For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

75th Independence Day:ఈ పంద్రాగస్టు వేడుకలను గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే...

|

కరోనా వైరస్ మూడో దశ ముప్పు కారణంగా భారతదేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అదనపు భద్రతతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాధారణంగా పంద్రాగస్టు పండుగ వచ్చిందంటే ప్రతి ఏటా మువ్వన్నెల జెండాను ఎగురవేసి కొత్త బట్టలు వేసుకుని.. పాఠశాల, కళాశాల, కార్యాలయాలు ఇంకా ఇతర చోట్ల మనం పంద్రాగస్టు పండుగ చేసుకుంటాం. అయితే ఈ పరిస్థితులు ఇప్పుడు కనబడటం లేదు.

ఈ నేపథ్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను 15 ఆగస్టు 2021న ఈ మార్గాల్లో జరుపుకోవచ్చు. ఈ మార్గాల ద్వారా జెండా పండుగ వేడుకలను జరుపుకుంటే.. మీరు కోవిద్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు..

స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర గురించి తెలుసా...

త్రివర్ణ పోటీ..

త్రివర్ణ పోటీ..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ఇంటి వద్ద బయటకు వెళ్లకుండా జెండా పండుగ వేడుకలను జరుపుకోవడానికి ఇదొక ఉత్తమ మార్గం. పోటీలో భాగంగా ఒక పూల కుండా లేదా పెన్ స్టాండ్ మరియు త్రివర్ణంలో వేరొకటి అలంకరించడం లేదా త్రివర్ణ సమిష్టిలో సిద్ధంగా ఉండటం కావొచ్చు. మీరు మీ పొరుగువారిని, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను కూడా త్రివర్ణంతో కూడిన కొన్ని వంటకాలను సిద్ధం చేయమని అడగొచ్చు. మీరు పోటీ కోసం మీ స్థలంలో మీ స్నేహితులు లేదా బంధువులను కూడా ఆహ్వానించొచ్చు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన భద్రతలు తీసుకుంటున్నట్లు నిర్ధారించుకోండి.

దేశభక్తి సినిమాలు..

దేశభక్తి సినిమాలు..

మీకు సినిమాలంటే బాగా ఇష్టమైతే.. మీరు పంద్రాగస్టు వేడుకల సందర్భంగా దేశభక్తి సినిమాలను చూడండి. స్వాతంత్య్ర పోరాటం మరియు బ్రిటీష్ కాలం నుండి మన స్వాతంత్య్ర సమరయోధులు ఎలా పోరాడారో తెలుసుకునేందుకు చాలా సినిమాలు ఉన్నాయి. రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్ మరియు మరెన్నో సినిమాలు రూపొందించబడ్డాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఉన్న వాటిని చూడొచ్చు.

ముగ్గుల పోటీలు..

ముగ్గుల పోటీలు..

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ముగ్గుల పోటీలు కొంచెం కష్టమే. కానీ మీరు లాక్ డౌన్ వల్ల విసుగు చెంది.. కొంత మార్పు కోసం చూస్తున్నట్లయితే.. మీ అపార్ట్ మెంట్లో లేదా మీ ప్రాంతంలో మీ బంధువులతో, స్నేహితులతో ముగ్గుల పోటీలు నిర్వహించొచ్చు. మీరు వర్చువల్ రంగోలి పోటీలను కూడా నిర్వహించొచ్చు. గెలిచిన వారికి మంచి బహుమతిని కూడా ఇవ్వొచ్చు.

దేశభక్తి పాటలపై అంతాక్షరి..

దేశభక్తి పాటలపై అంతాక్షరి..

సాధారణంగా మనం అప్పుడప్పుడు అంతాక్షరి ఆడుతూ ఉంటాం. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి గీతాలపై అంతాక్షరి ఆడండి. ఇది చాలా ఆసక్తికరంగా మరియు ఆనందకరంగా ఉంటుంది. ఒకవేళ మీకు పాట పాడటం ఇష్టం లేకపోతే.. స్వాతంత్య్ర సమరయోధుల గురించి క్విజ్ పోటీలను నిర్వహించండి.

గుర్తుండిపోయే పెయింట్..

గుర్తుండిపోయే పెయింట్..

మీరు లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండిపోయారని మాకు తెలుసు. అందుకే మీకు ఈ పంద్రాగస్టు సమయంలో బోర్ కొట్టకుండా ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించండి. ఉదాహరణకు 15 ఆగస్టు 2021 త్రివర్ణ పతాకాన్ని లేదా రంగులను మీ టీషర్టుపై పెయింట్ చేయండి లేదా మీ కుటుంబ ఫొటో లేదా మీ పెంపుడు కుక్క చిత్రాన్ని కూడా పెయింట్ చేయొచ్చు.

సెల్ఫీ ఛాలెంజ్..

సెల్ఫీ ఛాలెంజ్..

సోషల్ మీడియాలో వివిధ ఛాలెంజ్ లు విసురుతూ ఉంటారు. వాటిని స్వీకరించాలని కోరుకుంటారు. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ స్నేహితులకు త్రివర్ణ థీమ్ లో వారి సెల్ఫీలను అప్ లోడ్ చేయడానికి సవాళ్లు ఇవ్వడం గురించి మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఇండిపెండెన్స్ కు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా చేయమని వారిని అడగొచ్చు. ఉదాహరణకు వారు ఏదైనా సంభాషణపై పెదవి విప్పొచ్చు.

పైన పేర్కొన్న అంశాలే కాకుండా, నిరుపేదలు మరియు వెనుకబడిన తరగతుల వారికి సహాయం చేయడం గురించి కూడా మీరు ఆలోచించొచ్చు. ఈ మార్గాలతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గుర్తుండిపోయే విధంగా జరుపుకోవడానికి ఈ మార్గాలు సహాయపడతాయి.

English summary

75th Independence Day: Ways To Celebrate Independence Day Amid Covid-19 Pandemic

Here we are talking about the 75th independence day: ways to celebrate independence day amid covid19 pandemic. Read on
Story first published: Friday, August 13, 2021, 11:52 [IST]