For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రాశి వారు సొంత నీడను నమ్మినా కూడా నట్టేట మునుగుతారు అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు రాశి ఫలాలు

By Arjun Reddy
|

ప్రతివారం మాదిరిగానే, ఈ వారం కూడా జ్యోతిష్య పండితుల సూర్యమాన సిద్దాంతాన్ని అనుసరించి వారఫలాలను పొందుపరచడం జరిగింది.

ఈ వారం వారఫలాలు : అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 వరకు

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 20
 

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 20

ఎవరి మాటా లెక్కచేయకుండా, ముందుకు సాగే తత్వం ఎప్పటికైనా సమస్యలనే సృష్టిస్తుంది అన్న విషయం మరవకండి. అన్ని వేళలా ఒకే రకమైన మనస్తత్వం పనికిరాదని గుర్తుంచుకోండి. మీ మీద ఆధారపడి ఉండే వారి జీవితాల కోసం మీరు విపరీతంగా ఆలోచించవచ్చు. కానీ మీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవలసిన భాద్యత మీమీదే ఉంటుందని నిర్ధారించుకోండి. మీ వ్యాపార చతురత ఈ వారం శిఖరాగ్రంగా ఉంటుంది. మీ ఆలోచనా విధానమే మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీ కుటుంబం నుండి ప్రేమ మరియు మద్దతు మీ ఉన్నతికి ప్రేరేపిస్తాయి.

అదనపు ఖర్చులు అంతగా ఆందోళనలు కలిగించవు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆదాయపరమైన లాభాలు అనేకం ఉన్నాయి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా, మీ జీవిత భాగస్వామి కోరికలు కొన్ని నెరవేర్చలేకపోవచ్చు, ఇది మీకు కొద్దిగా నిరాశను కలిగించే అవకాశాలు ఉన్నాయి. వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలయితే వారి డిమాండ్లను తీర్చే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైన సమస్యలు లేనప్పటికీ, దీర్ఘకాలిక అనారోగ్యాలతో భాదపడుతున్న వారు, మరియు శ్వాస కోశ సంబంధ సమస్యలు ఉన్నవారు, కొంత జాగ్రత్త వహించడం తప్పనిసరి.

వృషభ రాశి : ఏప్రిల్ 21 - మే 21

వృషభ రాశి : ఏప్రిల్ 21 - మే 21

కార్యాలయంలో కానీ, మీ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా గానీ, మీకు ఆకస్మికంగా అధిక పని ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరియు మీ ఉత్తమ ఫలితాల సాధన, మీ సంస్థ పురోగతికి అత్యంత అవసరంగా ఉంటుంది. సరైన ప్రణాళిక, కోపము తగ్గించుకోవడం, మరియు శ్రద్ద వంటి అంశాలు, ఇచ్చిన గడువులోపు పనులు పూర్తయ్యేందుకు మీకు సహాయం చేస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు. ఈ సమస్యలు మీ జీవిత భాగస్వామి పరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, క్రమంగా అధిక భావోద్వేగాలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.

కానీ వృత్తి పరమైన చిరాకులను భాగస్వామి ముందు ప్రదర్శించకండి. అది మీ సంబంధంలో చికాకులను తీసుకుని రాగలదు. దీర్ఘకాల పెట్టుబడులు ఫలవంతమైనవిగా ఉంటాయి. మీ ఆర్థిక సంబంధిత ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అయినప్పటికీ, ఆరోగ్యం పరంగా మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధిత సమస్యలతో భాదపడుతున్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది.

మిధున రాశి : మే 22 - జూన్ 21
 

మిధున రాశి : మే 22 - జూన్ 21

ఈ వారం మీ కార్యాలయంలో వృత్తి పరమైన అంశాలలో అధిక చొరవ తీసుకోవలసిన సమయంగా ఉంటుంది. మీ తీరుతెన్నులు, మాట్లాడే విధానాలు సమాజంలో, మరియు మీ కార్యాలయ వర్గాలలో మీ మీద విశ్వసనీయత పెరగడానికి దోహదపడుతుంది. మీరు మానసిక సంఘర్షణలతో భాదపడుతున్న ఎడల, ఏదైనా మనసుకు నచ్చిన ఆద్యాత్మిక స్థలాన్ని సందర్శించడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. క్రమంగా మీ వ్యక్తిగత జీవితంలో కూడా శాంతి నెలకొంటుంది. కొన్ని వ్యవహారాలలో మూడవ వ్యక్తి ప్రమేయాలు ఉండకూడదని నిర్ధారించుకోండి, ఇవి మొదటికే చేటును తీసుకుని వస్తాయి.

పాత పెట్టుబడులు మంచి రాబడిని తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్రమంగా మీకు ఆర్ధిక పురోగతి బాగుంటుంది. కొత్త వ్యక్తులను కలిసేందుకు సరైన సమయం కానందున, బాచిలర్స్ కొంతకాలం సాంఘికపరమైన దూరాన్ని పాటించడం అవసరం. ఆరోగ్యం పరంగా బాగున్నప్పటికీ, మీ అజాగ్రత్త కారణంగా గాయాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ఆచితూచి వ్యవహరించండి.

కర్కాటక రాశి : జూన్22 - జూలై 22

కర్కాటక రాశి : జూన్22 - జూలై 22

సాధారణ పని జీవితం మీకు కాస్త బోరింగ్ అనిపించే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా ఆలస్యం, పనియందు కాలక్షేపం వంటివి సర్వసాధారణంగా ఉంటాయి. కానీ మీ ఈ చర్యలు మీ పనిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఎడల, పని నుండి కొంత విరామం తీసుకోవడం మంచిది. సెలవులో మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. నిజానికి, ఈ వారంలో ప్రయాణాలు అధికంగా ఉంటాయి. తిరస్కరణల భయం మిమ్ములను మీ కోరికల నుండి దూరంగా ఉంచుతుంది.

కానీ ధైర్యం చేసి అడుగు ముందుకు వేస్తె, విజయావకాశాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. అవగాహనా లేమి సమస్యలు మీ వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను తీసుకుని రావొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించడం మంచిదిగా సూచన ఇవ్వబడింది. మీ భాగస్వామి ఆలోచనలకు కూడా విలువిచ్చి, సందర్భానుసారం నడుచుకోవడం ద్వారా మీ సంబంధంలో కొన్ని ఆరోగ్యకర మార్పులు తీసుకుని రావడంలో దోహదం చేయవచ్చు. వయసు మీద పడిన వారు ఈ వారం ఆరోగ్యంపరంగా ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి : జూలై 23 - ఆగస్టు 21

సింహ రాశి : జూలై 23 - ఆగస్టు 21

ఇది మీ వృత్తి పరమైన అంశాలలో, లేదా మీరు పని చేసే కార్యాలయాలలో మీ సృజనాత్మకతను వెలికి తీసేందుకు సరైన సమయంగా ఉంటుందని చెప్పబడింది. కానీ మీరు నిర్భంధానికి లోనవుతున్న అనుభూతిని కలిగి ఉంటే, ఈ వారం మీ కలలకు రెక్కలనిచ్చేలా, ఉద్యోగ మార్పిడికి కూడా అనువైన సమయంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు, వ్యాపార భాగస్వామ్యాల ద్వారా తాజా పరిణామాలను చూసే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా మీరు మంచి ఆర్ధిక లావాదేవీలను కలిగి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ లాభాలను నిలబెట్టుకోవడంలో జాగ్రత్తలు అవసరం, ఖర్చులను మరియు పొదుపును నిర్వహించుకొనుటలో మీరు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్ ప్రణాళికల మీద ప్రభావాలను చూపగలవని మరచిపోకండి.

మీ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ, కొన్ని సంబంధాలలో ఉన్నవారికి ఈ వారం గడ్డు కాలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే, సంబంధాన్ని ముగించడం పరిష్కారం కాకపోయినా, తెలివిగా వ్యవహరించడం మంచిది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా, మానసికంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. సైనస్, మైగ్రేన్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలతో భాద పడుతున్న వారు, ఈ వారం ఆహార ప్రణాళికలో కొంతమేర మార్పులు చేయడం అవసరం.

