Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
Rashi Parivartan 2022:మార్చిలో 3 గ్రహాల రవాణాతో ఈ రాశులకు శుభ ఫలితాలు...!
2022 సంవత్సరంలో మార్చి నెలలో నాలుగు గ్రహాలు తన దిశను మారనున్న సందర్భంలో ఈ రాశుల వారికి మంచి ప్రయోజనాలు.. మీ రాశి కూడా ఉందేమో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు మానవ జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. నవ గ్రహాలలోని మూడు గ్రహాలు మార్చి మాసంలో తమ స్థానాల నుండి మరో స్థానంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఈ సందర్భంగా రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

ముందుగా మార్చి 6వ తేదీ అంటే ఆదివారం నాడు బుధుడు తన స్థానాన్ని మారనున్నాడు. ఆ తర్వాత మార్చి 15వ తేదీన సూర్యుడు తన దిశను మార్చుకోనున్నాడు.

చివరగా మార్చి 31వ తేదీన శుక్రుడు కుంభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే శని దేవుడు మకరరాశిలో నివాసం ఉంటున్నాడు.

ఈ మూడు గ్రహాల రవాణా కారణంగా ద్వాదశ రాశులలోని నాలుగు రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

గ్రహాల రవాణా ఎప్పుడంటే..
మార్చి 2022లో 6వ తేదీ అంటే ఆదివారం నాడు బుధుడు మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ తర్వాత మార్చి 18వ తేదీన బుధుడు ఇదే రాశిలో అస్తమించనున్నాడు. ఆ తర్వాత మార్చి 24వ తేదీన బుధుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి రవాణా చేయనున్నాడు. మార్చి చివర్లో అంటే 31వ తేదీన శుక్రుడు కుంభ రాశిలోకి ప్రయాణించనున్నాడు.

మేష రాశి..
చతుర్గ్రాహి యోగం వల్ల మేష రాశి వారు విశేషమైన ఫలితాలను పొందనున్నార. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగ్గా ఉంటుంది. మీ పనితీరు ఎంతో బాగుంటుంది. మీరు చేసే ఉద్యోగాలలో పురోగతి కూడా ఉంటుంది. మీరు కోరుకున్న బదిలీ లేదా ప్రమోషన్ వంటివి రావొచ్చు. అంతేకాదు ఆర్థిక పరంగా వ్యాపారులకు ఆర్థిక పరమైన విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలోనూ సానుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల రవాణా వల్ల ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు దక్కనున్నాయి. వ్యాపారులకు ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితంలో కూడా సంతోషంగా ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ప్రమోషన్ రావడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ వైవాహిక జీవితంలో మరియు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు రావాల్సిన ఆర్థిక పరమైన బకాయిలన్నీ ఈ సమయంలో రావొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి చతుర్గ్రాహి యోగం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగులు సానుకూల ఫలితాలను పొందుతారు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇది కాకుండా, మీరు అనేక రంగాల నుండి ఆదాయాన్ని పొందే అవకాశాలున్నాయి. మీ ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. ఈ కారణంగా మీరు ప్రతి పనిని సులభంగా పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం మంచిగా ఉంటుంది.
మార్చి 2022లో 6వ తేదీ అంటే ఆదివారం నాడు బుధుడు మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ తర్వాత మార్చి 18వ తేదీన బుధుడు ఇదే రాశిలో అస్తమించనున్నాడు. ఆ తర్వాత మార్చి 24వ తేదీన బుధుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి రవాణా చేయనున్నాడు. మార్చి చివర్లో అంటే 31వ తేదీన శుక్రుడు కుంభ రాశిలోకి ప్రయాణించనున్నాడు.



Click it and Unblock the Notifications