Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హైదరాబాద్‌లో చిన్నారిని చంపేసిన వీధికుక్కలు, శునకాల నుండి పిల్లలను ఇలా కాపాడుకోండి
ఒంటరిగా వెళ్తున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. వీధి కుక్కల నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒంటరిగా వెళ్తున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. అంబర్ పేట్ లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

హైదరాబాద్ అంబర్ పేట్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తన తండ్రితో కలిసి ఇంటికి దగ్గర్లోని పని చేసే చోటుకు వెళ్లాడు. కాసేపటికి తండ్రి పనిలో నిమగ్నం కాగా.. ప్రదీప్ అక్కడి నుండి అక్క దగ్గరకు వెళ్లేందుకు బయల్దేరాడు. ఇంతలో వీధి కుక్కలు ప్రదీప్ ను చుట్టుముట్టాయి. వాటి నుండి పారిపోయందుకు ప్రయత్నించినా అవి వదల్లేవు. ప్రదీప్ ను కిందపడేసే కాలు, చేతులు నోట కరిసి అటు ఇటు లాగాయి. శరీరమంతా తీవ్రంగా కరిచాయి. ఆదివారం కావడంతో ఆ ప్రాంతంలో ఎవరూ లేక నిర్మానుష్యంగా ఉంది. ప్రదీప్ తండ్రి అక్కడికి పరిగెత్తుకు వచ్చేలోపే ప్రదీప్ ఒంటి నిండా గాయలయ్యాయి. కుక్కలను విధిలించి ప్రదీప్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి ప్రదీప్ అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.

కుక్కల నుండి పిల్లలను కాపాడుకోవడం ఎలా:
సిటీ, గ్రామాలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు బెడద చాలా మందిని వేధిస్తోంది. ప్రతి కాలనీలో కుక్కలు వచ్చిపోయే వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాయి. అయితే కుక్కల నుండి పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా ముప్పు పొంచి ఉంది. నాలుగైదు కుక్కలు కలిసి మీద పడితే ఏమీ చేయలేని పరిస్థితి. తీవ్రగాయాలతో ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సి వస్తుంది.
వీధి కుక్కల నుండి పిల్లలను కాపాడుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- వీధి కుక్కలు ఉన్న చోట్లకు ఒంటరిగా వెళ్లొద్దని మరీ మరీ చెప్పాలి. ఎవరైనా తోడు ఉంటేనే ఆ వీధిగుండా వెళ్లమని చెప్పాలి.
- వీధి కుక్కల దగ్గరకు వెళ్లొద్దని, వాటికి ఆహారం ఇవ్వొద్దని హెచ్చరించాలి.
- పెంచుకునే కుక్కలు కూడా ఒక్కోసారి వైల్డ్ గా ప్రవర్తిస్తాయి. అలాంటి సమయంలో వాటికి దూరంగా ఉండటం మంచిది.
- పెంచుకునే కుక్కల వద్దకు వెళ్లే ముందు దాని యజమానిని అడగనిదే దగ్గరికి వెళ్లొద్దు.
- తన ప్రాంతంలో ఉన్న కుక్కల వద్దకు వెళ్లొద్దు.
- కుక్కలు ఆహారం తింటున్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేయొద్దని పిల్లలకు చెప్పాలి.
- కుక్కలు వాటి పిల్లలతో ఉన్నప్పుడు, అప్పుడే పిల్లలకు జన్మనిచ్చినప్పుడు వాటి జోలికి వెళ్లొద్దని చిన్నారులను హెచ్చరించండి.
- కుక్కలతో ఎలా వ్యవహరించాలో పిల్లలకు నేర్పించాలి. తోక లాగడం, వాటిని గిల్లడం, వాటిపైకి ఎక్కడం లాంటివి చేయొద్దని వారించాలి.
- కుక్కలు మొరుగుతున్నప్పుడు అక్కడి నుండి పరిగెత్తకుండా నెమ్మదిగా నడవాలని సూచించండి. పరిగెత్తితే వెంట పడతాయని చెప్పండి.
- కుక్కలు చుట్టుముట్టినప్పుడు గట్టిగా అరుస్తూ ఎవరినైనా సహాయం అడగాలని చెప్పండి.
- ఒకటికి మించి కుక్కలు దాడి చేయడానికి మీదకు వస్తే.. ముడుచుకుని కూర్చోవాలని చెప్పండి. మోకాళ్లు, చేతులతో ముఖాన్ని కాపాడుకోవాలని చెప్పాలి.



Click it and Unblock the Notifications