For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో ఈ ప్రాంతాలలో పుట్టు మచ్చలు ఉంటే మీరు అదృష్టవంతులనే అర్ధం

ఫిజియోగ్నోమీ (పుట్టుమచ్చల శాస్త్రం) ప్రకారం, నిపుణులు వెల్లడించిన విషయాల ప్రకారం, వెంట్రుకలలో ఒక నల్లని పుట్టుమచ్చను కనుగొన్న ఎడల, అది ఎంతో అదృష్టంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా, ఆ పుట్టుమచ్చ మందముగా ఉ

|

ఇక్కడ కొన్ని ప్రదేశాలలో ఉన్న పుట్టుమచ్చలు మీకు అదృష్టాన్ని తీసుకుని రాగలవని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకోండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని గురించిన అనేక వివరాలను బహిర్గతం చేయగలవు. ముఖ్యంగా మీ ముఖం మీద కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో పుట్టుమచ్చలను కలిగి ఉండడం అదృష్టమని భావిస్తారు.

పుట్టుమచ్చల ఆకృతి నుండి రంగు వరకు, అనేక వ్యక్తిత్వ సంబంధిత వివరాలను అధ్యయనం చేయడానికి ఇవి తోడ్పాటునందిస్తాయి. అదృష్టానికి చిహ్నంగా ఉండే పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు కొనసాగండి.

మీ జుట్టులో పుట్టుమచ్చ ఇమిడి ఉన్నట్లుగా కనిపిస్తే :

మీ జుట్టులో పుట్టుమచ్చ ఇమిడి ఉన్నట్లుగా కనిపిస్తే :

ఫిజియోగ్నోమీ (పుట్టుమచ్చల శాస్త్రం) ప్రకారం, నిపుణులు వెల్లడించిన విషయాల ప్రకారం, వెంట్రుకలలో ఒక నల్లని పుట్టుమచ్చను కనుగొన్న ఎడల, అది ఎంతో అదృష్టంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా, ఆ పుట్టుమచ్చ మందముగా ఉండి, దాగున్నట్లుగా ఉన్న ఎడల, మరింత ఉత్తమంగా చెప్పబడుతుంది. మరోవైపు, నలుపు మరియు గ్లాసీ రంగులోని పుట్టుమచ్చ ఉత్తమంగా భావించబడితే, తేలికపాటి రంగులో ఉండే పుట్టుమచ్చ కలిగి ఉన్నవారు కూసింత అభద్రతాభావానికి గురవుతుంటారని చెప్పబడింది.

మీ జుట్టులో పుట్టుమచ్చ ఇమిడి ఉన్నట్లుగా కనిపిస్తే :

మీ జుట్టులో పుట్టుమచ్చ ఇమిడి ఉన్నట్లుగా కనిపిస్తే :

ఫిజియోగ్నోమీ (పుట్టుమచ్చల శాస్త్రం) ప్రకారం, నిపుణులు వెల్లడించిన విషయాల ప్రకారం, వెంట్రుకలలో ఒక నల్లని పుట్టుమచ్చను కనుగొన్న ఎడల, అది ఎంతో అదృష్టంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా, ఆ పుట్టుమచ్చ మందముగా ఉండి, దాగున్నట్లుగా ఉన్న ఎడల, మరింత ఉత్తమంగా చెప్పబడుతుంది. మరోవైపు, నలుపు మరియు గ్లాసీ రంగులోని పుట్టుమచ్చ ఉత్తమంగా భావించబడితే, తేలికపాటి రంగులో ఉండే పుట్టుమచ్చ కలిగి ఉన్నవారు కూసింత అభద్రతాభావానికి గురవుతుంటారని చెప్పబడింది.

మీ కనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే :

మీ కనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే :

రు కనుబొమ్మల లోపల దాగి ఉన్నట్లుగా పుట్టుమచ్చను కలిగి ఉంటే, అది ఒక ఖరీదైన ముత్యమనే చెప్పాలి. ఇటువంటి ప్రదేశంలో పుట్టుమచ్చను కలిగిఉన్న వ్యక్తులు తెలివైనవారని నమ్మబడుతుంది. మరియు ఎటువంటి విషయంలో అయినా, ఈ వ్యక్తులు అత్యంత లోతుగా అధ్యయనం చేస్తుంటారు. క్రమంగా గొప్ప విద్యావేత్తలుగా ఉన్నత స్థానం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విద్య మరియు సాహిత్య రంగాలలో కూడా గొప్ప విజయాలు సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయి.

మరొక వైపు, కనుబొమ్మల మీదుగా పుట్టుమచ్చను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతిష్టాత్మకమైన మరియు ఉన్నతమైన వ్యక్తులుగా పరిగణించబడుతారు. అంతేకాకుండా నిర్ణయాత్మకధోరణి కలిగి ఉంటారు. వీరికి విజయాలు అనేవి అలవాట్ల వలె ఉంటాయి.