కన్యా రాశి : ఆగస్టు 22 - సెప్టెంబరు 23

కన్యా రాశి : ఆగస్టు 22 - సెప్టెంబరు 23

మీ వృత్తి సంబంధిత కార్యాలయాలలో ఈ వారం పునః సమీక్షించడానికి మీ వ్యూహాత్మక ప్రణాళికా నైపుణ్యాలకు పని చెప్పాల్సి ఉంటుంది. మీరు ఊహించని రీతిలో విపరీత పరిస్థితుల్లోకి అడుగు పెట్టాల్సిన సమయంగా ఉంటుంది. మీ వ్యూహం మరియు దౌత్యం కారణంగా ఉత్తమ ఫలితాలను పొందుతున్నప్పటికీ, పేరు, ఫలితం వేరే వాళ్ళు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కావున ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార రంగంలోని వ్యక్తులు, వారి వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయపడే కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రియమైనవారి అవసరాల పట్ల శ్రద్ధ చూపాల్సిన సమయంగా ఈవారం ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మీ భాగస్వామికి మీ మద్దతు మరియు ప్రేమ అవసరంగా ఉంటుందని మరువకండి. వివాహితులు వారం చివరలో ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎంతోకాలంగా వేచి చూస్తున్న అంశాలుగా కూడా ఉండవచ్చు. మీరు ఎల్లప్పుడూ భవిష్యత్ కార్యాచరణ పట్ల, పొదుపు పరమైన ఆలోచనలు చేస్తుంటారు. మరియు ఇది మీ ఆర్థిక పరిస్థితులను మరింత బలపరుస్తుంది. ఈ వారం మీకు ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ, కోరి తెచ్చుకునే ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త తప్పనిసరి.

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

తులా రాశి : సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23

మీరు మీ వృత్తిపరమైన జీవితాన్ని సురక్షితమైన జీవితంగా భావిస్తారు. మరియు ఆ జీవితమే మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది కూడా. మీ ఈ ఆలోచనా ధోరణి, మీ పనితీరును మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అయితే, ఈ వారం మీ వ్యక్తిగత జీవితం గురించి శ్రద్ధ వహించడానికి కొన్ని ప్రత్యేకించిన కారణాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో ఒక ఆహ్లాదకరమైన యాత్రకు ప్రణాళికలను సిద్దం చేసే ఆలోచనలు చేస్తారు. మీ ఈ ఆలోచనలు కుటుంబ సభ్యులకు, మీకు విశ్రాంతిని ఇవ్వడానికి మరియు మానసిక ఉల్లాసానికి సహాయపడుతుంది.

మీరు ఈ వారం ఆర్థికపరమైన స్వేచ్చను కలిగి ఉంటారు. కానీ దుబారా ఖర్చులు చేయకుండా, పొదుపు చేయడానికి ప్రణాళికలు చేయండి. విద్యార్థులకు విదేశీ యాన అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకవేళ ఎంతో కాలంగా విదేశాలలో అభ్యాసాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎడల, ఈ వారం మీకు సానుకూల ఫలితాలు కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ వారం కాలానుగుణ మార్పుల వలన అలెర్జీ సమస్యలను ఎదుర్కొనవచ్చును. కావున వ్యాయామం, జీవన శైలి మరియు ఆహార ప్రణాళికలలో ఆరోగ్యకరమైన మార్పులు చేయడం తప్పనిసరి.

వృశ్చిక రాశి : అక్టోబరు 24 - నవంబర్ 22

వృశ్చిక రాశి : అక్టోబరు 24 - నవంబర్ 22

ఈ వారం మీ వృత్తి సంబంధిత కార్యాలయాలలో మీ పనికు తగ్గ ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరేంటో రుజువు చేసుకునే సమయంగా ఈ వారం ఉండనుంది. ప్రణాళికా బద్దమైన మీ ఆలోచనా ధోరణి కారణంగా, ఈ వారం మీ వృత్తిపరమైన జీవితంలో మెరుగైన ఫలితాలను పొందేలా చేస్తుంది. సమయానుసారం, కొందరిని కిందకు లాగి, ముందుకు అడుగులు వేయవలసిన అవసరాలు సైతం ఏర్పడుతాయి. ఈ పోటీ ప్రపంచంలో, మీరు అలా చేయని పక్షంలో, మీ అడుగులు వెనకకే పడుతాయని మరువకండి.

