For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రాశి వారు ఆస్తి కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది, ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసా?

ప్రతి వారం రాశుల వారీగా వారి భవిష్యత్తు మారుతూ ఉంటుంది. కొందరు ఒక వారం రోజుల పాటు హ్యాపీగా ఉండొచ్చు. మరికొందరు ఈ వారం అంతా ఇబ్బందులుపడుతూ ఉండొచ్చ. ఆ రాశి వారు ఆస్తి కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది

|

ప్రతి వారం రాశుల వారీగా వారి భవిష్యత్తు మారుతూ ఉంటుంది. కొందరు ఒక వారం రోజుల పాటు హ్యాపీగా ఉండొచ్చు. మరికొందరు ఈ వారం అంతా ఇబ్బందులుపడుతూ ఉండొచ్చ. మరి ఈ వారం మీ రాశి ప్రకారం మీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోండి.

ఆగష్టు 12 నుంచి ఆగస్టు 18 వరకు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి. ఈ మధ్యే కొన్ని గ్రహణాలు కూడా ఏర్పడ్డాయి. దీంతో అందరి జీవితాలపై ఈ ప్రభావం ఉంటుంది.

మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

మేషం: మార్చి 21- ఏప్రిల్ 19

ఈ వారం మీరు బిజీ బిజీగా ఉంటారు. మీ వ్యాపారం, మీరు చేసే పనుల్లో మీరు ఫుల్ బిజీ ఉంటారు. అయితే మీ శత్రువుల నుంచి మీకు హాని తలెత్తే అవకాశం ఉంది. కొందరు రహస్యంగా మీ విషయాలను మీకు పడని వారికి చెప్పే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి.

ఈ వారంలో మొదట కొన్ని రోజులు మీ ఆరోగ్యం అంత బాగుండకపోవొచ్చు. తర్వాత మళ్లీ మీరు ఆరోగ్యంగానే ఉంటారు. ఇక మెడిసిన్స్ తీసుకునే వాళ్లు అయితే వాటిని రోజూ తీసుకోవడం మరిచిపోకండి.

వృషభం: ఏప్రిల్ 20- మే 20

వృషభం: ఏప్రిల్ 20- మే 20

వృషభ రాశి వారు ఈ వారం ఏ పని మొదలుపెట్టాలన్నా ఆసక్తి కలగదు. కాస్త సోమరితనం వీరిని వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఈ వారం బాగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ వారంలో మొదటి రెండు రోజులు అలా ఉన్నా తర్వాత అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి. మీ ఇంట్లో జరగబోయే ఒక పూజకు సంబంధించిన ఫంక్షన్ లో మీ కుటుంబసభ్యులు, మీ బంధువులంతా కలుస్తారు.

మిథునం : మే 21-జూన్ 20

మిథునం : మే 21-జూన్ 20

ఈ వారం మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అవన్నీ కూడా మీకు మంచి సంపాదన తెచ్చేవిగానే ఉంటాయి. స్వయం ఉపాధికి సంబంధించి మీకు వచ్చే కొత్త ఆలోచనలు ఆచరణ రూపం దాల్చితే మీకు ఆదాయం బాగానే వస్తుంది. మీరు మీ కుటుంబం లేదా మీ ఆస్తి సంబంధిత విషయాల్లో కాస్త పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మీకు కళలు, సృజనాత్మకత ఇష్టం ఉంటే ఈ వారంలో మీకు అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి.

కర్కాటక రాశి : జూన్ 21-జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21-జూలై 22

కర్కాటక రాశి వారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. వారం మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా తర్వాత మళ్లీ అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి. మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక మీరు చేసే పనిలో భాగంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

సింహరాశి : జులై 23-ఆగస్టు 22

ఈ వారం మీరు ఆస్తి కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది. మీకు అన్ని రకాల మద్దుతు కూడా లభిస్తుంది. మీ మిత్రులు, కుటుంబం నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యంపై కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది.

కన్య : ఆగస్టు 23-సెప్టెంబర్ 22

కన్య : ఆగస్టు 23-సెప్టెంబర్ 22

కన్యరాశి వారు కొన్ని అవకాశాల కోసం ఎక్కువ ఉత్సాహంగా పని చేస్తారు. మీరు వ్యాపార పనులపై కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కొన్ని పనుల విషయంలో మీరు ఆచితూచి అడుగువేయాలి. ఖర్చులు కూడా మీకు కాస్త ఎక్కువగానే ఉంటాయి.

తులరాశి : సెప్టెంబరు 23-అక్టోబర్ 22

తులరాశి : సెప్టెంబరు 23-అక్టోబర్ 22

తులరాశి వారు ఈ వారంలో మొదట కొన్ని రోజులు ఇబ్బందులుపడే అవకాశం ఉంది. అప్పులు తీర్చే విషయంలో మీరు కాస్త ఇబ్బందులుపడవచ్చు. అలాగే కొన్ని చట్టపరమైన సమస్యలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీరు ప్రశాంతంగా ఉండండి. చురుకుగా పని చేయండి.

వృశ్చికం : అక్టోబర్ 23- నవంబర్ 21

వృశ్చికం : అక్టోబర్ 23- నవంబర్ 21

వృశ్చిక రాశి వారు ఈ వారంలో కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. అలాగే సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుక్కుంటారు. ఈ వారంలోని మొదట కొన్ని రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మీరు కొన్ని రకాల ఇబ్బందులుపడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆ విషయం త్వరలోనే మళ్లీ సద్దుమణుగుతుంది.

ధనుస్సు : నవంబరు 22-డిసెంబర్ 21

ధనుస్సు : నవంబరు 22-డిసెంబర్ 21

ధనుస్సు రాశి వారు ఈ వారం కాస్త ఎక్కువగా కష్టపడితే మంచిది. అలాగే మీకు కాస్త ఓర్పు, సహనం కూడా ఎక్కువగా ఉండాలి. ఈ వారంలో మీకు మంచి ఆదాయం ఉంటుంది. కానీ మీ కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల మీ ఆదాయం కాస్త తగ్గుతుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం : డిసెంబర్ 22- జనవరి 19

మకరం : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి వారికి ఈ వారం వృత్తిపరంగా చాలా బాగుంటుంది. అయితే మీ ఆరోగ్యం, మీ తల్లిగారి ఆరోగ్యం కాస్త బాగుండకపోవొచ్చు. ముందు జాగ్రత్తగా మీరు వైద్యుల్ని సంప్రదించడం మంచింది. అయితే వారం ప్రారంభంలో ఈ సమస్యలున్నా తర్వాత అవేవీ ఉండవు.

కుంభం : జనవరి 20- ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 20- ఫిబ్రవరి 18

కుంభరాశి వారు ఈ వారం బాగా హుషారుగా ఉంటారు.

మీరు ఈ వారంలో కొన్ని ఫంక్షన్లకు హాజరు అవుతారు. ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. వారం ప్రారంభంలో అలా ఉన్నప్పటికీ తర్వాత మళ్లీ మీరు హ్యాపీగా ఉంటారు.

మీనం : ఫిబ్రవరి 19- మార్చి 20

మీనం : ఫిబ్రవరి 19- మార్చి 20

ఈ వారం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. అయితే మీ ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు కాస్త శ్రద్ద పెట్టి పని చేస్తే అన్నీ సమస్యలు తీరుతాయి.

English summary

weekly horoscopes this weeks horoscopes for all zodiac signs august 12 2018 from august 18 2018

weekly horoscopes this weeks horoscopes for all zodiac signs august 12 2018 from august 18 2018
Story first published:Monday, August 13, 2018, 12:41 [IST]
Desktop Bottom Promotion