Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Chanakya Niti: ఈ విషయాల్లో పురుషుల కంటే స్త్రీలకు కోరికలెక్కువ.. కానీ బయటపడరంతే..
పురుషులతో పోలిస్తే మహిళలకు కొన్ని విషయాల్లో కోరికలు ఎక్కువగా ఉంటాయని ఆచార్యుడు చెప్పాడు. కానీ వాటి గురించి ఎప్పుడూ బయటకు చెప్పరని కూడా తెలిపాడు. చాణక్యుడు వేటి గురించి అలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప మార్గదర్శకుడు. ఆయన బోధనలు, సూచనలు నేటికీ అనుసరణీయమే. ఆచార్య చాణక్యుడు తన వ్యూహాలతో చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు. అర్థశాస్త్రం లాంటి మహా గ్రంథం రచించడం ద్వారా కౌటిల్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మనిషి జీవితంలో గురించి చెప్పిన ఎన్నో విషయాల సంకలనమే చాణక్య నీతి గ్రంథం. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలి, జీవితంలో విజయం ఎలా సాధించాలి. తలపెట్టిన పనిలో ఫలితం ఎలా పొందాలి, సంబంధాల్లో సంతోషంగా ఎలా ఉండాలో చెప్పాడు. ఆచార్య చాణక్యుడు మహిళల గురించి కొన్ని విషయాలు చెప్పాడు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం స్త్రీలు క్లిష్టమైన వారు. కొన్నిసార్లు వారు ఆలోచించేది, వారు చెప్పేది వేర్వేరుగా ఉంటాయని చెప్పాడు చాణక్యుడు. పురుషులతో పోలిస్తే మహిళలకు కొన్ని విషయాల్లో కోరికలు ఎక్కువగా ఉంటాయని ఆచార్యుడు చెప్పాడు. కానీ వాటి గురించి ఎప్పుడూ బయటకు చెప్పరని కూడా తెలిపాడు. చాణక్యుడు వేటి గురించి అలా అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీణాం ద్విగుణ ఆహారో లజ్జ చాపి చతుర్గుణా|
సాహసం షడ్గుణం చైవ కామశ్చాష్టగుణః స్మృతః||
పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఆకలి వేస్తుందని చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు. తెలివి నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. ఆచార్యుడు ఈ శ్లోకంలో స్త్రీ యొక్క అనేక లక్షణాలను వివరించాడు.
ఆకలి ఎక్కువ:
పురుషుల కంటే మహిళలకు ఆహారం ఎక్కువ అవసరమవుతుందని, ఎందుకంటే వారు పురుషుల కంటే ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. పురాతన కాలం నుండి మహిళలు ఇంట్లో పనులన్నీ చక్కబెడుతూ వస్తున్నారు. నేటికీ ఆ ధోరణిలో పెద్దగా మార్పులేవీ లేవు. పురుషులు బయట పని చేస్తే.. స్త్రీలు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వంటపాత్రలు కలిగి పడుకునే వరకు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. పిల్లల ఆలనా పాలనా, ఇంటి పనులు, వంట పనులు, ఇంటి పరిశుభ్రత, బట్టలు ఉతకడం, వంట చేయడం, వంట పాత్రలు కడగడం, అత్తామామలను చూసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనుల్లో మహిళలు నిమగ్నమవుతారు.
అలాగే శరీరంలోనూ స్త్రీ వ్యవస్థ పురుషుల కంటే ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ఇంతగా శ్రమించే వారికి సాధారణంగా శక్తి కూడా ఎక్కువగా కావాల్సి ఉంటుందని, అందుకే ఆకలి ఎక్కువగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.
ధైర్యం ఎక్కువ:
పురుషుల కంటే స్త్రీలకు ధైర్యం ఎక్కువ. చాలా విషయాల్లో వాళ్లు భయపడతారేమో, బొద్దింకను చూస్తూ అరవడం, చీకట్లో నడవడానికి భయపడటం, వీధి కుక్కలను చూసి పరిగెత్తడం లాంటి మహిళలు చేస్తారు కావొచ్చు. కానీ వారికి ఇష్టమైన విషయంలో, కావాల్సిన అంశంలో, అవసరంలో వారు దేనికీ భయపడరు. మహిళలు మానసికంగా పురుషుల కంటే చాలా దృఢంగా ఉంటారు. మానసికంగా చాలా ధైర్యం చూపిస్తారు.
కోరిక ఎక్కువ:
స్త్రీ యొక్క లిబిడో పురుషులకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శారీరక సంబంధం ముఖ్యం కాదు, భావోద్వేగ స్థితి కీలకం. శారీరక కోరిక విషయంలో పురుషులు చాలా త్వరగా ఉద్వేగానికి లోనవుతారు, అంతే త్వరగా చల్లబడిపోతారు. కానీ స్త్రీలు ఉద్వేగానికి రావడానికి సమయం తీసుకుంటారు, ఆ సంతృప్తిని ఎక్కువ సేపు ఆస్వాదిస్తారు. ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కామ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.



Click it and Unblock the Notifications