Latest Updates
-
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే..
ఏ రాశుల వారు రాగి ఉంగరాన్ని ధరించకూడదు.. ఎవరు ధరిస్తే శుభఫలితాలొస్తాయో తెలుసా...
ఈ రాశుల వారు రాగి ఉంగరాన్ని అస్సలు ధరించకూడదట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల ఆధారంగా ద్వాదశ రాశుల వారి జీవితం ఆధారపడి ఉంటుంది. గ్రహాల మార్పుల వల్ల రాశిచక్రాల జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి ఒక్క లోహానికి, ఏదో ఒక గ్రహంతో సంబంధం అనేది కచ్చితంగా ఉంటుంది. అందులోనూ రాగికి ప్రత్యేక స్థానముంది. పూర్వ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు రాగి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

రాగి పాత్రలో నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతారు. రాగి పాత్రలో వండిన వంటలను తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. రాగిని వాడితే మన బాడీ శుద్ధి అవుతుంది. ఎందుకంటే రాగిని ధరించడం వల్ల బాడీలోని అన్ని టాక్సిన్స్ తొలగిపోతాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. రాగి మూలకం సూర్యుడు, అంగారక గ్రహాలకు సంబంధించినది. అందుకే రాగి లోహాలను ఎక్కువగా పూజ సమయాల్లో ఉపయోగిస్తుంటారు.

ఈ సందర్భంగా రాగి పాత్రలను ఉపయోగించే ముందు, అందుకు సంబంధించిన ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకోవాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ద్వాదశ రాశులలోని ఈ మూడు రాశుల వారు రాగి లోహం ఉండే ఉంగరాన్ని అస్సలు ధరించకూడదట. పొరపాటున మీరు రాగి ఉంగరాన్ని ధరిస్తే తీవ్ర నష్టాలు వచ్చే అవకాశముంది. అయితే కొన్ని రాశుల వారికి రాగి ఉంగరం ధరించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారు రాగి ఉంగరాన్ని ఎప్పటికీ ధరించకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభ రాశి..
ఈ రాశి వారు రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అశుభ ఫలితాలొస్తాయి. మీరు పొరపాటున ఈ ఉంగరాన్ని ధరిస్తే, ప్రతి పనిలోనూ విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో నష్టాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూల వాతావారణం ఏర్పడొచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు రావొచ్చు.

కన్య రాశి..
ఈ రాశి వారు రాగి లోహం ఉన్న ఉంగరాన్ని అస్సలు ధరించకూడదట. పొరపాటున రాగి ఉంగరం ధరిస్తే, మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంగారంతో కలిపి రాగిని ధరించడం వల్ల కన్య రాశి వారికి కోపం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారు రాగి ఉంగరాన్ని ధరిస్తే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే పూజ చేసేటప్పుడు మాత్రం రాగి లోహాలను ఉపయోగించొచ్చు.

ఎవరు ధరించాలంటే..
ఈ రాశుల వారు రాగి ఉంగరాన్ని ధరిస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. వీరు రాగిలో స్వచ్ఛత ఉండి.. బంగారంతో కలిపి ధరిస్తే మంచి ఫలితాలొస్తాయి. ముఖ్యంగా కోపంగా ఉండే వారు రాగిని తెలివిగా ధరించాలి.
ఈ రాశుల వారు ఉంగరపు వేలికి రాగి ఉంగరాన్ని ధరించాలి. ఇది సూర్యుడు, చంద్రుడు రెండింటినీ బలంగా ఉన్నట్లు సూచిస్తుంది. అంతేకాదు ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ధైర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇక మిగిలిన రాశుల వారు సాధారణ రాగి ఉంగరాన్ని ధరిస్తే సరిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంగరాలను ధరించడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

రాగి లోహం వల్ల..
రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల బాడీలో రక్త సరఫరా మెరుగ్గా పని చేస్తుంది. రాగిని ధరించడం వల్ల సూర్య గ్రహం బలపడుతుంది. అంతేకాదు రాగి పాత్రలను వాడటం.. అందులోని వంటకాలను తినడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. బాడీలోని టాక్సిన్లు అన్నీ తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications