Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
కుంభంలో సూర్యుడు, గురుడు 12 ఏళ్ల తర్వాత సంయోగం.. ఈ 2 రాశుల వారికి తిప్పలే...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాలు ఏదైనా రాశిలో కలిస్తే ఆ ప్రభావం సౌరమండలంతో పాటు ఆ జాతకులతో పాటు, సాధారణ ప్రజలపైనా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కలయికే ఫిబ్రవరి నెలలో జరగనుంది.

అయితే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సూర్యుడు, గురుడు సంయోగం చెందనున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. 2022లో సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించాడు. అయితే ఇప్పటికే ఈ రాశిలో గురుడు నివాసం ఉన్నాడు.

మార్చి 15వ తేదీ వరకు ఇదే రాశిలో సంయోగంలో ఉంటాయి. ఇదంతా దాదాపు 12 ఏళ్ల తర్వాత జరగనుంది. సాధారణంగా సూర్యుడు, గురుడు మధ్య స్నేహ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి.

మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కుంభరాశిలో రెండు గ్రహాల కలయిక వల్ల మార్చి 15వ తేదీన కొన్ని రాశి చక్రాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఏయే రాశుల వారు అప్రమత్తంగా ఉండాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కుంభరాశిలో సూర్యుడు, గురుడి సంయోగం సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సమయానికి మీకు డబ్బు లభించే అవకాశం బలంగా ఉంది. ఈ కాలంలో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం లభిస్తుంది.

వృషభ రాశి..
కుంభరాశిలో గురుడు, సూర్యుడి సంయోగం వల్ల ఈ రాశి ఉద్యోగులకు ఆఫీసులో కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఏదైనా విషయంలో ఆగ్రహానికి గురవుతారు. మీరు చేసే ప్రతి పనిలో ఎదురుదెబ్బలు తగలొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కుంభరాశిలో గురుడు, సూర్యుడి సంయోగం వల్ల ఈ రాశి వ్యాపారులకు ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉద్యోగులు తాము ఊహించిన ఫలితాలను పొందొచ్చు. తాము కోరుకున్న బదిలీని పొందొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి రెండు గ్రహాల కలయిక వల్ల ఆర్థిక పరంగా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులకు చాలా దూరంగా ఉండాలి.

సింహ రాశి..
కుంభ రాశిలో గురుడు, సూర్యుడి సంయోగం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది.

కన్య రాశి..
సూర్యుడు, గురుడి సంయోగం వల్ల ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ తల్లి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిన్న సమస్య ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించండం మంచిది.

ధనస్సు రాశి..
కుంభ రాశిలో గురుడు, సూర్యుడి సంయోగం వల్ల ఈ రాశి వారికి ధైర్యం, శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా, మీరు సక్సెస్ సాధిస్తారు.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం పూర్తిగా నిజమైనది మరియు కచ్చితమైందని మేము నిర్ధారించడం లేదు. వీటిని అనుసరించే ముందు మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోగలరు.
2022లో సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించాడు. అయితే ఇప్పటికే ఈ రాశిలో గురుడు నివాసం ఉన్నాడు. మార్చి 15వ తేదీ వరకు ఇదే రాశిలో సంయోగంలో ఉంటాయి. ఇదంతా దాదాపు 12 ఏళ్ల తర్వాత జరగనుంది. సాధారణంగా సూర్యుడు, గురుడు మధ్య స్నేహ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.



Click it and Unblock the Notifications