Latest Updates
-
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి!
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
ఇంట్లో చేయకూడని పనుల విషయానికి వస్తే వివాహితలు కొన్ని రకాల పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం, జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం కొందరు కొన్ని పనులు చేయకూడదు. ఆయా పనులు చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దరిద్రం వస్తుంది. అందుకే శాస్త్రాలు కొన్ని సూచనలు చేశాయి. వాటి ప్రకారం పురుషులు కొన్ని పనులు, మహిళలు కొన్ని పనులు చేయొద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. వాస్తు ప్రకారం, జ్యోతిషశాస్త్రం ఏయే పనులు చేయొద్దో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇంట్లో చేయకూడని పనుల విషయానికి వస్తే వివాహితలు కొన్ని రకాల పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు ఇంట్లో చేయకూడని పనులు:
స్త్రీలు ఇంటి దీపాలు. అంటే దారి చూపే మార్గదర్శకులు. సలహాలు ఇచ్చే మంత్రులు. భర్త, పిల్లల బాగోగులు వారే చూసుకుంటారు. వారు తప్పులు చేయకుండా నిలువరించడం కూడా భార్యల పనే. పిల్లలు, భర్త మంగళవారం క్షవరం తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్త్రీలదే. అలాగే స్త్రీలు నల్లని దుస్తులు ధరించకూడదు. మంచి పనులను శుక్ల పక్షంలో తలపెట్టాలి. అంటు అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు ఉండే రోజులను శుక్లపక్షం రోజులు అంటారు. మంచి పనులను ఆయా రోజుల్లో చేస్తే మంచి జరుగుతుంది.
ఉదయం వేళ, సంధ్యా సమయాల్లో..
ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.
ఆ సమయంలో ఉతికినవి వాడకూడదు:
నెలసరి సమయంలో స్త్రీలు పూజాది కార్యక్రమాలు చేయకూడదు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే నెలసరి సమయంలో ఉతికిన బట్టలను పూజాది కార్యక్రమాలకు వేసుకోకూడదు. అలాగే సాయంత్రం దాటిన తర్వాత ఉప్పు, మిరప, చింతపండు, ఆవకాయలను ఇంటి బయటి వ్యక్తులకు ఇవ్వకూడదు.
జుట్టుతో జాగ్రత్త:
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగకూడదు. ఉదయం, పగలు, రాత్రి ఏ వేళలోనూ జుట్టు వేసుకోకుండా ఇంట్లో తిరగొద్దు. ఇలా చేయడం ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆ కారణంగా ఇంటి సభ్యుల మధ్య కలహాలు వస్తాయి. ప్రశాంతత కోల్పోతారు.
ఇంటిని ఈ సమయాల్లో శుభ్రం చేయొద్దు:
మంగళ, శుక్ర వారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు. ఇంట్లో పేరుకుపోయిన బూజు, దుమ్మును మంగళ, శుక్రవారాల్లో తీసివేయకూడదు.
ఈ పదాలు పలకొద్దు:
స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి. కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు. శని, పీడ, దరిద్రం, పీనుగ వంటి పదాలను స్త్రీలు ఏ సమయాల్లోనూ పలకకూడదు. ఇలాంటి పదాల వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications