For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోడి పందేల చరిత్ర, యుద్దాలే జరిగాయి, కోట్లరూపాయల్లో వ్యాపారం, ప్రతిష్ట, పౌరుషానికి చిహ్నం ఈ పందేలు

ఇలా ప్రతి సంక్రాంతి సీజన్ లో గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల వ్యాపారంగా మారుతాయి కోళ్లపందేలు. ప్రతి సారి డిసెంబర్‌ లాస్ట్ నుంచి జనవరి ఎండ్ వరకు ఈ పందేల జోరే ఉంటుంది. కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా

|

సంక్రాంతి తెలుగు వారందరికీ పెద్దపండుగ. అయితే గోదావరి జిల్లాల్లో మాత్రం కోడిపందేలు ఫేమస్. ఈ పందేలపై నిషేదం విధించిన కూడా కొనసాగుతూనే ఉన్నాయి.ఇక గతంలో కోడిపందేల విషయంలో ఒకటి హైలెట్ గా నిలిచింది. గోదావరి ప్రాంతం పందెం కోళ్లతో పాకిస్తాన్ కు చెందిన కోళ్లు పోటీపడ్డాయి.

Unknown Historical

చరిత్ర

గోదావరి ప్రాంతంలో కోడి పందేలు ఇప్పుడు మొదలైనవి కావు. కొన్ని వేల ఏళ్లుగా ఇక్కడ సంక్రాంతికి పందేలు నిర్వహించడం ఆనవాయితీ. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగానే ఇక్కడ కూడా కోడిపందేలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారింది.

6 వేల ఏళ్ల కిందటే

6 వేల ఏళ్ల కిందటే

మనదేశంలో 6 వేల ఏళ్ల కిందటే కోడిపందేలు మొదలయ్యాయి. పదహారవ శతాబ్దంలోనే కోడిపందేలు మొదలయ్యాయి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి.

యుద్దాలు జరిగాయి

యుద్దాలు జరిగాయి

కాక్‌ఆఫ్‌దిగేమ్‌ అనే బుక్ లో ఇలాంటి పందేల గురించి వివరించారు. ఇక మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలపై టోర్నీలు నిర్వహిస్తుంటారు.

గతంలో కోడిపందేల విషయంలో యుద్ధాలు కూడా జరిగాయి. పల్నాటి చరిత్రతో పాటు బొబ్బిలి యుద్ధంలోనూ కోడిపందేలకు సంబంధించిన అంశాలున్నాయి.

పాక్తిస్తాన్ బ్రీడ్

పాక్తిస్తాన్ బ్రీడ్

గతంలో కొందరు పాకిస్తాన్ నుంచి అక్కడికి సంబంధించిన కోళ్ల బ్రీడ్స్ ను తెప్పించుకుని వాటిని పందెంకోళ్లుగా తయారు చేశారు. అక్కడి కోళ్లు కూడా పందెంలో బాగా పోటీనివ్వడమే ఇందుకు కారణం.

ప్రతిష్ట

ప్రతిష్ట

కోడి పందేలను చాలా మంది తమ ప్రతిష్టగా భావిస్తారు. అందులో తమ కోడి ఓడిపోతే తమ పరువు పోయిందన్నట్లుగా భావిస్తారు. కోడి వీరోచితంగా పోరాడుతుంటే తమ పౌరుషానికి చిహ్నంగా భావించే చాలా మంది పందెంరాయుళ్లు ఉన్నారు గోదావరి జిల్లాల్లో.

బెట్టింగ్స్

బెట్టింగ్స్

పందేలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు వాటిపై బెట్టింగ్ కాసే వాళ్లు చాలా మంది ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో మొదలయ్యే పండుగ కోడిపందేలే. దాదాపు కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతుంటాయి.

