Latest Updates
-
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.! -
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.!
వైరల్ : ఆ విషయంలో హీరో ప్రిన్స్ మహేష్ బాబునే మించిపోయిన సుధీర్ బాబు.. గాల్లో తేలుతూ అందరికీ షాక్..!
తాజాగా హీరో సుధీర్ బాబు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందంటే కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో ఆసనాలు వేయడం.
సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ నుండి ప్రిన్స్ మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరో సుధీర్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. అలాగే ఎప్పుడూ గంటల కొద్దీ జిమ్ లో గడిపే ఈ కుర్ర హీరో తన సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిలను తెగ ఆకట్టుకునేవాడు. చాలా మంది మహేష్ బాబు అందాన్ని ఎంతలా పొగుడుతారో.. సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీని చూసి అంతకన్నా ఎక్కువగా పొగుడుతున్నారు.
అయితే ఈ బాబు తాజాగా కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే అవి మీరు అనుకుంటున్నట్టు జిమ్ లో గడిపే ఫొటోలో లేదా సినిమా ఫొటోలో కాదు. బాబా మాదిరిగా గాల్లో తేలుతున్న ఫొటోలు. వీటిని పోస్ట్ చేసి ఇది నిజంగానే నిజం. నన్ను నమ్మండి అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ హీరో సుధీర్ బాబు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయాల్సిందే...

రియల్ విన్యాసాలు...!
తన విభిన్నమైన నటనతో టాలీవుడ్ లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ తెగ విన్యాసాలు చేస్తున్నాడు. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు..

నెటిజన్ల షాక్...
తాజాగా హీరో సుధీర్ బాబు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందంటే కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో ఆసనాలు వేయడం.

ఎంతవరకు నిజం..
సాధారణంగా బాబాలు, స్వామిజీలు గాల్లో తేలుతూ ఆసనాలు వేయడాన్ని మనం సినిమాల్లో చూస్తుంటాం. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందనేది ఆ దేవుడికే తేలియాలి. కానీ కొంత మంది బాబాలు ఇలాంటి విన్యాసాలు చేసి చాలా మందిని మోసం చేసిన వార్తలను మనం ఎన్నో చూశాం.

ఫొటోషాప్ లేదన్నాడు..
తాను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోలకు ఫొటోషాప్ ఇన్వాల్వ్ మెంట్ అస్సలు లేదనీ సిక్స్ ప్యాక్ హీరో సుధీర్ బాబు అంటున్నాడు. అంతే కాదు నన్ను నమ్మండి అంటూ కామెంట్ కూడా పెట్టాడు. అయినా కూడా నెటిజన్లు దీన్ని అస్సలు నమ్మట్లేదు.

తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడా?
సుధీర్ బాబు రాత్రికి రాత్రే ఏమైనా తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడా? అందుకే ఇలా గాల్లో ఆసనాలు వేస్తున్నాడా? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు?

ఎట్టకేలకు జవాబిచ్చాడు..
తాను పోస్ట్ చేసిన ఫొటోలకు సంబంధించిన ప్రశ్నలకు ఎట్టకేలకు హీరో సుధీర్ బాబు స్పందించాడు. అందరూ నేను గాల్లో ఎలా తేలుతున్నాను అని అనుకుంటున్నారా? ‘ఇందులో ఎలాంటి మాయలు, మంత్రాలు, మర్మాలు లేవు. గాల్లో ఎగురుతూ ఆసనాలు ప్రయత్నించా.. అంతే ఈ రెండు ఫొటోలు కెమెరాకు చిక్కాయి‘ అని తెలిపారు.



Click it and Unblock the Notifications
