For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

22nd Kargil Vijay Diwas 2021:కార్గిల్ వార్ విజయంలో గొర్రెల కాపరి కీలకంగా ఎలా మారాడంటే...!

22వ కార్గిల్ విజయ్ దివాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

సరిగ్గా 22 ఏళ్ల క్రితం జులై 26వ తేదీన మన దేశ భూభాన్ని దొంగతనంగా ఆక్రమించుకోవాలనుకున్న పాకిస్థాన్ కు భారత సైన్యం గట్టి షాకిచ్చింది. ఆకాశం అంచున ఉన్న కొండలపై, ఎముకలు కొరికే చలిలో తమ సత్తా ఏంటో దాయది దేశానికి, ముష్కరులకు చాటి చెప్పింది.

22nd Kargil Vijay Diwas 2021: Interesting facts about Kargil War

సాధారణంగా చలికాలంలో సైన్యం తమ స్థావరాలను వదిలేసి వెచ్చగా ఉండే ప్రాంతాలకు తరలి వెళ్తుంటాయి. భారత సైన్యం కూడా ఎప్పటిలాగానే తమ బంకర్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఇదే అదనుగా భావించిన పాకిస్థాన్ భారతదేశాన్ని దొంగ దెబ్బ కొట్టాలనుకుంది.. వారి వ్యూహం ప్రకారం మన భూభాగంలోకి అదను చూసి చొచ్చుకొచ్చింది. అయితే పాకిస్థాన్ కుట్రలను పసిగట్టిన మన భారత సైనికులు వారిని చావు దెబ్బ కొట్టారు. మంచు కొండల్లో మాటు వేసి పాక్ సైనికులను మట్టుబెట్టేశారు.

22nd Kargil Vijay Diwas 2021: Interesting facts about Kargil War

కార్గిల్ యుద్ధంలో మన సైనికులు చేసిన అసమాన పోరాటమే భారత్ కు అద్వితీయమైన విజయాన్ని అందించింది. ఆ అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారతదేశం ప్రతి సంవత్సరం జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ రణభూమి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Kargil Vijay Diwas 2021 : దాయాదిని భారీ దెబ్బ కొట్టిన భారత్... రెపరెపలాడిన మువ్వన్నెల జెండా...Kargil Vijay Diwas 2021 : దాయాదిని భారీ దెబ్బ కొట్టిన భారత్... రెపరెపలాడిన మువ్వన్నెల జెండా...

రక్షణ పరంగా..

రక్షణ పరంగా..

కార్గిల్ ప్రాంతం రక్షణ పరంగా భారతదేశానికి అత్యంత కీలకమైన స్థావరం. దీన్ని కైవసం చేసుకుంటే లడఖ్ ను కైవసం చేసుకుని.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ను తమ వశం చేసుకోవాలన్నది పాక్ వ్యూహం.

భారత సైనికులు..

భారత సైనికులు..

ఈ ప్రాంతం నుండి పాక్ సైన్యానికి భారత సైనికులు సులభంగా కనిపిస్తారు. దీంతో మన సైనికులకు వారితో యుద్ధం చేయడం చాలా కష్టమవుతుంది. ఇది దాయాది దేశానికి అనుకూలంగా మారుతుందని వారు పన్నాగం పన్నారు.

మే నెలలో..

మే నెలలో..

అందులో భాగంగా పాక్ సైన్యం కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆ ప్రాంతం పాక్ సైన్యం చేతుల్లోకి వెళ్లిందన్న సంగతి భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికి కూడా తెలియదు. అయితే మే నెలలో గస్తీకి వెళ్లిన రెండు టీమ్ లు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో ఉన్నతాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ సౌరవ్ కాలియా సారథ్యంలో మరో టీమ్ ను పంపారు. వారు కూడా తిరిగి రాలేదు.

భారీ బలగాలతో..

భారీ బలగాలతో..

అప్పటి నుండి అనుమానం వచ్చిన భారత సైన్యం భారీ బలగాలతో కార్గిల్ ప్రాంతానికి వెళ్లింది. అదే ప్రాంతంలో ఓ గొర్రెల కాపరి ఎదురయ్యాడు. ఎవరు నువ్వు?.. ఇక్కడ ఏం పని అని జవాన్లు ప్రశ్నించగా.. తాను ఓ గొర్రెల కాపరినని.. తన పశువులలో ఒకటి తప్పిపోయిందని, దాన్ని వెతుక్కుంటూ వెళ్లానని చెప్పారు. అయితే అక్కడ కొందరు ఆయుధాలతో ఉన్న వ్యక్తులు తన పశువును చంపుకుని తిన్నారని చెప్పాడు.

బంకర్ల విషయాన్ని..

బంకర్ల విషయాన్ని..

అంతేకాదు అదే ప్రాంతంలో భారత సైనికులు దాదాపు 50 నుండి 60 మంది సైనికులు మరణించారని, వారంతా అక్కడి చచ్చిపడి ఉన్నారని చెప్పారు. దాంతో పాటు అక్కడ ఎంత మంది పాక్ సైన్యం సిబ్బంది ఉన్నారు.. ఎన్ని బంకర్లు ఉన్నాయనే విషయాన్ని పూర్తిగా చెప్పాడు. అతను ఇచ్చిన సమాచారంతో భారత సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

కార్గిల్ రహదారిని..

కార్గిల్ రహదారిని..

ముందుగా కార్గిల్ వైపు వెళ్లే రహదారిని మూసివేసి, పాక్ సైన్యానికి, ముష్కరులకు ఏమి చేరకుండా నిరోధించగలిగారు. నాటి ప్రధాని వాజ్ పేయ్ రక్షణ నిపుణులతో చర్చించి పాక్ కు ధీటైన వ్యూహాన్ని అమలు చేశారు. నేలపై ఉన్న సైన్యానికి, వాయుసేన పూర్తి అండగా నిలవగా.. బోఫోర్స్ ఫిరంగుల గర్జనకు పాకిస్థాన్ బెదిరిపోయింది.

రెండు నెలల పాటు..

రెండు నెలల పాటు..

అలా సుమారు రెండు నెలల పాటు భారత సైనికులు మొక్కవోని ధైర్యంతో శత్రుసైన్యాన్ని మట్టి కరిపించి కార్గిల్ ప్రాంతంలో మన జాతీయ జెండాను మళ్లీ రెపరెపలాడేలా చేశారు. ఈ యుద్ధంలో సుమారు 537 మంది జవాన్లు అమరులవ్వగా.. 1363 మంది క్షతగాత్రులయ్యారు. అందుకే ప్రపంచ చరిత్రలో కార్గిల్ వార్ ప్రత్యేకమైనది.

జై జవాన్..

జై జవాన్..

ఆ తర్వాత జులై 26వ తేదీ నాటికి కార్గిల్ పర్వతాలన్నీ మళ్లీ మన దేశ ఆధీనంలోకి తిరిగొచ్చాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జులై 26వ తేదీన ‘కార్గిల్ విజయ్ దివస్'గా జరుపుకుంటున్నాం. ఏదేమైనా తమ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశాన్ని కాపాడిన సైనికులందరికీ ఈ విజయం అంకితం.. జై జవాన్.. జై భారత్..

Read more about: insync pulse vijay diwas kargil
English summary

22nd Kargil Vijay Diwas 2021: Interesting facts about Kargil War

Here we are talking about the 22nd kargil vijay diwas 2021: Interesting facts about kargil war. Have a look
Story first published:Saturday, July 24, 2021, 11:39 [IST]
Desktop Bottom Promotion