For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాడిద పాలతో తయారుచేసిన సోప్ గురించి ఆశ్చర్యం కలిగించే విషయాలు

|

గాడిద పాలతో చేసిన సబ్బులు కాస్మెటిక్ ప్రపంచంలో అగ్రస్థానంలోనే ఉన్నాయని చెప్పబడుతుంది. నివేదికల ప్రకారం, ఢిల్లీలోని ఒక స్టార్ట్ అప్ కంపెనీ అయిన ' ఆర్గానికో ' అనతి కాలంలోనే ఆకస్మిక ఖ్యాతిని గడించింది. దీనికి కారణం, వారు తయారు చేసిన సబ్బులు. ఈ సబ్బులను గాడిద పాలతో తయారు చేయడం, దీని ప్రత్యేకత.

గాడిద పాల వినియోగం అనగానే, మనకు గుర్తొచ్చే చరిత్ర, ఈజిఫ్ట్ మహారాణి క్లియోపాత్రా. ఆవిడ ప్రతిరోజూ గాడిద పాలతోనే స్నానం చేసేదని చెప్పబడుతుంది. క్రమంగా ప్రపంచ సుందరిగా కీర్తించబడిందని నమ్మకం. ఇటువంటి కారణాలచేతనే గాడిదపాలతో సబ్బులు అనగానే, సౌందర్యారాధకుల కళ్ళు దీనిమీద పడ్డాయని చెప్పవచ్చు. పైగా శాస్త్రీయంగా గాడిదపాలలో చర్మ సౌందర్యానికి ఉపయోగపడగల నిక్షేపాలు కూడా ఉన్నాయని నిరూపించబడింది. క్రమంగా ఈ సబ్బులు సూపర్ హిట్ అయ్యాయి.

గాడిద పాలతో తయారుచేసిన సోప్ గురించి ఆశ్చర్యం కలిగించే విషయాలు

గాడిద పాలతో తయారైన ఈ సబ్బులు చండీగఢ్లోని ' వుమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ' ప్రదర్శనలో దర్శనమిచ్చాయి. క్రమంగా చూపరుల మనసు దోచుకుంటున్నాయి.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి. . .

గాడిద పాల సబ్బులతో కూడిన ప్రయోజనాలు :

గాడిద పాల సబ్బులతో కూడిన ప్రయోజనాలు :

' ఆర్గానికో ' వ్యవస్థాపకులైన పూజా కౌల్, గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రమంగా ఇది వృద్దాప్య ఛాయలను దూరంగా ఉంచగలదని సూచిస్తున్నారు. అంతేకాకుండా చర్మ పోషణకు సంబంధించిన నిక్షేపాలు, మరియు స్వస్థత గుణాలను కూడా కలిగి ఉంటుందని ఆమె వెల్లడించారు.

అంతేగాక సౌందర్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది...

అంతేగాక సౌందర్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది...

గాడిద పాలలో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాడిద పాలలో ప్రధానంగా యాంటీ బ్యాక్టీరియల్ తత్వాలు కలిగి ఉంటాయని చెప్పబడింది. క్రమంగా, ఇది మొటిమలు, చర్మ సంక్రామ్యతలు (ఇన్ఫెక్షన్స్) మరియు తామర వంటి తీవ్ర చర్మ సమస్యలతో పోరాడటానికి అత్యుత్తమంగా సహాయపడుతుందని చెప్పబడుతుంది.

ఒక లీటర్ పాల ఖరీదు :

ఒక లీటర్ పాల ఖరీదు :

నివేదికల ప్రకారం భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఈ సబ్బుల డిమాండ్ గరిష్టంగా ఉంది. ఈ ప్రదేశాలలోని స్థానికులకు గాడిద పాలు త్రాగటం మూలాన కలిగే ప్రయోజనాల గురించి అత్యుత్తమంగా తెలుసు. భారతదేశంలో ఒక లీటర్ గాడిద పాల ఖరీదు 1000 రూపాయల దాకా ఉంటుందని రిపోర్టు.

గాడిద పాలతో తయారుచేసిన సోప్ గురించి ఆశ్చర్యం కలిగించే విషయాలు

ఇది లైంగిక జీవితాన్ని కూడా పెంచుతుంది :

గాడిద పాలు లైంగిక జీవితాన్ని కూడా పెంపొందిస్తుందని నమ్మబడుతుంది. అంతేకాకుండా ఆస్థమా, ఆర్థరైటిస్, మధుమేహం వంటి అనేక ఇతర వ్యాధుల లక్షణాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని చెప్పబడుతుంది. కానీ దేనికైనా పరిమిత మోతాదులు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. క్రమంగా మీరు అనుసరించదలచిన ఎడల, వైద్యుల నిర్ణయం మేరకు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. కాకపోతే సబ్బుల పరంగా అంత చెప్పుకోదగిన సమస్యలు ఉండకపోవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Have You Ever Heard About Donkey Milk Soap

A Delhi-based start-up 'Organiko' has gained sudden fame after the soaps made by them became a super hit. The soaps are made from donkey's milk and it has stolen the show at 'Women of India Organic Festival' in Chandigarh.Did you know that donkey milk soaps are the latest trend in the beauty world? The benefits and the cost of these soaps will leave you baffled.
Desktop Bottom Promotion