Latest Updates
-
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!
Chanakya Niti: పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు, లేకపోతే సంపద, ఆనందం, బంధాలు అన్ని నష్టపోతారు
ఏ ఒక్కరైనా కొన్ని తప్పులు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. ఆ తప్పులు చేయడం వల్ల డబ్బు, అధికారం, ఆనందం, సంబంధాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ పొరపాట్ల గురించి
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, మేధావి, మార్గదర్శకుడు ఇంకా చాలా. ఆయన మనిషి జీవితం గురించి తన చాణక్య నీతి గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్పాడు. మానవ సంబంధాలతో సహా వివిధ అంశాలపై సూచనలు చేశాడు. ఏ ఒక్కరైనా కొన్ని తప్పులు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. ఆ తప్పులు చేయడం వల్ల డబ్బు, అధికారం, ఆనందం, సంబంధాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దురాశ:
ప్రజలు చేసే అత్యంత సాధారణ తప్పు దురాశ పడటం. దురాశ వినాశకరమైన, విపరీతమైన పరిణామాలకు దారి తీస్తుంది. దురాశ సంపద, అధికారం, బంధుత్వాల నాశనానికి కారణం అవుతుందని చాణక్యుడు చెప్పాడు.
ఒక వ్యక్తి చాలా అత్యాశకు గురైనప్పుడు, వారు అన్నిటికంటే తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఇతరులతో వారు సంబంధాలు దెబ్బతీస్తుంది. దురాశ అనైతిక ప్రవర్తనను కూడా దారి తీస్తుంది. వ్యక్తి యొక్క ప్రతిష్ట, విశ్వసనీయతను తగ్గిస్తుంది.

అహంకారం:
డబ్బు, అధికారం, ఆనందం, సంబంధాలను నాశనం చేసే మరో తప్పు అహంకారంగా ఉంటడం. ఒక వ్యక్తి అహంకారంతో ఉన్నప్పుడు, వారు ఇతరుల కంటే తామే గొప్ప అని, ఎవరి సహాయం అవసరం లేదని భావిస్తారు. ఈ వైఖరి ఇతరులతో విభేదాలకు దారి తీస్తుంది.
ఒక వ్యక్తి నేర్చుకోవడం, ఎదగడం కూడా కష్టతరం చేస్తుంది. సానుకూల సంబందెాలను నిర్మించడం, నిర్వహించడం కష్టతరం చేస్తుంది. ఇది విజయానికి వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది.

నిజాయతీ లేనితనం:
నిజాయితీ లేని తప్పు అనేది ఒక వ్యక్తి యొక్క సంబంధాలు, కీర్తి, ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. చాణక్య నీతి నిజాయితీ యొక్క ప్రమాఖ్యతను నొక్కి చెబుతుంది.
నిజాయితీ సంపద, సంబంధాల నాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది. ఒక వ్యక్తి నిజాయితీ లేని వ్యక్తిగా ఉన్నప్పుడు, వారు ఇతరుల నమ్మకాన్ని కోల్పోతారు. అది వారి సంబంధాలు, ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నిజాయితీ లేని చట్టపరమైన, ఆర్థిక సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇది వ్యక్తి యొక్క ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగిస్తుంది.

వాయిదా వేయడం:
వాయిదా వేయడం అనేది ఒక వ్యక్తి తన లక్ష్యాలను సాధించకుండా నిరోధించే పొరపాటు, అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. చాణక్య నీతి చురుకుగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వాయిదా వేయడం సంపద మరియు అవకాశాల నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించింది.
ఒక వ్యక్తి వాయిదా వేసినప్పుడు, వారు చర్య తీసుకోవడాన్ని ఆలస్యం చేస్తారు. ఇది అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. వారి లక్ష్యాలను సాధించకుండా నిరోధించవచ్చు. వాయిదా వేయడం అనేది ఒత్తిడి మరియు ఆందోళనకు దారితీస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