Most Read :తెలుగువారు సంక్రాంతి ఎందుకు నిర్వహించుకుంటామో తెలుసా? భోగి,మకర సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యం ఇదేMost Read :తెలుగువారు సంక్రాంతి ఎందుకు నిర్వహించుకుంటామో తెలుసా? భోగి,మకర సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యం ఇదే

ఓడిపోయిన కోడికి కూడా

ఓడిపోయిన కోడికి కూడా

కోడిపందెంలో గెలిచిన కోడికి ఎంత ప్రత్యేకత ఉంటుందో.. అలాగే ఓడిపోయి చనిపోయిన కోడికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ఓడిపోయి చనిపోయిన కోడి మాంసాన్ని వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తారు.

పౌష్టికాహారం

పౌష్టికాహారం

ఇక పందెంకోళ్ల కోసం చాలానే ఖర్చు పెడతారు. లక్షలాది రూపాయలు వెచ్చించే వారు కూడా ఉన్నారు. వాటికి ప్రత్యేక పౌష్టికాహారం పెడతారు. అందుకే పందెంకోళ్ల మాంసం తినాలని చాలా మంది ఉవ్విళ్లూ ఊరుతుంటారు. అయితే తాము ఎంతో ముద్దుగా సాకిన కోడి మాంసాన్ని ఆ యజమాని మాత్రం తినడానికి ఇష్టపడడు.

పెద్దల ప్రమేయం

పెద్దల ప్రమేయం

ఈ పందేల నిర్వహణలో పొలిటికల్ లీడర్లతో పాటు చాలా మంది ప్రముఖుల హస్తం కూడా ఉంటుంది. అందుకే వాటిని అడ్డుకునే దమ్ము ఎవ్వరికీ ఉండదు. అంతేకాక ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం మేము దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తామంటారు గోదావరి వాసులు.

చాలా జాతులు

చాలా జాతులు

ఇక కొన్ని రకాల కోడి జాతులకు మంచి డిమాండ్ ఉంటుంది. దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై ఆపైన కూడా ధర పలుకుతాయి కొన్ని కోళ్లు. పచ్చకాకి జాతి కోడిపుంజులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ జాతి కోడిపుంజులు పోటీల్లో గెలుస్తాయని చాలా మంది నమ్మకం.

వేల రూపాయలు చెల్లించి

వేల రూపాయలు చెల్లించి

అలాగే డేగజాతి, నెమలి జాతి కోళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. రసంగి, అబ్రాస్ తో పాటు పలు రకాలా కోళ్ల జాతులను పోటీలకు ముందు పెంపకందారులకు వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తారు జనాలు.

తర్పీదులు

తర్పీదులు

పందెంకోళ్లను చాలా రకాల తర్పీదులు ఇస్తారు. వాటికి ఈత కూడా నేర్పిస్తారు. రోజూ చాలా రకాల పౌష్టికాహారాలు అందిస్తారు.

Most Read :మారీచుడు బంగారు లేడీలా ఎందుకు మారుతాడు, సీతను రావణుడు ఎత్తుకెళ్లేందుకు ఎందుకు సాయం చేశాడుMost Read :మారీచుడు బంగారు లేడీలా ఎందుకు మారుతాడు, సీతను రావణుడు ఎత్తుకెళ్లేందుకు ఎందుకు సాయం చేశాడు

ఉత్తరాంధ్ర జిల్లాల్లో

ఉత్తరాంధ్ర జిల్లాల్లో

గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కోడిపందేల జోరు హోరుగా ఉంటుంది. కొందరు నెల రోజుల ముందు నుంచే కోళ్ల

అమ్మకాలను ప్రారంభించారు.

ఆన్ లైన్ లో అమ్మకాలు

ఆన్ లైన్ లో అమ్మకాలు

కొన్ని ఆన్ లైన్ సైట్లలోనూ పందెంకోళ్ల అమ్మకాలు జోరుగాసాగుతున్నాయి. కోడి జాతిని బట్టి దాదాపు లక్ష రూపాయల వరకు పలికే కోళ్లు కూడా ఉండడం విశేషం. ఇలా పందేల కోసం కోళ్లను పెంచేవారు బాగానే సంపాదిస్తున్నారు.

Most Read :శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడుMost Read :శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడు

పార్టీల పేరుతో బరిలోకి

పార్టీల పేరుతో బరిలోకి

అయితే ఇప్పుడు కొందరు పందెంరాయుళ్లు కోడిపందేల పోటీలో కొత్త అంశానికి తెరదించారు. మా కోడి వైఎస్సార్సీపదని కొందరు, మాది తెలుగుదేశం పార్టీదని కొందరు, ఇక మాదేవో జనసేనకు చెందిన కోడి అని కొందరు కోళ్లను రణరంగంలోకి దింపుతున్నారు. తమ పార్టీల కోళ్ల గెలుపును ఆయా పార్టీల వారు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు.

సెంటిమెంట్స్..కుక్కుటశాస్త్రం

సెంటిమెంట్స్..కుక్కుటశాస్త్రం

కొందరు పందెందారులు కొన్ని రకాల సెంటిమెంట్స్ ను కూడా నమ్ముతుంటారు. కుక్కుటశాస్త్రాన్ని నమ్మే జనాలు చాలా మంది ఉంటారు. పేరును బట్టి రాశిని బట్టి మనుషుల జాతకాలను ఎలా అయితే చెబుతారో అలాగే కోడి యజమాని పేరు బట్టి, కోడి రంగు బట్టి దాని గెలుపోటములను నిర్ణయిస్తుంది కుక్కుట శాస్త్రం.

తిథి, ప్రదేశం

తిథి, ప్రదేశం

పందెం జరిగే రోజు ఉండే తిథి, ప్రదేశం ఇలాంటివాటన్నింటినీ ఆధారంగా చేసుకుని కోడిపందేల్లో ఏ కోడి గెలుస్తుందో చెబుతారు. ఇలా కోళ్ల జాతకాలపై కూడా కొందరికి బాగా నమ్మకం ఉంటుంది.

Most Read :గరుడ సంజీవని మనిషిని తిరిగి బతికిస్తుందా, సంజీవని మొక్క విశిష్టత, ఉపయోగాలుMost Read :గరుడ సంజీవని మనిషిని తిరిగి బతికిస్తుందా, సంజీవని మొక్క విశిష్టత, ఉపయోగాలు

ఈ పందేల జోరే ఉంటుంది

ఈ పందేల జోరే ఉంటుంది

ఇలా ప్రతి సంక్రాంతి సీజన్ లో గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల వ్యాపారంగా మారుతాయి కోళ్లపందేలు. ప్రతి సారి డిసెంబర్‌ లాస్ట్ నుంచి జనవరి ఎండ్ వరకు ఈ పందేల జోరే ఉంటుంది. కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా బెట్టింగ్స్ వేయడానికి వస్తుంటారు.

కోర్టులు వద్దంటున్నా

కోర్టులు వద్దంటున్నా

ఆల్రెడీ ఇప్పటికే కోడిపందేలపై బెట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ రెండురోజుల్లో జోరు ఇంకా పెరుగుతుంది. ఏదీఏమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కోర్టులు వద్దంటున్నా ఏటా మాత్రం కోడి పందేల జోరు కొసాగుతూనే ఉంటుంది. అనాదిగా వస్తున్నా ఆచారాన్ని రూపుమాపాలంటే అంత ఈజీకాదు మరి.

Most Read :మూడు జన్మల్లో విష్ణుమూర్తికి బద్ద శత్రువులుగా పుట్టిన వారు ఆయన కాపలావారే, జయవిజయల కథMost Read :మూడు జన్మల్లో విష్ణుమూర్తికి బద్ద శత్రువులుగా పుట్టిన వారు ఆయన కాపలావారే, జయవిజయల కథ

English summary

Unknown Historical Facts Behind sankranti pandem kollu Competitions in andhra pradesh

Unknown Historical Facts Behind Cockfight Competitions in andhra pradesh
Desktop Bottom Promotion