభ్యంగా ప్రవర్తిస్తోందని విద్యార్థినులు చెబుతున్నారు. ప్రతి రోజూ అర్ధరాత్రి ఆమె చేస్తున్న ఆగడాలను భరించలేకపోతున్నామన్నారు.

ఒక్కో మంచంలో ఇద్దరు విద్యార్థినులు
ఆ హాస్టల్లో మూడు పెద్ద పడక గదులున్నాయి. ఒక్కో గదిలో 20 బెడ్‌లు ఉండగా.. ఒక్కో మంచంలో ఇద్దరు విద్యార్థినులు నిద్రిస్తారు. వారితోపాటు గదికి ఒక టీచర్ చొప్పున వారికి రక్షణగా నిద్రించాల్సి ఉన్నప్పటికీ.. అలా చేయడం లేదు. దీంతో వార్డెన్ ఆగడాలు మితిమీరాయి.

అసభ్యంగా ప్రవర్తించేది
‘‘రాత్రిపూట వార్డెన్ కొంత మంది అమ్మాయిలను బయటకు తీసుకెళ్లేది. నా గదికి వచ్చి నన్ను ఎక్కడపడితే అక్కడ తాకేది. నిద్ర మత్తులో ఉన్న నాతో అసభ్యంగా ప్రవర్తించేది. మెలకువ వచ్చినప్పటికీ.. భయంతో కళ్లు తెరిచే దాన్ని కాదు''ని 8వ తరగతి చదువుతున్న బాలిక లేఖలో పేర్కొంది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా
దయ్యం ఆగడాల గురించి విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో చివరకు కొందరు అమ్మాయిలు ధైర్యం చేసి జిల్లా మెజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. ఇక ఆ దెయ్యం సంగతి చూడమని ఆయన విచారణకు ఆదేశించారు. మరి ఏమైతుందో చివరకు. ఆ దెయ్యం వార్డెనా లేకుంటే మరెవరో అనే విషయం తేలనుంది.



Click it and Unblock the Notifications