For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే గోత్రం ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆ విషయంలో సమస్య వస్తుంది.. సగోత్రీకులు పెళ్లి చేసుకోకూడదు

ఒకే గోత్రం కలిగిన వారికి పెళ్లిల్లు చేయకూడదు అనే మాట మనం వింటుంటాం..అసలు ఈ గోత్రం అంటే ఏంటి..ఎక్కడి నుంచి వచ్చింది..ఎందుకు ఒకే గోత్రికులు పెళ్లి చేసుకోవద్దంటారు.సగోత్రీకులు, ఒకే గోత్రం

|

హిందువులకు అందరికి గోత్రం అనేది ఉంటుంది..గోత్రానికి ,ఇంటి పేరుకి సంభందం ఉండదు..ఈ గోత్రం అనే పదాన్ని మనం ఎక్కువగా గుళ్లల్లో వింటూ ఉంటాం..పూజ చేయించేప్పుడు మన ఇంటిపేరుతో కాకుండా గోత్రనామంతో అర్చన జరుపుతారు పూజారులు..అదేవిధంగా వివాహ సమయంలో గోత్ర ప్రస్తావన వస్తుంది.

ఒకే గోత్రం కలిగిన వారికి పెళ్లిల్లు చేయకూడదు అనే మాట మనం వింటుంటాం..అసలు ఈ గోత్రం అంటే ఏంటి..ఎక్కడి నుంచి వచ్చింది..ఎందుకు ఒకే గోత్రికులు పెళ్లి చేసుకోవద్దంటారనే వివరాలు చాలా మందికి తెలియవు.

సగోత్రీకులు

సగోత్రీకులు

హిందూ సంప్రదాయం ప్రకారం ఒకే గోత్రం (సగోత్రీకుల) వారు పెళ్లి చేసుకోరు. వివాహంలో చెప్పే వధూవరుల వంశ ప్రవర చదవడానికి కారణం కూడా ఒకరి వంశం గురించి వారు వెల్లడించడం, అవతలి వారికి తెలి యడానికే. అంతేకాక వివాహానికి వచ్చిన వారికి కూడా వారి పూర్వీకుల గురించి దాని ద్వారా తెలుస్తుం ది. అయితే రాను రాను అది కేవలం ఒక తంతుగా మాత్రమే అయిపోయింది.

రుషుల పేర్ల మీద ఉంటాయి

రుషుల పేర్ల మీద ఉంటాయి

ఇక గోత్రాలు రుషుల పేర్ల మీద ఉంటాయి. ఏ రుషి వంశంలో జన్మించిన వాళ్లకు ఆ రుషి పేరు గోత్ర నామంగా వస్తుంది. అలా వచ్చిన పేరునే గోత్రం అంటారు. కొందరికి గురువుల నుంచి వారి కుటంబ నేపథ్యం, వారిని గుర్తించే ఆధారాలు, చేపట్టిన వృత్తి ఆధారంగా కూడా గోత్రాల పేర్లు వస్తుంటాయి.

గురువులు ఉండేవారు

గురువులు ఉండేవారు

పూర్వ కాలంలో ఒక కుటుంబానికి చెందిన వారికి విద్యలను నేర్పించేందుకు గురువులు ఉండేవారు. భరద్వాజుడు, అంగిరసుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, కౌండిన్యుడు, గౌతముడు, ఆత్రేయుడు, వసిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, పరాశరుడు, శ్రీవత్స వంటి వారి పేర్ల మీద గోత్రాలు ఉన్నాయి.

ఒకే రుషి వంశంలో జన్మించిన వాళ్లను

ఒకే రుషి వంశంలో జన్మించిన వాళ్లను

వారి కుటుంబ గురువు పేరునే అందరూ గోత్రంగా మార్చుకున్నారు. కొందరు విద్యను అభ్యసించని వారు వారి పూర్వికుల పేర్లు లేదా వారి వంశం మూల పురుషుడి పేరును గోత్రంగా తీసుకున్నారు. అలా గోత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఒకే రుషి వంశంలో జన్మించిన వాళ్లను సగోత్రికులు అంటారు. సగోత్రికులు అంటే వారు అన్నదమ్ముల వరుస అయ్యే అవకాశం ఉంది. ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకునేందుకు అనర్హులని హిందు ధర్మ చెబుతోంది.

అన్నా తమ్ముడు లేదా అన్నా చెల్లి

అన్నా తమ్ముడు లేదా అన్నా చెల్లి

హిందూ ధర్మ ప్రకారం ఒకే గోత్రం కలిగి ఉన్న వారు అన్నా తమ్ముడు లేదా అన్నా చెల్లి అవుతారు. రక్త సంబంధీకులు హిందు ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోరాదు. అందుకే ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోవద్దని అంటూ ఉంటారు. ఒకే గోత్రం ఉన్న అమ్మాయి అబ్బాయి అక్కా తమ్ముడు లేదా అన్నా చెల్లి వరుసలు అవుతారు. పరిచయం లేకున్నా కూడా పూర్వంలో ఏదో ఒక చోట బంధుత్వం ఉండి ఉంటుంది.

సంబంధం లేకుండా ఒకే గోత్రం ఉండదు

సంబంధం లేకుండా ఒకే గోత్రం ఉండదు

ప్రపంచంలో ఏ హిందువుకు కూడా సంబంధం లేకుండా ఒకే గోత్రం ఉండదు. గోత్రం కలిసిందంటే సంవత్సరాల క్రితం అయినా వారికి రక్త సంబంధం ఉండి ఉంటుంది. అందుకే గోత్రాలు ఒక్కటి అయిన వారు పెళ్లి చేసుకోవద్దు అని చెబుతుంటారు. దీన్నే మన సైన్స్ పరిభాషలో చెప్పుకుంటే.

ఒకేరకమయిన జీన్స్

ఒకేరకమయిన జీన్స్

రక్త సంబంధీకుల్లో ఒకేరకమయిన జీన్స్ ఉంటాయి. అంటే వారి డీఎన్ఏ ఒక్కటే అన్నమాట. వారి లక్షణాలు ఒక్కటిగానే ఉంటాయి. అంతేకాదు ఒకే రక్త సంబంధీకులు పెళ్లిళ్లు చేసుకుంటే క్రోమోజోములు క్లాష్ అయ్యి జన్యుపరమైన వ్యాధులు వస్తాయి.

సంతానానికి లోపాలు

సంతానానికి లోపాలు

అలాగే ఒకే గోత్రం కలవారిలో ఒకే జన్యవులు ఉండడం వల్ల వారి సంతానానికి లోపాలు కలిగే అవకాశం ఉందని వైజ్ఞానికంగా కూడా రుజువు అయింది. ఇవన్నీ చూసే రుషులు సగోత్రీకుల మధ్య వివాహాలు నిషేధించారు. చాలా ఆచారాలు, నియమ నిబంధనల వెనుక శాస్త్రీయ ఆధారాలున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం.

నూటికి నూరుపాళ్లూ నిజం

నూటికి నూరుపాళ్లూ నిజం

మేనరిక వివాహాల్లో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా.. పిల్లలు వైకల్యం, బుద్ది మాంధ్యంతో పుట్టడం వంటివి జరుగుతున్నాయి. సో ఒకే గోత్రీకులు పెళ్లి చేసుకోరాదన్న మన పూర్వీకుల నిబంధన నూటికి నూరుపాళ్లూ నిజం.

డాక్టర్లు కూడా వ్యతిరేకిస్తుంటారు

డాక్టర్లు కూడా వ్యతిరేకిస్తుంటారు

అందుకే పెళ్లికి ముందు జాతకాలను పరిశీలించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏదైనా జన్మనక్షత్ర దోషాలు ఉంటే శాంతి జరిపిస్తే సరిపోతుంది కానీ, ఒకే గోత్రనామాలు ఉంటే అందుకు దోష పరిహారాలంటూ ఏమీ ఉండవు. ఈ కారణంగానే రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లను డాక్టర్లు వ్యతిరేకిస్తుంటారు.

English summary

why are marriages in same gotra prohibited

why are marriages in same gotra prohibited
Desktop Bottom Promotion