మరో వైపు, మీ సంబంధం సరైన మార్గంలో లేదని మీరు భావిస్తే, కొంత సమయం మీ భాగస్వామికి కేటాయించి చూడండి. ప్రేమ కూడా కొన్ని విషయాల చుట్టూతా తిరుగుతుందని మీరు గమనించవచ్చు. ఆదాయం యొక్క నూతన వనరులు మెరుగ్గానే ఉంటాయి, ఇది మీ ఆర్ధిక స్థితిగతులను నిలకడగా ఉంచుతుంది. మీ విశ్రాంతికి కూడా తగిన సమయం అవసరమని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. లేనిచో మానసిక సమస్యలతో పాటు, శారీరిక సమస్యలు కూడా తోడయ్యే అవకాశాలు లేకపోలేదు.

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

ధనుస్సు రాశి : నవంబర్ 23 - డిసెంబర్ 22

మీ మర్చిపోయే స్వభావం ఈ వారంలో కార్యాలయాలలో, లేదా పనియందు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. వాటిని గుర్తుంచుకోవడానికి విషయాలను రాయడానికి ప్రయత్నించండి. ఇలా ఒక జర్నల్, లేదా నోట్స్, మొబైల్లో రిమైండర్లు నిర్వహించడం కూడా మీ జ్ఞాపక శక్తి పెరుగుదలకు, మరియు వృత్తి పరమైన అంశాలలో సహాయపడుతుంది. వ్యాపారస్థులు తమ వ్యాపారాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మీ భాగస్వాముల దృష్ట్యా, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి, మరియు తగాదాలకు తావివ్వకుండా, ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించండి.

మీ వివాహ జీవితం సజావుగానే ఉంటుంది. ఆసక్తికరంగా బాచిలర్స్ ప్రేమ, మరియు పెళ్లి వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. కానీ ఆ సంబంధాల నుండి ఎటువంటి నిబద్ధతను ఆశించకూడదు. సమయానుసారం, పరిస్థితులు తరచూ మారుతూ ఉంటాయి. ఆదాయంలో స్థిరమైన ప్రవాహం ఉంటుంది కాని ఖర్చుల పరంగా అంచనాలను దాటిపోతాయి. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, ఉప్పుతో కూడుకుని ఉన్న ఆహారాల నుండి దూరంగా ఉండటం ముఖ్యం.

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

మకర రాశి : డిసెంబర్ 23 - జనవరి 20

ఈ వారంలో మీ వృత్తి సంబంధిత కార్యాలయాలలో, ఎవరినీ విశ్వసించకూడదనేది ప్రామాణికంగా గుర్తుంచుకోవలసి ఉంటుంది. మీరు గ్రూప్ ప్రాజెక్టులో భాగమైతే, మీ స్వంత ఆలోచనలను అమలు చేయటం కష్టంగా ఉన్నప్పటికీ, ముఖ్య పరిశోధనను మాత్రం మీరే చేయాలని నిర్ధారించుకోండి. స్వల్పకాలిక ప్రయాణాలకు అవకాశాలు ఉన్నందున, ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించక తప్పదు.

కానీ ఈ ప్రయాణాలు దీర్ఘకాలికంగా ఉత్తమ ఫలితాలనే ఇస్తాయని గుర్తుంచుకోండి. మీ ప్రతి అడుగు ముఖ్యమైనదే, మీ ఆర్థిక స్థితిగతులు సజావుగానే కొనసాగుతాయి. ఈ అస్థిరమైన మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. కావున వారిపట్ల మీ శ్రద్ధ మరింత ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు చేసుకోండి.

