Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
వింత సంఘటన: గట్టిగా ముక్కు చీదితే, కన్ను దెబ్బతింది
వింత సంఘటన: గట్టిగా ముక్కు చీదితే, కన్ను దెబ్బతింది
గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, లేదా చీదడం కారణంగా సమస్యలేమీ ఉత్పన్నం కావని అనుకుంటూ ఉంటాం, కానీ అలా చేస్తున్నప్పుడు కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు తెలుసా?
వింతగా ఉందా? ఈ వ్యాసం చదివితే, ఈసారి గట్టిగా ఊపిరి తీసుకోడానికి, చీదడానికి మరియు అరిచి తుమ్మడానికి కూడా ఆలోచిస్తారు. లేదా జాగ్రత్త తీసుకుంటారు.
గట్టిగా చీదితే లోపలి పుర్రె భాగం దెబ్బతిన్న 36 ఏళ్ళ యువతి కథ ఇది.

ఊహించని ఘటన: గట్టిగా ముక్కు చీదితే, కన్ను దెబ్బతింది
కేవలం చీదడం, తుమ్మడం కారణంగా ఇలా ఎలా జరుగుతుంది అని మీరు ఆశ్చర్యానికి లోను కావొచ్చు! కానీ ఇది నిజం.
వైద్యులు చెప్పిన ప్రకారం, ఈ మహిళ చీదడంలో తన బలాన్నంతా ఉపయోగించడం కారణంగా కంటి సాకెట్ విరిగింది అని తెలుస్తుంది!
ఈ గాయం, ముఖం మీద గట్టిగా కొడితే కలిగే ఫ్రాక్చర్ వలె కనిపించింది.
నివేదిక ప్రకారం, మహిళ బలవంతంగా తన ముక్కు గట్టిగా చీదిన తర్వాత, తాత్కాలికంగా తన దృష్టిని కోల్పోయింది మరియు కొంతసేపటి తర్వాత ఆమె ఎడమ ముక్కు భాగంలో అకస్మాత్తుగా రక్తస్రావం ప్రారంభమవడాన్ని గ్రహించారు. క్రమంగా కంటి చుట్టూ అసాధారణ రీతిలో వాపు కూడా కనిపించింది.
ఈ గాయం యొక్క ప్రభావం తీవ్రంగా ఉండడమే కాక, ఆమె తల మరియు ఎడమ చేతి భాగంలో కూడా వికారమైన నొప్పికి కారణమైంది.
అదృష్టవశాత్తూ, ఆ స్త్రీ తన దృష్టిని కోల్పోకుండా బయటపడగలిగింది. కానీ, సాకెట్ విరిగిన ప్రాంతం తిరిగి యధాస్థితికి రావడానికి కాస్త సమయం తీసుకుంటుందని వైద్యులు తెలిపారు
కాబట్టి ఈసారి మీరు గట్టిగా తుమ్మటం, చీదడం వంటి చర్యలకు ఉపక్రమించే ముందు ఈ వ్యాసాన్ని ఒకసారి మనసులో ఉంచుకోండి.
నిజానికి మనలో అనేకులు, సాధారణ జలుబు వంటి సమస్యలకు గురైనప్పుడు గట్టిగా అరుస్తూ తుమ్ముతూ, అవసరాన్ని మించి బలాన్ని ఉపయోగించి చీదడం, గట్టిగా ఊపిరి పీల్చడం వంటి చర్యలకు పూనుకుంటూ ఉంటారు. క్రమంగా ముఖం ఎర్రబడడం, లేదా తలనొప్పికి గురికావడం వంటి సమస్యలు సర్వసాధారణంగా కలుగుతుంటాయి. కానీ ఈచర్యలు సరైనవి కాదని నిపుణులు, పెద్దవారు హెచ్చరిస్తుంటారు కూడా. అయినా వినరు. కనీసం ఇటువంటి కథనాలు చదివైనా మార్పు కలుగుతుందేమో మరి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవన శైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications