For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వివాహ అదృష్ట సంఖ్య తేదీలో పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతం,లైఫ్ పాత్, డెస్టీనీనంబర్ తెలుసుకోండిలా

లైఫ్ పాత్ నంబర్ రావాలంటే ముందుగా మీ పుట్టిన తేదీ సంఖ్య + మీరు పుట్టిన నెల సంఖ్య + మీరు పుట్టిన సంవత్సరం సంఖ్యను సిద్ధంగా ఉంచుకోండి. వీటన్నింటినీ కలిపితే మీకు లైఫ్ పాత్ నంబర్ వస్తుంది. మరి అది ఎలా వ

|

పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మనకు ఎన్ని బంధాలు ఏర్పడ్డా కూడా వివాహ బంధానికి మించినది ఉండదు. ప్రతి ఒక్కరి జీవితం పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అన్నట్లుగానే ఉంటుంది. ఇక జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ఘట్టాన్ని తూతూ మంత్రంగా చేసుకోకూడదు కదా.

ప్రతి వివాహానికి మూహుర్తం ఎంతో మంచిది. మంచి మూహుర్తంలో పెళ్లి చేసుకుంటే ఆ వైవాహిక బంధం కూడా బలంగా ఉంటుందని అంటారు. ఈ 2021లో మీరు పెళ్లి చేసుకుంటున్నట్లు అయితే మీ పుట్టిన తేదీని బట్టి మీ వివాహవేడుకకు ముహూర్తం ఉండేలా చూసుకుంటే ఇంకా చాలా మంచిది.

న్యూమరాలజీని ఎలా లెక్కిస్తారు

న్యూమరాలజీని ఎలా లెక్కిస్తారు

మీ పుట్టిన తేదీని అనుసరించి మీ న్యూమరాలజీ ఉంటుంది. మీ పుట్టిన తేదీలోని సంఖ్యలన్నీ కలిపితే ఒక లైఫ్ పాత్ నంబర్ వస్తుంది. దాన్ని బట్టి మీరు పెళ్లి చేసుకోవాల్సిన డేట్ ఫిక్స్ చేసుకోవొచ్చు.

లైఫ్ పాత్ నంబర్ ను ఎలా వస్తుంది

లైఫ్ పాత్ నంబర్ ను ఎలా వస్తుంది

లైఫ్ పాత్ నంబర్ రావాలంటే ముందుగా మీ పుట్టిన తేదీ సంఖ్య + మీరు పుట్టిన నెల సంఖ్య + మీరు పుట్టిన సంవత్సరం సంఖ్యను సిద్ధంగా ఉంచుకోండి. వీటన్నింటినీ కలిపితే మీకు లైఫ్ పాత్ నంబర్ వస్తుంది. మరి అది ఎలా వస్తుందో చూడండి.

ఉదాహరణకు, మీ పుట్టిన తేదీ 15 జూన్ 1990 అనుకుందాం. దాన్ని బట్టి లైఫ్ పాత్ నంబర్ ను ఎలా కనుక్కోవాలో చూద్దాం.

లైఫ్ పాత్ సంఖ్య

లైఫ్ పాత్ సంఖ్య

15 + 06 + 1990

(5 + 1) + (0 + 6) + (1 + 9 + 9 + 0)

6 + 6 + 19

6 + 6 + (1 + 9)

6 + 6 + 10

6 + 6 + (1 + 0)

6 + 6 + 1 = 13

1 + 3 = 4

4 అనేది లైఫ్ పాత్

4 అనేది లైఫ్ పాత్

1990 జూన్ 15 న జన్మించిన వ్యక్తి లైఫ్ పాత్ నంబర్ 4 అవుతుంది. న్యూమరాలజీ లో లైఫ్ పాత్ నంబర్ కు చాలా ప్రాముఖ్యం ఉంది. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ఈ నంబర్ ద్వారా తెలుసుకోవొచ్చు.

Most Read :రాజుగారి మనువరాలు బస్సులో నాతో పాటే, అబ్బా ఏం అందంరా బాబు, చూసి తట్టుకోలేకపోయాMost Read :రాజుగారి మనువరాలు బస్సులో నాతో పాటే, అబ్బా ఏం అందంరా బాబు, చూసి తట్టుకోలేకపోయా

జీవితభాగస్వామి లైఫ్ పాత్ నంబర్

జీవితభాగస్వామి లైఫ్ పాత్ నంబర్

ఇక మీకు కాబోయే జీవితభాగస్వామి పాత్ నంబర్ ను కూడా మీరు ఇలాగే కనుక్కోండి. వరుడు పాత్ నంబర్ 4 అయితే వధువు పాత్ నంబర్ 7 అయితే ఆ వచ్చే సంఖ్య ఎలా ఉంటుందో చూడండి.

4 + 7 = 11

1 + 1 = 2

వీరి వివాహ అదృష్ట సంఖ్య 2.

మంచి మూహుర్తం

మంచి మూహుర్తం

ఇక మీరు మీ వివాహ సంఖ్యను కనుకున్న తర్వాత దాని ఆధారంగా మంచి మూహుర్తం ఉన్న రోజుల్లో మీ న్యూమరాలజీ అనుకూలంగా ఉండే వివాహ తేదీని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుది.

ఎలా కనుక్కోవాలి

ఎలా కనుక్కోవాలి

మీ వివాహ అదృష్ట సంఖ్య ఆధారంగా మీవివాహం తేదీని ఎలా కనుగొనాలో చూడండి. మీ అదృష్ట సంఖ్యల ఆధారంగా మంచి మూహుర్తాలు ఉండే తేదీల్లో వివాహం చేసుకోండి. మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది.