Most Read :మధుమేహంతో ఇబ్బందిపడేవారంతా ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే చాలు షుగర్ నియంత్రణలో ఉంటుందిMost Read :మధుమేహంతో ఇబ్బందిపడేవారంతా ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే చాలు షుగర్ నియంత్రణలో ఉంటుంది

కనుబొమ్మల ముగింపు భాగంలో పుట్టుమచ్చను కలిగి ఉన్న పక్షంలో :

కనుబొమ్మల ముగింపు భాగంలో పుట్టుమచ్చను కలిగి ఉన్న పక్షంలో :

ఒక వ్యక్తి కనుబొమ్మ చివరన పుట్టుమచ్చను కలిగి ఉన్నట్లయితే, వారి జీవితంలో ఆనందోత్సాహాలకు కొదవే ఉండదు. మరియు మంచి వ్యక్తుల మద్య ఉత్తమ సంబంధాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా వ్యాపారంలో అపారమైన ప్రతిభాపాటవాలను కలిగి ఉంటారు. మరోవైపు ఈ పుట్టుమచ్చ తేలికపాటి రంగులో ఉన్నట్లయితే, వ్యక్తి యొక్క తోబుట్టువులలో ఒకరు దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 33 మరియు 34 సంవత్సరాల వయస్సులో వివాహేతర సంబంధాలతో సమస్యలను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పబడింది.

చెవి కమ్మలు పెట్టుకునే భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లైతే :

చెవి కమ్మలు పెట్టుకునే భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లైతే :

చెవి రింగులు పెట్టుకునే "చెవి తమ్మి" భాగంలో పుట్టుమచ్చను కలిగి ఉంటే, దీన్ని అత్యంత అదృష్టకరంగా భావించడం జరుగుతుంది. అనేకమంది దీనిని ప్రత్యేకమైన విషయంగా భావించడం జరుగుతుంటుంది. ఈ భాగంలో పుట్టుమచ్చ ఉన్న ఎడల, ఈ వ్యక్తులు సున్నితమైన మరియు దీర్ఘాలోచనలు చేసే వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. కానీ వీరు ఆర్ధికపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏదిఏమైనప్పటికీ వీరికి కుటుంబ సభ్యుల మరియు సన్నిహితుల అండలు ఎల్లప్పుతూ స్వాంతన చేకూరుస్తుంటాయి. క్రమంగా ఎటువంటి బాధలు కూడా ఎక్కువకాలం ఉండబోవు. అందుకనే ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్న ఎడల, అదృష్టంగా పరిగణించబడుతుంది.

కణత భాగంలో పుట్టుమచ్చ ఉన్న ఎడల :

కణత భాగంలో పుట్టుమచ్చ ఉన్న ఎడల :

పుట్టుమచ్చల శాస్త్రం ఫిజియోగ్నోమీ ప్రకారం, తల కణత భాగాన్ని 'ట్రావెలింగ్ ప్యాలెస్' అని వ్యవహరించడం జరుగుతుంది. ఇది వ్యక్తి యొక్క ప్రయాణాలను, ప్రమోషన్ మరియు ఇమ్మిగ్రేషన్ను సంబంధిత వ్యవహారాలను సూచిస్తుంది. ఈ పుట్టుమచ్చ నలుపుగా మరియు మెరుస్తూ ఉన్న ఎడల, ఈ వ్యక్తులకు ఎప్పటికప్పుడు ఇతరుల నుండి సహాయం లభిస్తూనే ఉంటుంది. కనుక దీనిని అదృష్టంగా పరిగణించబడుతుంది.

వ్యక్తి చెంప మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే :

వ్యక్తి చెంప మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే :

ఒక వ్యక్తి చెంప మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే, వారి కెరీర్ గ్రాఫ్లో గణనీయమైన విజయాలు సాధించడం జరుగుతుంటుంది. ఈ పుట్టుమచ్చ, వ్యక్తి యొక్క ఉద్యోగ సంబంధిత వ్యవహారాల దృష్ట్యా మంచిదిగా చెప్పబడింది. అటువంటి పుట్టుమచ్చను కలిగి ఉన్న పురుషులు అందరికీ ఒక ప్రేరణగా ఉండగలరు. మరోవైపు, ఈ పురుషులు వారి ఉద్యోగ విషయాలలో విజయవంతం అయ్యేందుకు అధికంగా అవకాశాలను కలిగి ఉంటారు మరియు తమ జీవితాలలో ఉత్తమ, నాయకులుగా ఉంటారు.

Most Read :రోజూ రాత్రి వైన్ తాగితే చాలా ప్రయోజనాలు, యవ్వనంగా ఉండొచ్చు, ఆ వ్యాధులేమీ రావు, ఆ శక్తి పెరుగుతుందిMost Read :రోజూ రాత్రి వైన్ తాగితే చాలా ప్రయోజనాలు, యవ్వనంగా ఉండొచ్చు, ఆ వ్యాధులేమీ రావు, ఆ శక్తి పెరుగుతుంది

గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న ఎడల :

గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న ఎడల :

గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న ఎడల, దీనిని సంపదకు చిహ్నంగా భావించడం జరుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులలో మంచి అదృష్టం ఉంటుంది. కావున ముఖంలోని ఈ ప్రదేశంలో పుట్టుమచ్చను కలిగి ఉండడం అదృష్టమని నమ్ముతారు. ఇటువంటి పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఇతరుల నుండి మద్దతు పొందడంలో గొప్పగా ఉంటారు. దీనితో పాటు, ఈ వ్యక్తులు జీవితం పరంగా తీసుకునే నిర్ణయాలలో ఉత్తమంగా ఉంటారు. మరియు ఆర్ధికంగా కూడా పురోగతి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

moles-in-these-places-bring-in-luck

Moles In These Places Are Considered To Be Lucky
Desktop Bottom Promotion