Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొద్దిరోజుల్లో సూర్యగ్రహణం.. ఈ 4 రాశుల వారికి అద్భుత ఫలితాలు..!
వచ్చే నెలలో సూర్యగ్రహణం కారణంగా ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయట. ఈ జాబితాలో మీరాశి కూడా ఉందేమో చూసెయ్యండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో ఏర్పడనుంది. ఈ కారణంగా దీనికి చాలా ప్రాముఖ్యత పెరిగింది.

హిందూ పంచాంగం 2022 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన బుధవారం అర్థరాత్రి 12:15 గంటలకు ప్రారంభం కానుంది. మే 1వ తేదీన శుక్రవారం తెల్లవారు జామున 4:07 గంటల వరకు కొనసాగనుంది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే అయినప్పటికీ, ఈ సూర్య గ్రహణం ప్రభావం ద్వాదశ రాశులపై పడనుంది.

ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానుండగా.. మరికొన్ని రాశుల వారికి మాత్రం సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది ఏర్పడబోయే పాక్షిక సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారు ఈ సమయంలో ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
వచ్చే నెలలో ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడబోయే సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీ ప్రతిభను చూపేందుకు మంచి అవకాశం కూడా వస్తుంది. మీరు ఈ ఛాన్స్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.

తుల రాశి..
ఈ ఏడాదిలో ఏర్పడబోయే తొలి పాక్షిక సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొన్ని మంచి అవకాశాలను పొందొచ్చు. భాగస్వామ్యంతో పని చేసే వారికి వ్యాపారంలో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు రావొచ్చు. మీరు లక్ష్య సాధనలో విజయం సాధించే అవకాశం ఉంది.

ధనస్సు రాశి..
ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి చాలా సందర్భాల్లో మంచిగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేసే వారు మంచి లాభాలను పొందొచ్చు. మరోవైపు వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేక అవకాశాలను వెతుక్కుంటారు.
గమనిక : మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో ఏర్పడనుంది. ఈ కారణంగా దీనికి చాలా ప్రాముఖ్యత పెరిగింది. హిందూ పంచాంగం 2022 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన బుధవారం అర్థరాత్రి 12:15 గంటలకు ప్రారంభం కానుంది. మే 1వ తేదీన శుక్రవారం తెల్లవారు జామున 4:07 గంటల వరకు కొనసాగనుంది. ఈ సూర్య గ్రహణం ప్రభావం ద్వాదశ రాశులపై పడనుంది.



Click it and Unblock the Notifications