For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ తేళ్లను ఒంటిపై వేసుకుని ఆడుకుంటారు, అయినా తేళ్లు ఏమీ అనవు

ఎందుకంటే ప్రతి తేళ్లపంచమికి అక్కడుండే తేళ్లు ఎవర్నీ కుట్టవట. అందుకే అందరూ ఆ రోజు తేళ్లతో ఆటలాడుకుంటూ ఉంటారు. చేతులపైన, నాలుకపైన, తలపైనా తేళ్లను వేసుకుంటారు. ఇది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం.

|

ఇటీవల అందరూ నాగుల పంచమిని చేసుకున్నారు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఏటా ఆ పండుగను చేసుకుంటూనే ఉంటాం. అయితే అదే పంచమి రోజూ ఒక రోజు తేళ్ల పండుగ చేసుకున్నారు. అంటే తేళ్ల పంచమిని నిర్వహించుకున్నారు.

కందు కూర్ కొండమ్మ గుట్ట

కందు కూర్ కొండమ్మ గుట్ట

ఆ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేటకు దగ్గర్లో ఉంటుంది. కర్నాటకలోని యాద్గిర్ డిస్ట్రిక్ట్ లోని కందు కూర్ కొండమ్మ గుట్టపై ఇలాంటి పండుగ జరుగుతుంది. అక్కడ తేళ్లను దేవుళ్లుగా భావిస్తూ పూజలు చేస్తారు.

రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు

రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు

ఇక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే ఎక్కువగా వెళ్తారు.

మొదట ఆలయంలో పూజలు చేస్తారు. తర్వాత గుడి చుట్టూ ఉన్న రాళ్ల కింద తేళ్లను పట్టుకుంటారు. వాటిని చేతులపై, ముఖంపై ఉంచుకుంటారు. ఒళ్లంతా అవి పాకినా కూడా అస్సలు భయపడరు.

తేళ్లు ఎవర్నీ కుట్టవట

తేళ్లు ఎవర్నీ కుట్టవట

ఎందుకంటే ప్రతి తేళ్లపంచమికి అక్కడుండే తేళ్లు ఎవర్నీ కుట్టవట. అందుకే అందరూ ఆ రోజు తేళ్లతో ఆటలాడుకుంటూ ఉంటారు. చేతులపైన, నాలుకపైన, తలపైనా తేళ్లను వేసుకుంటారు. ఇది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం. ఒకవేళ తేలు కుడితే గుడిలోని విభూది రాసుకుంటే చాలట.

ఏదో మహిమ ఉండడం వల్లే

ఏదో మహిమ ఉండడం వల్లే

ఏటా నాగపంచమి రోజూ వీళ్లు ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. కొండ మహేశ్వరి అమ్మవారి అండ ఉన్నంత వరకు తమకేమీ కాదని ఇక్కడి వారి విశ్వాసం. కేవలం తేళ్ల పంచమి రోజూ మాత్రమే ఇక్కడ ఏ రాయి కింద చూసినా తేలు ఉంటుందట. ఇక్కడో ఏదో మహిమ ఉండడం వల్లే తేలు కరిచినా ఏమీ కావడం లేదని భక్తుల నమ్మకం.

English summary

Why Kandukur villagers worship scorpions

Why Kandukur villagers worship scorpions
Story first published:Friday, August 17, 2018, 12:41 [IST]
Desktop Bottom Promotion