For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు పెళ్లికావడం లేదా? తిరువిడందై వరాహపురి వెళ్తే కచ్చితంగా పెళ్లి అవుతుంది, ఇల్లు కట్టుకుంటారు

ఈ క్షేత్రంలోని స్వామి వారికి నిత్య కల్యాణ దేవుడు అనే పేరు ఉంది. ఇక స్వామివారిని నిష్టతో పూజిస్తే నర దృష్టి పోతుందనేది భక్తుల నమ్మకం. తిరువిడందై వరాహపురి వెళ్తే కచ్చితంగా పెళ్లి అవుతుంది.

|

మీకు పెళ్లి కావడం లేదు. ఇల్లు కట్టుకోవాలనుకునే మీ కోరిక తీరడం లేదా? అయితే మీరు కచ్చితంగా తమిళనాడు వెళ్లాలి. అక్కడికి వెళ్లారంటే మీకు కచ్చితంగా పెళ్లవుతుంది. ఇళ్లు కూడా కట్టుకుంటారు. తమిళనాడులోని తిరువిడందై లో ఈ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ఒక కథ కూడా ఉంది.

పూర్వం మేఘనాథన్‌ కొడుకైన బలి చక్రవర్తి దేవతలతో యుద్ధం చేయడంతో పాపం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని పొగొట్టుకునేందుకు తపస్సు చేస్తాడు. ఆ ప్రాంతమే కాల నల్లూరు. దీంతో విష్ణు మూర్తి వరాహ రూపంలో అగుపిస్తాడు. బలి చక్రవర్తి పాపాలన్నీ తొలగిస్తాడు.

విష్ణుమూర్తి తిరువిడన్‌దైలో కొలువై ఉన్నాడు

విష్ణుమూర్తి తిరువిడన్‌దైలో కొలువై ఉన్నాడు

అలాగే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని ఒక కోరిక కోరుతాడు. మీరే ఇక్కడే కొలువై ఉండి భక్తుల కోరికలను తీర్చాలని అడుగుతాడు. దీంతో వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తిరువిడన్‌దైలో కొలువై ఉన్నాడు. అందువల్లే ఈ ప్రాంతాన్ని వరాహపురి అంటారు.

మూడు వందల అరవై మంది కూతుర్లు

మూడు వందల అరవై మంది కూతుర్లు

ఇక వరాహపురికి కాలముని ఆయన వచ్చాడు. ఆయన మూడు వందల అరవై మంది కూతుర్లు. వారందరితో కలిస వరాహపురిలో ఉండే వాడు కాలముని. ఆయన కూతుర్లంగా వరాహూర్తిపై భక్తి, ప్రేమ పెంచుకున్నారు. దీంతో పెళ్లి ఈడుకు వచ్చిన తన కూతుర్లను పెళ్లి చేసుకోమని వరాహమూర్తిని భక్తితో కోరాడు కాలముని.

ఏడాది మొత్తం నీ కూతుర్లను పెళ్లి చేసుకుంటా

ఏడాది మొత్తం నీ కూతుర్లను పెళ్లి చేసుకుంటా

తాను బ్రహ్మచారిగా ఇక్కడకు వచ్చి కాలముని కూతుర్లను పెళ్లి చేసుకుంటానంటాడు వరాహమూర్తి. అయితే రోజుకొకరి చొప్పున ఏడాది మొత్తం నీ కూతుర్లను పెళ్లి చేసుకుంటాను అని చెబుతాడు. ఇచ్చిన మాట ప్రకారం వరాహమూర్తి వారందరినీ చేసుకుంటాడు.

ఆమెనే అఖిల వల్లి

ఆమెనే అఖిల వల్లి

అయితే ఏడాది పూర్తయిన మరుసటి రోజే ఆ మూడు వందల అరవై మంది ఒక శక్తిగా మారతారు. ఆమెనే అఖిల వల్లి. వరాహమూర్తి సమేత అఖిల వల్లి ఆలయంగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్షేత్రాన్ని తిరువిడన్‌ దై అంటారు.

నిత్య కల్యాణ దేవుడు

నిత్య కల్యాణ దేవుడు

ఇక ఈ క్షేత్రంలోని స్వామి వారికి నిత్య కల్యాణ దేవుడు అనే పేరు ఉంది. ఇక స్వామివారిని నిష్టతో పూజిస్తే నర దృష్టి పోతుందనేది భక్తుల నమ్మకం. అలాగే స్వామివారిని దర్శించుకుని నిష్టగా పూజలు చేస్తే కచ్చితంగా పెళ్లి అవుతుంది. ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారు కూడా ఈ క్షేత్రానికి ఒక్కసారి వెళ్తే చాలు.

కల్యాణ తీర్థంలో

కల్యాణ తీర్థంలో

ఇక ఈ గుడిలో స్వామి వారికి రోజూ కల్యాణం జరుగుతుంది.

పెళ్లికాని వారు గుడికి సమీపంలోని కల్యాణ తీర్థంలో మూడు మునకలు మునగాలి. తర్వాత రెండు మాలలను దేవుడికి వేయాలి. అందులో ఒక పూలమాలను పూజారి తీసుకొచ్చి వెనక్కి ఇస్తాడు. దాన్ని మెడలో వేసుకుని 9సార్లు ప్రదక్షణ లు చేయాలి.

కచ్చితంగా వెంటనే పెళ్లవుతుంది

కచ్చితంగా వెంటనే పెళ్లవుతుంది

ఇక దండను ఇంటికి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టాలి. ఇలా చేస్తే కచ్చితంగా వెంటనే పెళ్లవుతుంది. పెళ్లయిన తర్వాత మళ్లీ భార్య లేదా భర్తతో కలిసి పూజ గదిలో ఉంచిన పూల మాలను తీసుకుని ఆలయానికి వెళ్లాలి. ఆయంలో మళ్లీ ఆ దండను సమర్పించాలి. ఇలా చేస్తే వారి దాంపత్యం బాగుంటుంది. ఈ తిరువిడన్‌దై గుడికి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి వెళ్లొచ్చు. చైన్నై నుంచి కూడా ఇది దగ్గరే.

English summary

You want to marry soon, go to thiruvidanthai nithya kalyana perumal temple

You want to marry soon, go to thiruvidanthai nithya kalyana perumal temple
Story first published:Thursday, August 9, 2018, 16:23 [IST]
Desktop Bottom Promotion