Just In
- 32 min ago
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- 48 min ago
40 ప్లస్‌లో కూడా ఆ విషయంలో హ్యాపిగా ఉండాలంటే ఈ చిట్కాలను అనుసరించండి..
- 3 hrs ago
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- 4 hrs ago
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి?ఈ నొప్పి ప్రమాదకరమా?
Don't Miss
- Finance
రూ.5 వేల కోట్లు అప్పు తీసుకుంటాం.. అనుమతివ్వండి: సీజీ పవర్ వినతి
- News
పెళ్లిలో టిక్‌టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్‌లో కాల్పులు
- Sports
క్రీడా అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాల గుత్తా!!
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Movies
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఈ ట్రిక్స్ పాటిస్తే డబ్బు మిగులుతుంది, లేదంటే ఎంత సంపాదించినా అప్పులపాలవుతారు
చాలా మంది డబ్బు సంపాదిస్తారు. కానీ డబ్బును ఎలా దాచుకోవాలో తెలియదు. ఆదాయానికి మించి ఖర్చు చేసేవాళ్లు చాలామందే ఉంటారు. నెలసరి జీతం రాగానే దాన్ని మూడు రోజుల్లో ఒక్క పైసా లేకుండా చేసేస్తుంటారు.
ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే మీరు భవిష్యత్తుల్లో అస్సలు డబ్బు సంపాదించలేరు. ఒక ప్రణాళిక లేకుండా ఎలా అంటే డబ్బును ఖర్చు చేయకండి. డబ్బును సేవ్ చేయాలనుకునేవారు ఈ ఏడురకాల సూత్రాలు పాటిస్తే కాస్త డబ్బు వెనుకేసుకోవొచ్చు.

రాసుకుంటూ ఉండండి
మీ ఖర్చులన్నింటినీ కూడా రాసుకుంటూ ఉండండి. మీ రోజు వారి ఖర్చుల్లో దేన్ని వదిలిపెట్టకుండా రాసుకోండి. మీరు తాగిన కాఫీ, తిన్న టిఫిన్ ఖర్చులను కూడా నోట్ చేయండి. అలాగే జిమ్, షాపింగ్, రెంట్, ఎంటర్ టైన్ మెంట్ కోసం మీరు పెట్టే ఖర్చులన్నింటినీ రాసి పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు దేనికోసం ఎంత ఖర్చుపెడుతున్నారో తెలిసిపోతుంది.

కొన్ని లక్ష్యాలు ఏర్పరుచుకోండి
డబ్బు సంపాదించడంతో పాటు దాన్ని దాచుపెట్టుకునేవిషయంలో కూడా కొన్ని లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. మీ సంపాదన బట్టీ ప్రతి నెల కొంత మేర అమౌంట్ కచ్చితంగా సేవ్ చేయాలని నిర్ణయించుకోండి. ఆ మేరకు డబ్బు దాచుకుంటూ ఉండండి.

72 గంటల టెస్ట్
డబ్బు దాచే విషయంలో ఒక ట్రిక్ పాటించి చూడండి. కొన్ని రకాల వస్తువులు మనకు అంతగా పనికి రాకపోవొచ్చు. అయినా వాటిని కొంటూ ఉంటాం. అలాంటి వస్తువుల విషయంలో మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలంటే 72 గంటల టెస్ట్ ట్రిక్ ఫాలో కావాలి.
మీకు ఏదైనా అంత ఇంపార్టెంట్ కాని వస్తువును కొనాలనుకున్నప్పుడు దాన్ని ఒక 72 గంటల సమయం వరకు వాయిదా వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అది కచ్చితంగా అవసరమైతేనే కొనుగోలు చేస్తారు. లేదంటే లేదు.
Most Read : సిగరెట్ తాగినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వీటిని తినాలి

సేవింగ్
చాలామంది క్రెడిట్ కార్డ్ ఉందని విచ్చలవిడిగా షాపింగ్ చేస్తుంటారు. అసలు సేవింగ్స్ గురించి ఆలోచించరు. అలాకాకుండా ముందు కాస్త కొంత అమౌంట్ సేవ్ చేసి తర్వాత మీరు కొంత డబ్బును ఖర్చులకు కేటాయించుకోండి.

ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్
డబ్బు దాచుకోవడంలో కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. మీ సేవింగ్ ఖాతాలో డబ్బులు ఉంచడం వల్ల పెద్దగా వడ్డీ రాదు. అందువల్ల కాస్త అధిక వడ్డీ లభించే వాటిపై పెట్టుబడి పెట్టాలి. మ్యూచ్ వల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్ , స్టార్ట్ అప్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి. అయితే వీటిలో పెట్టుబడి పెట్టే ముందు కూడా ఒకటికిపదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఇంట్లోనే పార్టీలు చేసుకోండి
చాలా మంది ఫ్రెండ్స్ తో వీకెండ్స్ లో బయటకు వెళ్తూ చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఎంజాయ్ చేయొచ్చుగానీ బయట మీరు ప్రతి దానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ కొనుకున్నా... కూల్ డ్రింక్ బాటిల్ కొనుకున్నా సరే అదనపు ధరలు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఇంట్లోనే పార్టీలు అరేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. డబ్బును సేవ్ చేసుకోండి.
Most Read : మధుమేహం, షుగర్ ను చిటికెలో తగ్గించే ఇన్సులిన్ మొక్క ఆకులు, రోజుకు ఒక్క ఆకు తింటే చాలు

జాగ్రత్తగా ఉండండి
డబ్బును ఆదా చేసే విషయంలో మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. లేదంటే మీరు సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేసి అప్పులపాలవుతారు. కొన్నేళ్ల తర్వాత లెక్కలేసుకుంటే ఏమీ మిగలదు. అందుకే సేవింగ్స్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి.