For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

75th Independence Day :స్వాతంత్య్ర దినోత్సవం గురించి ఎంత మందికి తెలుసు?

స్వాతంత్య్ర దినోత్సవం గురించి ఈ విషయాలు ఎంతమందికి తెలుసో ఇప్పుడు చూద్దాం.

|

మన భారతదేశం ఈ ఆగస్టు 15వ తేదీ నాటికి 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1947 ఆగస్టు 15వ తేదీ అర్థరాత్రి ఆంగ్లేయులు మన దేశానికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ.. స్వాతంత్య్రం ఇస్తున్నట్టు ప్రకటించిన సందర్భం. ఆ సమయం నుండి నవ భారతంలో కొత్త ఆశలు మరియు కొత్త కలలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుత జనరేషన్ వారికి ఈ నవ భారతదేశం గురించి మరియు దీని చరిత్ర గురించి ఏ మాత్రం అవగాహన ఉంది? అసలు మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి కారణమేంటి? స్వాతంత్య్ర దినోత్సవం 1947కి ముందు మరియు తర్వాత ఉన్న పరిస్థితులేంటి అనే విషయాల గురించి బోల్డ్ స్కై తెలుగు తరపున మేం కొన్ని ప్రశ్నలను తీసుకొచ్చాం.

74th Independence Day Quiz: How Much Do You Know About India?

మీరు ఈ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పాటు వందకోట్లకు పైగా ఉన్న మన దేశంలో ఉన్న వారిలో భారతదేశం గురించి.. స్వాతంత్య్రం గురించి ఎంత మేరకు అవగాహన ఉందో తెలుసుకోవడానికి వారితో ఈ ప్రశ్నలను షేర్ చేసుకోండి..

ఇక అసలు విషయానికొస్తే.. ఈ స్వాతంత్య్ర దినోత్సవం 2020 క్విజ్ సందర్భంగా మన చరిత్రలోని వాస్తవాలను తెలుసుకోండి... మన నిజమైన హీరోలు మరియు వారి విజయాల గురించి తెలుసుకోండి... చివరగా సమాధానాలను గుర్తించం మాత్రం మరచిపోకండి సుమా...!

స్వాతంత్య్ర దినోత్సవం 2020 క్విజ్ ప్రశ్నలు...

1) భారతదేశంలో లైసెన్సు పొందిన ఏకైక జెండా ఉత్పత్తి యూనిట్ ఏది?
ఎ) కర్నాటక ఖాదీ గ్రామ యోడగ సంయుక్త సంఘం
బి) ధావణగిరి చెరకా ఖాదీ గ్రామ యోడ సంఘం
సి) ధార్వాడ్ జిల్లా ఖాదీ గ్రామ యోడ సంఘం
డి) శ్రీ నంది ఖాదీ గ్రామయోధ్య సంఘం

2) భారతదేశ జాతీయ జెండాను మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ ఎగురవేశారు?
ఎ) ఆగస్టు 7, 1906, కోల్ కత్తాలోని పార్సీ బాగన్ స్క్వేర్ వద్ద
బి) ఆగస్టు 8, 1906, ఢిల్లీలోని ఎర్రకోట వద్ద
సి) ఆగస్టు 9, 1906, ముంబైలోని గేట్ ఆఫ్ ఇండియా వద్ద
డి) ఆగస్టు 10, 1906, పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ వద్ద

3) భారత జాతీయ గీతం రచయిత ఎవరు?
ఎ) రవీంద్రనాథ్ ఠాగూర్
బి) వల్లభాయ్ పటేల్
సి) బంకీ చంద్ర ఛటర్జీ
డి) సుభాష్ చంద్రబోస్

4) స్వతంత్ర భారతదేశ మొదటి అధ్యక్షుడు ఎవరు?
ఎ) మహాత్మగాంధీ
బి) డాక్టర్ ఎస్ రాధాక్రిష్ణన్
సి) డాక్టర్ రాజేంద్రప్రసాద్
డి) పండిట్ జవహర్ లాల్ నెహ్రు

5) భారతీయ త్రివర్ణ అశోక్ చక్రం దేనిని సూచిస్తుంది?
ఎ) చట్టం యొక్క చక్రం లేదా ధర్మం
బి) మతం యొక్క చక్రం
సి) క్రిష్ణ చక్రం
డి) అద్రుష్ట చక్రం

6) 'స్వరాజ్యం నా జన్మ హక్కు' అనే నినాదాన్ని ఎవరు రూపొందించారు?
ఎ) మహాత్మగాంధీ
బి) లాల్ బహదూర్ శాస్త్రి
సి) బాల గంగాధర్ తిలక్
డి) పండిట్ జవహార్ లాల్ నెహ్రు

7) రాజ్యాంగ సభ జాతీయ గీతంగా 'జన గణ మన' ఏ సంవత్సరంలో స్వీకరించబడింది?
ఎ) 1950
బి) 1947
సి) 1952
డి) 1931

8) భారత పార్లమెంట్ భవనాన్ని ఎవరు రూపొందించారు?
ఎ) హఫీజ్ కాంట్రాక్టర్ & హిమాన్షు పరిఖ్
బి) ఆక్సెల్ హేగ్ & ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్
సి) సర్ ఎడ్విన్ లుటియెన్స్ & సర్ హెర్బర్ట్ బేకర్
డి) హెన్రీ ఇర్విన్ & శామ్యూల్ స్వింటన్ జాకబ్

9) మొదటి భారతరత్న అవార్డు గ్రహీతలు ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రు&సర్దార్ పటేల్
బి) మహాత్మగాంధీ & మదర్ థెరిసా
సి) సి.రాజగోపాలచారి, సర్వేపల్లి రాధాక్రిష్ణన్&సివి రామన్
డి) రాజేంద్రప్రసాద్, జాకీర్ హుస్సేన్&పాండు రంగ్ వామన్ కేన్

10) మొదటి భారత జాతీయ సైన్యం స్థాపించబడింది
ఎ) భగత్ సింగ్
బి) కెప్టెన్ మోహన్ సింగ్
సి) సుభాష్ చంద్రబోస్
డి) వల్లభాయ్ పటేల్

11) మహాత్మగాంధీ ప్రారంభించిన మొదటి ప్రజా ఉద్యమం?
ఎ) సహకారేతర ఉద్యమం
బి) ఉప్పు ఉద్యమం
సి) భారతీయ ఉద్యమం
డి) ఇండిగో ఉద్యమం

12)నిరాహార దీక్ష చేస్తూ, జైలులో మరణించిన స్వాతంత్య్ర సమరయోధుడు
ఎ) భగత్ సింగ్
బి) బిపిన్ చంద్రపాల్
సి) జతీంద్ర నాథ్ దాస్
డి) సుభాష్ చంద్రబోస్

13)'డూ ఆర్ డై' అనే శక్తివంతమైన నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
ఎ) మహాత్మ గాంధీ
బి) జవహార్ లాల్ నెహ్రు
సి) బాల గంగాధర్ తిలక్
డి) సుభాష్ చంద్రబోస్

ముందుగా భారతీయులందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!

English summary

75th Independence Day Quiz: How Much Do You Know About India?

India is celebrating the 74th Independence Day on 15th August 2020. The country is currently under a wave of new hopes and dreams, just like it was on 15th August 1947, when it gained independence from the British Raj at the stroke of midnight. But how much does the new India, the new generation know about the country?
Desktop Bottom Promotion