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 19

కుంభ రాశి : జనవరి 21 - ఫిబ్రవరి 19

మీ వృత్తిపరమైన అంశాలలో మీ అశ్రద్ధ, మీకు సమస్యలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రతి అడుగులోనూ జాగ్రత్త తప్పనిసరి. మీరు గ్రహించని కొన్ని పొరపాట్లు కొన్ని ప్రతికూలతలను సృష్టించే అవకాశాలు లేకపోలేదు. కొన్ని సమయాల్లో మీరు అధిక పని ఒత్తిడిని ఎదుర్కొన్నా కూడా, ఫలితం మాత్రం తక్కువగానే ఉండవచ్చు. లేదా చిన్న పనికి కూడా ఎక్కువ కృషి చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. కానీ, మీ పనితనాన్ని మీ పై అధికారులు గుర్తించి ప్రోత్సాహకాన్ని అందించే అవకాశాలు లేకపోలేదని గుర్తుంచుకోండి.

మీ కుటుంబ జీవితం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు పని ఒత్తిళ్ళ నుండి ఉపశమనం కలిగించగలదు. మీరు మీ పొదుపులను నిర్వహించే విధానం, అందరికీ ఆశ్చర్యకరంగా ఉంటుంది. క్రమంగా కొన్ని ఆకస్మిక ఖర్చులు తలెత్తినా, మీకు తాత్కాలిక సమస్యగా మాత్రమే ఉంటుంది కానీ, శాశ్వతం కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం అవసరం. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు భాద పెట్టే అవకాశాలు లేకపోలేదు.

మీన రాశి : ఫిబ్రవరి 20 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 20 - మార్చి 20

మీ సృజనాత్మక ఆలోచనల కారణంగా ఈ వారం మీ కార్యాలయం నందు, మీకు మంచి గుర్తింపు లభించగలదు. వారం ప్రారంభంలో కూడా మీ సామర్థ్యాన్ని నిరూపించడానికి సరైన మార్గాలు మీకు కనిపిస్తాయి. కొన్ని వృత్తి పరమైన ఇబ్బందులు తలెత్తినా, కాలానుగుణంగా కనుమరుగైపోతాయి. వ్యాపారస్థులు వారు కలిసే ఎవరినైనా విశ్వసించకూడదని సూచించడమైనది. మీ నీడను కూడా మీరు నమ్మరాదని గుర్తుంచుకోండి. మీరు నమ్మిన వ్యక్తి కూడా మీ పట్ల చేసే ఆలోచనలు మీకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు. మీ వ్యక్తిగత మరియు కుటుంబ పరమైన అంశాలలో వాతావరణం సజావుగా ఉంటుంది.

అయితే, కుటుంబం మరియు జీవిత భాగస్వామి మధ్య కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి రావొచ్చు. ఇది కేవలం ఒక వ్యూహంగా ఉంటుంది, కావున సమయానుసారం మీరు తీసుకునే నిర్ణయాలే మీకు సహాయంగా ఉంటాయి. తొందరపడి ఒకవైపునే మొగ్గు చూపడం కారణంగా, భవిష్యత్తులో కొన్ని సమస్యలకు ప్రధానకారణంగా మారుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఆరోగ్యం పరంగా, ఇది మీ అనారోగ్యకరమైన అలవాట్లను తొలగించుకోడానికి సూచించదగిన సమయంగా ఉంది. చెడు వ్యసనాలకు బానిసలుగా ఉన్న ఎడల, ఈ వారం మీకు అంత సజావుగా లేదు. కావున, ఆరోగ్యం పట్ల జాగ్రత్త తప్పనిసరి. మీ దైనందిక జీవన శైలిలో భాగంగా, వ్యాయామానికి సమయం కేటాయించడం, మరియు ఆహార ప్రణాళికలో కొన్ని మార్పులను తీసుకుని రావడం మంచిదిగా సూచించబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Weekly Horoscope: 15 October 2018 to 21 October 2018

Weekly Horoscope: 15 October 2018 to 21 October 2018
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more