For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలో నుండి గతంలోకెళ్లిన వ్యక్తి... ఏకంగా 21 ఏళ్లు వెనక్కి... మళ్లీ మెమొరీ గుర్తొచ్చిందా లేదా..?

|

ఇటీవలే మనం కలియుగ కుంభకర్థుడి గురించి విన్నాం.. తను సంవత్సరంలో దాదాపు 300 రోజుల పాటు నిద్రపోతాడని.. రాజస్థాన్ కు చెందిన ఆ వ్యక్తి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని.. తనను కుంభకర్ణుడికే అన్నగా అభివర్ణించిన విషయం గురించి చూశాం.

అయితే తాజాగా మరో వ్యక్తి కొత్త రికార్డు నెలకొల్పాడు. అతను మనలాగానే రోజు ఎలా నిద్రపోతారో అలాగే నిద్రపోయాడు. అంతవరకే బాగానే ఉన్నా.. నిద్రలేచిన తర్వాతే అసలు సమస్య ప్రారంభమైంది.

అందరి లాగా నిద్ర లేచిన అతను విచిత్రంగా ప్రవర్తించాడు. తను అచ్చం 16 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తూ.. అందరినీ ఇబ్బంది పెట్టాడు. తన భార్య, బిడ్డలను కూడా గుర్తుపట్టలేదట. అంతేకాదు కాలేజీకి వెళ్లే విద్యార్థిలా ఫీలయ్యాడట. ఇంతకీ అలా ఎలా జరిగింది.. ఈ సంఘటన ఎక్కడ.. ఎప్పుడు జరిగిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!

మెమొరీ లాస్..

మెమొరీ లాస్..

సాధారణంగా అయితే వయసు పెరిగే కొద్దీ జ్ణాపకశక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. వయసు పైబడ్డాక 50 లేదా 60 సంవత్సరాలు దాటాక మతిమరుపు అనేది సహజంగానే వస్తుంది. అయితే ప్రస్తుతం ఓ వ్యక్తికి కేవలం 47 ఏళ్ల వయసులోనే మెమొరీ పవర్ లాస్ అయ్యింది.

16 ఏళ్ల కుర్రాడిలా..

16 ఏళ్ల కుర్రాడిలా..

ఆ వ్యక్తి మనం రోజూ ఎలాగైతే రాత్రి నిద్రపోతామో అలాగే నిద్రపోయాడు. అయితే ఉదయం లేచి చూసేసరికి తను 21 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాడు. నిద్ర లేచిన తర్వాత తన కుటుంబ సభ్యులను కూడా మీరెవరు అని ప్రశ్నించాడట. అంతేకాదు తన వయసు 16 సంవత్సరాలని.. తనకు కాలేజీకి వెళ్లే సమయం అయ్యిందని మాట్లాడుతున్నాడట.

అద్దంలో చూసుకుని..

అద్దంలో చూసుకుని..

తను అద్దంలో చూసుకున్న తర్వాత తానేంటి ఇలా మారిపోయానని ఆశ్చర్యపోయాడంట. ఇంతకీ తనెవరంటే డానియల్ పోర్టల్. తను అమెరికా దేశంలోని టెక్సాస్ లో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే ఓ రోజు తను నిద్రలో నుండి లేచి ‘నేను ఇంత లావు ఎలా అయ్యాను.. నేనేంటి ఇంత పెద్ద వయసు ఉన్న వాడిగా కనిపిస్తున్నాను''అని తన భార్యబిడ్డలను అడిగాడట.

పంటి నొప్పితో రాత్రి నిద్ర పాడైపోతుందా? దీన్ని నివారించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి!పంటి నొప్పితో రాత్రి నిద్ర పాడైపోతుందా? దీన్ని నివారించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి!

ఎంత గుర్తు చేసినా..

ఎంత గుర్తు చేసినా..

కుటుంబసభ్యులు తనకు పెళ్లయ్యిందని భార్య, పిల్లలు ఇద్దరూ ఉన్నారని, ఎంత చెప్పినా.. ఏవేవో సంఘటనలు చెప్పి ఎంత గుర్తు చేసినా.. ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందట. అంతేకాదు.. తను ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లాడినని వారితో వాదించాడట.

తాగి వచ్చాడమో..

తాగి వచ్చాడమో..

ఈ నేపథ్యంలో తన భార్య ఓ వార్తా ప్రతినిధికి చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.‘నేను ఆరోజు ఉదయాన్నే నిద్ర లేచి చూసేరికి.. నేను ఎవరో తెలియనట్లు చూశాడు. దీంతో నేను చాలా గందరగోళానికి గురయ్యాను. మేము ఉన్న రూమ్ కూడా కనీసం గుర్తుపట్టలేదు. బాగా తాగేసి ఇంటికొచ్చాడేమో.. మత్తు ఇంకా దిగలేదేమో అని భావించాను. అయితే తను గది నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు.

అన్నీ మరచిపోయాడు..

అన్నీ మరచిపోయాడు..

ఆ తర్వాత తనకు నేను తన భార్యనని.. మనకు పిల్లలు ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ తను మాత్రం ఇంకా 90వ శతాబ్దంలో ఉన్నట్లు ఫీలవుతున్నాడు. ముందుగా అద్దం చూసుకుని నేనేంటి ఇంత లావుగా, వికారంగా ఉన్నానని మాపై కోప్పడ్డాడు. ఆయన ఒక హియరింగ్ స్పెషలిస్ట్. కానీ తను మాత్రం చదువు, ఉద్యోగం, ఇతర విషయాలన్నీ మరచిపోయాడు. దీంతో తనను హాస్పిటల్ కు తీసుకెళ్లాం' అని రుత్ తెలిపారు.

అరుదైన వ్యాధి..

అరుదైన వ్యాధి..

తనను పూర్తిగా పరీక్షించిన వైద్యులు.. తను ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారట. దీన్నే ‘షార్ట్ టర్మ్ మెమొరీ లాస్' అని కూడా అంటారని చెప్పారు. తనకు ఇదంతా 24 గంటల్లో సర్దుకుంటుందని.. అయితే ఈ సమస్య వల్ల డానియల్ ఏకంగా 21 ఏళ్లు వెనక్కి వెళ్లడం.. ఆశ్చర్యానికి గురి చేసింది. మరీ విచిత్రం ఏంటంటే.. తన మెమొరీ లాస్ వల్ల ఏమి తినాలనే విషయాలను కూడా మరచిపోయాడు. తన అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇదంతా జరిగి సుమారు ఆరు నెలలు కావస్తోంది. ఇప్పుడిప్పుడే తనకు అన్నీ మెల్లగా గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం అతడు థెరపీకి వెళ్తున్నాడు.

English summary

37-Year-Old Man Wakes Up And Thinking He's 16 in Telugu

Here we are talking about the 37 year old man wakes up and thinking he's 16 in Telugu. Have a look