Latest Updates
-
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు!
Angarki Chaturthi 2022 :అంగారక చతుర్థి ఫలాలు ఏడాది పాటు లభించాలంటే.. ఇలా పూజ చేయండి...!
అంగారక చతుర్థి 2022 తేదీ, శుభ ముహుర్తం, పూజా విధి, గణేష్ మంత్రాలు మరియు విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ సంప్రదాయం ప్రకారం, చాంద్రమాసంలో చతుర్థి తిథి రెండుసార్లు వస్తుంది. పురాణాల ప్రకారం, వినాయకుడు చతుర్థి రోజున జన్మించారు.

అదే విధంగా మంగళవారం నాడు వచ్చే చతుర్థి తిథికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజున అంగారక చతుర్థి అనేది యాదృచ్చికంగా ఏర్పడుతుంది. ఇది ఎంతో పవిత్రమైనది.

ఈరోజునే గణేశుడు జన్మించడంతో ఈ చతుర్థిని వినాయకుడికి అంకితం చేశారు. హిందూ పంచాంగం ప్రకారం, అమావాస్య తర్వాత వచ్చే శుక్ల పక్షంలోని చతుర్థి తిథిని వినాయక చతుర్థి అని, పూర్థిమ తర్వాత వచ్చే క్రిష్ణ పక్షంలోని చతుర్థి తిథిని సంకష్ట చతుర్థి అని అంటారు.

అయితే మంగళవారం వస్తే దానిని కచ్చితంగా అంగారక చతుర్థి అంటారు. ఈ ఏడాది 2022 సంవత్సరంలో ఏప్రిల్ 19వ తేదీన మంగళవారం నాడు అంగారక చతుర్థి వచ్చింది. ఈ సందర్భంగా అంగారక చతుర్థి రోజున పూజా పద్ధతులు, ఈ చతుర్థి ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అంగారక చతుర్థి ఫలాలు లభించాలంటే.. ఇలా పూజ చేయండి...!
మన దేశంలో చాలా మంది అంగారక చతుర్థి రోజున వినాయకునికి విధిగా పూజలు చేసి ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల ఒక సంవత్సరం పాటు చతుర్థి ఫలాలు లభిస్తాయని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు.

సంకత్మోచన్ గణేష్..
అంగారక చతుర్థి రోజున వినాయకుని నాలుగు తలలు, నాలుగు చేతులు ఉంటాయని పురాణాలలో చెప్పబడింది. ఈ వినాయకుడి రూపాన్ని సంకత్మోచన్ గణేష్ అని అంటారు. అంగారకుడు అంటే మంగళదేవుడు, తను గణేశుని కోసం తపస్సు చేశాడని, అందుకే మంగళవారం వచ్చే చతుర్థిని అంగారక గణేష్ చతుర్థి అని వరం ఇచ్చాడని చాలా మంది నమ్ముతారు.

అంగారక చతుర్థి ప్రాముఖ్యత..
అంగారక చతుర్థి రోజున గణేష్ పూజతో పాటు హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజున వెర్మిలియన్ తిలకం పెట్టుకోవడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే జాతకంలో కుజుని స్థానం శుభప్రదంగా ఉంటుంది. అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే, జీవితంలో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వంటివి వస్తాయి.

గణేశుని మంత్రం..
అంగారక చతుర్థి రోజున ఈ గణేశుని మంత్రం జపించాలి.
‘గజాననం భూత గణాది సేవితం, కపిత్త జంబూ ఫల్ చారు భక్షణం,
ఉమాసుతం శోక వినాష్కారకం, నమామి విఘ్నేశ్వర్ పాద పంకజం'

అంగారక చతుర్థి పూజా విధానం..
* అంగారక చతుర్థి వ్రతం పాటించేవారు బ్రహ్మ ముహుర్తంలో ‘ఓం గం గణపతయే నమః' అనే మంత్రాన్ని జపిస్తూ స్నానం, ధ్యానం వంటివి చేయాలి.
* ఈ పవిత్రమైన రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఇది అంగారక స్థానాన్ని బలపరుస్తుంది.
* ఉపవాస వ్రతం చేయని వారు కూడా వినాయకుడిని పూజించొచ్చు. ఉపవాసం ఉండే వారు తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చొని గణపతిని ఆరాధించాలి.
* వినాయకుని ఆరాధన సమయంలో ధూప, దీప నైవేద్యాలలో లడ్డూలు, గణేశుడికి ఇష్టమైన వస్తువులను కచ్చితంగా సమర్పించాలి.
* గణేష్ చాలీసా, గణేష్ స్తోత్రం వంటివి పూజించాలి.
* వినాయకుని పూజలో తులసిని ఎట్టి పరిస్థితిలోనూ వాడకూడదు.
* పూజ చేసే రోజంతా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
* ఉపవాస నియమాలను పాటించే వారు పండ్లను తినొచ్చు.
* చంద్రోదయానికి ముందే వినాయకుడిని పూజించాలి. వినాయక విగ్రహం లేదా చిత్రపటం వద్ద దీపారాధన చేసి, పండ్లు, పువ్వులతో నైవేద్యాన్ని సమర్పించాలి.
అంగారక చతుర్థి రోజున గణేష్ పూజతో పాటు హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజున వెర్మిలియన్ తిలకం పెట్టుకోవడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. అలాగే జాతకంలో కుజుని స్థానం శుభప్రదంగా ఉంటుంది. అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే, జీవితంలో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వంటివి వస్తాయి.



Click it and Unblock the Notifications