ఆ రోజుల్లోనే పెళ్లి చేసుకోండి

ఆ రోజుల్లోనే పెళ్లి చేసుకోండి

ఏదైతే మీ వివాహ అదృష్ట సంఖ్య ఉంటుందో ఆ రోజుల్లోనే పెళ్లి చేసుకుంటే మంచిది. అంటే మీది, మీకు కాబోయే భాగస్వామి లైఫ్ పాత్ నంబర్లను కలిపితేవ వచ్చే వివాహ అదృష్ట సంఖ్య 2 అయితే మీరు రెండో తేదీని మంచి మూహుర్తం ఉంటే పెళ్లి చేసుకోవొచ్చు. లేదంటే 1 లేదా 9 వతేదీ వరకు మంచి రోజులుంటే చేసుకోవొచ్చు.

Most Read :పూజించు, ఆచ‌రించు... గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కొట్టు!Most Read :పూజించు, ఆచ‌రించు... గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కొట్టు!

డెస్టినీ నంబర్

డెస్టినీ నంబర్

ఇక మీ డెస్టినీ నంబర్ ఆధారంగా కూడా మీరు పెళ్లి చేసుకోవొచ్చు. ఉదాహరణకు మీరు 19 వ తేదీ సెప్టెంబర్ 1985 పుట్టారనుకుందాం. అప్పుడు 19 అంటే మీరు పుట్టిన తేదీ 9 అంటే మీరు పుట్టిన నెల 1985 అంటే మీరు పుట్టిన సంవత్సరం. వీటన్నింటిని కలపాలి. 19 +9+1985 వీటిని కలిపితే మొత్తం 2013 అవుతుంది. ఇప్పుడు మీరు వీటిని విడదీసి కలిపాలి. అంటే 2 + 0 + 1 + 3 అలా మీ టోటల్ 6 అవుతుంది. ఇది మీ డెస్టినీ నంబ‌ర్ అవుతుంది.

డెస్టినీ నంబర్ 1

డెస్టినీ నంబర్ 1

అలా మొదట మీ డెస్టినీ నంబర్ తెలుసుకోండి. తర్వాత మీ డెస్టినీ నంబర్ ఆధారంగా ఏయే తేదీల్లో పెళ్లి చేసుకుంటే మంచిదో ఇక్కడ వివరించాం.. తెలుసుకుని ఆ తేదీల్లో పెళ్లి చేసుకోండి.

డెస్టినీ నంబర్ 1 ఎవరికి వర్తిస్తుందంటే.. 1,10,19 లేదా 28 తేదీల్లో జన్మించిన వారికి వర్తిస్తుంది. వీరంతా కూడా డెస్టినీ నంబర్ 1 వచ్చే తేదీల్లో వివాహం చేసుకుంటే మంచిది.

డెస్టినీ నంబర్ 2

డెస్టినీ నంబర్ 2

2,20 లేదా 29 న జన్మించిన వారు డెస్టినీ నంబర్ 2 కు చెందిన వ్యక్తులు. వీరు లేదా 7 వ తేదీల్లో వివాహం చేసుకుంటే మంచిది.

డెస్టినీ నంబర్ 3

డెస్టినీ నంబర్ 3

డెస్టినీ నంబర్ 3 (3,12, లేదా 30 న జన్మించినవారు ) 3 లేదా 9 వ తేదీల్లో వివాహం చేసుకుంటే మంచిది.

Most Read :చీరకట్టులో సూపర్బ్, పాదాల వైపు చూశా, మెట్టెలు కనిపించగానే బాధేసింది, ఆమె నా జీవితాన్నే మార్చేసిందిMost Read :చీరకట్టులో సూపర్బ్, పాదాల వైపు చూశా, మెట్టెలు కనిపించగానే బాధేసింది, ఆమె నా జీవితాన్నే మార్చేసింది

డెస్టినీ నంబర్ 4

డెస్టినీ నంబర్ 4

డెస్టినీ నంబర్ 4 (4,13, లేదా 22 లో జన్మించిన వారు) వీరు 1 లేదా 7 వ తేదీల్లో వివాహం చేసుకుంటే మంచిది.

డెస్టినీ నంబర్ 5

డెస్టినీ నంబర్ 5

డెస్టినీ నంబర్ 5 ఉన్న వ్యక్తులు (5,14, లేదా 23 న జన్మించినవారు) 9 వ తేదీన వివాహం చేసుకోవాలి.

డెస్టినీ నంబర్ 6

డెస్టినీ నంబర్ 6

డెస్టినీ నంబర్ 6 (6,15, లేదా 24 న జన్మించినవారు ) 6 లేదా 9 తో తేదీన వివాహం చేసుకోవాలి.

డెస్టినీ నంబర్ 7

డెస్టినీ నంబర్ 7

డెస్టినీ నంబర్ 7 (7,16, లేదా 25 న జన్మించినవారు ) 1 లేదా 2 తేదీన వివాహం చేసుకోవాలి.

Most Read :వీరప్పన్ తన సొంత కూతురిని ఎందుకు చంపాడో తెలుసా?Most Read :వీరప్పన్ తన సొంత కూతురిని ఎందుకు చంపాడో తెలుసా?

డెస్టినీ నంబర్ 8

డెస్టినీ నంబర్ 8

డెస్టినీ నంబర్ 8 (8,17, లేదా 26 న జన్మించినవారు) 1 వ తేదీన వివాహం చేసుకోవాలి.

డెస్టినీ నంబర్ 9

డెస్టినీ నంబర్ 9

డెస్టినీ నంబర్ 9 వారు (9,18, లేదా 27 న జన్మించిన వారు) 3 లేదా 6 లేదా 9 తేదీన వివాహం చేసుకోవాలి.

English summary

Choose Vivah Muhurat In 2021 By Date Of Birth

Vivah Muhurat In 2019 By Date Of Birth
Desktop Bottom Promotion